
ఏక్ నాథ్ షిండే
వాజపేయ్ నుంచి షిండే వరకూ మహారాష్ట్రలో అవే హోటల్ రాజకీయాలా?
బీఎంసీ మేయర్ పీఠం కోసం ఉద్దవ్ తో షిండే చేతులు కలుపుతారా?
ముంబై మేయర్ ఎన్నికపై ఇప్పుడు దేశమంతా ఉత్కంఠపై నెలకొంది. కొత్త మేయర్ ను ఎన్నుకునే ఓటింగ్ జరగడానికి ముందు అన్ని పార్టీలు తమ కౌన్సిలర్లు బాంద్రాలోని ఖరీదైన హోటళ్లకు చేర్చడంలో నిమగ్నమవుతున్నాయి.
మేయర్ పదవి కోసం అందరూ ప్రయత్నించే అవకాశం ఉన్న నేపథ్యంలో కౌన్సిలర్లపై బయటి ప్రభావాలు పడకుండా షిండే శివసేన గ్రూప్ ముందే జాగ్రత్త పడింది. తన వర్గానికి చెందిన 29 మందిని ఒక హోటల్ కు సురక్షితంగా తరలించింది.
వాజ్ పేయ్ ఏం చేశాడు..
ప్రస్తుతం కనిపిస్తున్న హోటల్ రాజకీయాలు మహారాష్ట్రలో కనిపించే పాత సంకీర్ణ రాజకీయాల వంటివి. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ అధికారంలో ఉండగా ఇవి తారాస్థాయికి చేరుకున్నాయి.
ప్రధానిగా ఆయన తొలిసారిగా పదవీ బాధ్యతలు స్వీకరించింది 1996 లోనే ఇవి ప్రారంభం అయ్యాయి. ఆయన తన తొలి ప్రయత్నంలో కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానిగా ఉన్నారు.
ఇతర పార్టీలను పణంగా పెట్టి, చీల్చి, కుప్పకూల్చి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని తాను అంగీకరించేది లేదని ఆయన అనాడు ప్రకటించారు. దానికే కట్టుబడ్డారు. ఆయన ఐదేళ్ల పాటు ప్రధానిగా సేవలు అందించడానికి మరో రెండు ఎన్నికల పాటు వేచి చూడాల్సి వచ్చింది.
పోటా పోటీ రాజకీయాలు..
బీజేపీ దాని ప్రత్యర్థులు ఒకరినొకరు అధిగమించి ఇతర పార్టీల్లోకి ప్రవేశించడానికి పోటీ పడటంతో ఇక్కడ పోటీ రాజకీయాలు ప్రారంభం అయ్యాయి. ఆరోజుల్లో మహారాష్ట్రలో ప్రముఖ బీజేపీ నాయకుడు అయిన ప్రమోద్ మహాజన్ 2004 వరకూ వాజ్ పేయ్ ప్రభుత్వం నడవడానికి సాయపడ్డాడు.
ఎన్డీఏ తొలిసారిగా అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రమోద్ మహాజన్ ను కొంతమంది ఓ ప్రశ్న అడిగారు. ఇక హంగ్ ఏర్పడితే పరిస్థితి ఏంటనీ.. ఆయన సమాధానమిస్తూ ఎన్నికైన వారికోసం రెండు చార్టర్డ్ విమానాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన సమాధానమిచ్చారు.
వారిని దూరంగా ఉన్న రిసార్ట్ లేదా హోటల్ కు తరలించి, వారి పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతిఫలంగా వారు అందించే వాటిని అంగీకరించే వరకూ వారిని ఆశ్రయించవచ్చని ఆయన మాటల్లోని అర్థం. ప్రస్తుతం మహాజన్ లేరు. కానీ ఏక్ నాథ్ షిండే ఇప్పుడు చేసిన రాజకీయం అప్పటి ఎన్డీఏ కాలంనాటి వ్యూహమే. అప్పుడు వేళ్లనుకున్న రాజకీయ ఫలితమే.
