
భారత్ విదేశాంగ విధానం క్రమంగా గాడితప్పుతోందా?
అమెరికా నుంచి అలీన విధానం వైపు మరోసారి ప్రయాణం
అమెరికాతో మోదీ ప్రభుత్వానికి మధ్య ర్యాపో క్రమంగా తగ్గిపోతుందా? 2014 లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా సారథ్యంలోని దాని మిత్ర దేశాల వైపు న్యూఢిల్లీ క్రమంగా మొగ్గు చూపింది. అయితే ఇప్పుడు క్రమంగా పాశ్చాత్య కూటమి వైపు క్రమంగా వెనక్కి తగ్గుతోందని చాలామంది విశ్లేషకులు అంటున్నారు.
డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యవహారంతో ఇలా జరుగుతోందా? లేక ఆయన పరిపాలన కాలంలో మిగిలిన సమయాన్ని గడపడానికి ఇలా చేస్తుందా? లేక వాషింగ్టన్ నుంచి క్రమంగా దూరంగా జరగడానికి సీరియస్ గా ప్రయత్నిస్తుందా? పరిస్థితిలో ఇంకా స్పష్టత లేదు.
ఇప్పుడు ప్రపంచం ఏక ధృవ నుంచి బహుళ ధృవం వైపు పరుగులు పెడుతోంది. ఈ పరిస్థితులలో భారత్ తన వ్యూహాలను జాగ్రత్తగా అమలు చేస్తూ తిరిగి వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అనే పాత వైపు ప్రయాణిస్తోంది.
కనిష్ట స్థాయికి సంబంధాలు..
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత భారత్- అమెరికా సంబంధాలు అత్యంత కనిష్ట స్థాయికి చేరాయి. ట్రంప్ మొదటి పరిపాలన కాలంలో భారత్ తో ఆయన సన్నిహిత సంబంధాలు నెరిపారు. అయితే రెండో పదవీకాలంలో పరిస్థితి పూర్తిగా వ్యతిరేకంగా నడుస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత బంధం మరింత బలపడుతుందని అంతా భావించారు. హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ లాంటివి ఉంటుందని అనుకున్నా వాటికి రెండు దేశాలు స్వస్తి పలికారు.
భారత్ దిగుమతులపై 50 శాతం సుంకాలతో ఈ వివాదం ప్రారంభమైంది. దీనిని తరువాత యూఎస్ఏ తగ్గించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్- పాకిస్తాన్ మధ్య తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ పదేపదే ప్రకటించారు. అయితే న్యూఢిల్లీ దీనిని తిరస్కరించింది. ఇదే సమయంలో పాకిస్తాన్ తో వైట్ హౌజ్ సన్నిహిత సంబంధాలు నెరపడం, రష్యా నుంచి చమురు దిగుమతులు, అమెరికా లో లిండ్సే గ్రాహం చట్టం ఆమోదం వంటివి న్యూఢిల్లీని అయోమయంలో పడేశాయి.
హెచ్ వన్ బీ వీసాలపై కఠిన ఆంక్షలు, అక్రమ వలసదారులను సంకెళ్లతో భారత్ కు తిప్పి పంపడం కూడా రెండు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా దిగజారుతున్నాయనే దానికి నిదర్శనంగా నిలిచింది.
కూటముల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న లావాదేవీల ధోరణి, అమెరికా కట్టుబాట్లు పై నెలకొన్న అనిశ్చితి మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. భారత్, యూఎస్ఏ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నందున వ్యవసాయ రంగాన్ని మరింతగా విస్తరించాలని భారత్ పై ఒత్తిడి పెరిగింది. ఇక్కడ మౌలిక ప్రశ్న ఏంటంటే... ట్రంప్ వాషింగ్టన్ పై అతిగా ఆధారపడటంలోని పరిమితులను కేవలం బయటపెట్టరా.. లేక అమెరికా పై భారత్ పై అంచనా మౌలికంగా మార్చేశారా అన్నదే ప్రశ్న.
అమెరికా బుట్టలోనే అన్ని..
అమెరికా పై అతిగా ఆధారపడటం లో ఉన్న ఇబ్బందులను ప్రపంచంతో పాటు, భారత్ కూడా గుర్తించిందని తల్మిజ్ అహ్మద్ వంటి మాజీ రాయబారులు అంటున్నారు. మోదీ, షీ జిన్ పింగ్ మధ్య సంప్రదింపులను భారత్, చైనా సంబంధాలలో నెలకొన్న సడలింపును దీనికి కారణంగా చూపుతున్నారు.
అమెరికా తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యాతో భారత్ మాత్రం సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. విచ్చిన్నమైన అంతర్జాతీయ వ్యవస్థలో భారత్ ప్రయాణిస్తున్న తరుణంలో బ్రిక్స్ ప్రాముఖ్యత పెరగడం, ఎస్సీఓ తో భారత్ భాగస్వామ్యం బలపడటం ఇవన్నీ భారత్ అనుసరిస్తున్న పునర్ వ్యవస్థీకరణకు సంకేతాలుగా చెప్పవచ్చు.