1979 లో హర్యానాలో దేవీలాల్ జనతా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కాంగ్రెస్ కు చెందిన నాయకుడు భజన్ లాల్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. అధికార పార్టీ వారితో క్రాస్ ఓటింగ్ జరిగి పీఠం నుంచి దింపివేయగలిగారు.
హోటల్ రాజకీయం..
ప్రస్తుత డిప్యూటీ సీఎం షిండే శివసేనను చీల్చిన తరువాత ఎమ్మెల్యేలను గుజరాత్, అస్సాం కు తరలించారు. తరువాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానకి ఎమ్మెల్యేలతో రాజ్ భవన్ కు వెళ్లారు.
షిండే త్యాగం..
2024 అసెంబ్లీ ఎన్నికల తీర్పు బీజేపీకి అనుకూలంగా వచ్చింది. తనకే ముఖ్యమంత్రి వస్తుందని ఆయన గట్టిగా చెప్పలేకపోయారు. దీనితో ఆయనకు ఈసారి ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది.
కానీ ఇప్పడు బంతి మళ్లీ షిండే కోర్టులోకి వచ్చింది. బీఎంసీ ఎన్నికల్లో 227 సీట్లలలో 89 సీట్లను బీజేపీ గెలుచుకోగా, 27 స్థానాలు షిండే వర్గానికి దక్కాయి. ఇప్పుడు మేయర్ పీఠం వరించాలంటే బీజేపీకి కచ్చితంగా షిండేను మచ్చిక చేసుకోవాల్సిందే. తను ముఖ్యమంత్రి పీఠాన్ని త్యాగం చేసినందుకు ముంబై మేయర్ పీఠం తమకు వదిలేయాలని ఆయన షరతు విధించవచ్చు. ఇది ఆయనకు అనుకూల సమయం.
చేతులు కలుపుతారా?
షిండే ప్రస్తుతం తన వర్గం కౌన్సిలర్లు హోటళ్లకు తరలించిన అంశంపై ముంబై రాజకీయాల్లో విస్తృత ఊహగానాలకు తెరతీసింది. ఆయన తన ప్రత్యర్థి అయిన ఉద్దవ్ ఠాక్రే వర్గంతో చేతులు కలుతారనే చర్చ జోరుగా సాగుతోంది.
ఉద్దవ్ వర్గం బీఎంసీ ఎన్నికల్లో 65 సీట్లను గెలుచుకుంది. ఇద్దరు కలిసినప్పటికీ మెజారిటీ మార్క్ కు చేరుకోనప్పటికీ కాంగ్రెస్ వంటి శక్తులు జత కలిస్తే కచ్చితంగా మరోసారి మేయర్ పీఠవం వారిదే అయ్యే అవకాశం ఉంది. రాజ్ ఠాక్రేకు ఆరు సీట్లు ఉన్నాయి. ఎంఐఎం కూడా జతకలిస్తే మరో ఐదు సంవత్సరాలు ముంబై పీఠం మరోసారి శివసేన వశం అయినట్లే.
కాబట్టి తీర్పు ఇక్కడ సుస్పష్టం. ఒకరికి మేయర్ పదవి వస్తే, మరొకరు డిప్యూటీ మేయర్ కోరవచ్చు. మరాఠా రాజకీయాల కోసం పోరాడుతున్న వారు, మరాఠేతర మేయర్ కోసం పాటుపడేవారికి అన్నట్లు మారితే ఎవరో ఒకరు రాజీపడక తప్పదు.
ముంబై మేయర్ ఎన్నిక జరిగిన తరువాత కూడా పరిస్థితి అంతా అనుకూలంగా ఉండకపోవచ్చని హోటల్ రాజకీయాలు సూచిస్తున్నాయి. హస్యాస్పదమైన అంశం ఏంటంటే.. ముంబై పేదల పరిస్థితిని మారుస్తామని ప్రారంభమైన ఎన్నికల ప్రచారం.. దేశంలోని ఇతర రాష్ట్రాల ఎన్నికల మాదిరిగానే ఎన్నికైన ప్రతినిధులను ఖరీదైన హోటల్లకు తరలించడంలో పూర్తిగా నిమగ్నమయ్యాయి.
Next Story