‘‘భారత్ కోరుకునే ఆదర్శ క్రమం అంటే సన్నిహితంగా ఉండే అమెరికా, బలమైన రష్యా, బలహీనమైన చైనా లతో కూడిన బహుధ్రువ వ్యవస్థ. ఊహించలేని అమెరికా, బలహీనమైన రష్యా శక్తివంతమైన చైనాలతో కూడిన ప్రపంచాన్ని ఎదుర్కోవడమే భారత్ ఎదుర్కొంటున్న సందిగ్థత. అందువల్ల భారత్ ప్రాథమిక వ్యూహం బహుళ అనుసంధానం, బహుపాక్షికవాదం, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిగా ఉంటుంది’’ అని హడ్సన్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన అపర్ణా పాండే ‘ది ఫెడరల్ ’ తో అన్నారు.
‘‘భారత్ ఇప్పటి వరకూ అమెరికా కు లొంగలేదు. ఆర్థిక, సాంకేతిక, వ్యూహాత్మక కారణాల వల్ల అమెరికాతో సంబంధం చాలా ముఖ్యం. చైనా శక్తివంతంగా, రష్యా బలహీనంగా ఉన్న ప్రపంచంలో మనం వాషింగ్టన్ కు దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని ఆమె అన్నారు.
కానీ నిజానికి భారత్, అమెరికా విడిచిపెట్టాలని అనుకోవడం లేదు. క్వాడ్, రక్షణ, సాంకేతికత, కీలక ఖనిజాలలో సహకారం సమాంతరంగా కొనసాగుతున్నాయి.
‘‘భారత్ ఇప్పుడు బహుళపక్ష వాదాన్ని లేదా అలీన విధానం ఆశ్రయించింది. కానీ, స్పష్టమైన ఆదర్శాలు వ్యూహం లేకపోవడంతో భారత్ విధానం అసంబద్దంగా, లక్ష్య రహితంగా కనిపిస్తోంది’’ అని న్యూయార్క్ కు చెందిన చరిత్రకారుడు, హంటర్ కాలేజ్, సిటీ యూనివర్శిటీ గ్రాడ్యూయేట్ సెంటర్ ప్రొఫెసర్ అయిన మను భగవాన్ ‘ది ఫెడరల్ ’ తో అన్నారు.
పెరుగుతున్న జాతీయవాదం, విదేశీయుల పట్ల ద్వేషాన్ని, జాతీయ అహంకారాన్ని పెంచుకోవడంపై ఆధారపడింది. ఇది ఇప్పుడూ వలస వచ్చిన, వలస వెళ్లిన భారతీయులు, భారత మూలాల జనాభాను కూడా చేర్చుకునేంతగా విస్తరించింది. భారత్ సంతతికి చెందిన వారి పట్ల శత్రుత్వం ఢిల్లీలో ఆందోళన కలిగించాలని ఎవరైనా అనుకుంటారు. అలా జరిగిందా? భారత్ ఏ విధంగా స్పందించింది? ఈ విషయంపై వారు బహిరంగంగా రహస్యంగా ఆందోళన వ్యక్తం చేశారా? అని ఆయన ప్రశ్నించారు.
ఆచరణాత్మక స్వరం..
ఈ పున: సమీకరణలో వ్యూహాత్మక చర్యలకు మరో కోణం ఉంది. గతంలో భారత ఆర్థిక లేదా సైనిక బలానికి అతీతమైన కారణాల వల్ల ప్రపంచంలో దాని వాణికి విలువ ఉండేది. స్వాతంత్య్ర పోరాట సమయంలో గాంధీజీ అహింసా తత్వంతో రూపుదిద్దుకున్న భారత విదేశాంగ విధానం, కొత్తగా స్వాతంత్య్రం పొందిన దేశం చరిత్రలో సరైన పక్షాన నిలబడాల్సిన బాధ్యత ఉందనే బలమైన నైతిక విశ్వాసం ఉండేది.
ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలో వలసవాదం, జాతి వివక్షకు వ్యతిరేకంగా ఇప్పటికే పోరాడుతున్న ప్రజల పక్షాన భారత్ తన గళం విప్పింది. వర్ణ వివక్షను తీవ్రంగా వ్యతిరేకించింది. పాలస్తీనియన్ల స్వీయ నిర్ణయాధికారానికి మద్దతు ఇచ్చింది. తన ప్రయోజనాల కోసం ప్రచ్ఛన్న యుద్ధంలోని పోటీ శక్తి కూటముల నుంచి సమదూరం పాటించడానికి ప్రయత్నించింది.
భారత్ ప్రయోజనాలు, ఆశయాలు పెరిగేకొద్ది ఆ స్వరం క్రమంగా మరింత వాస్తవికంగా మారింది. ఆచరణవాదుల దృష్టిలో ఇది విదేశాంగ విధానం, సహజ పరిణామం మాత్రమే. దేశాలు నైతిక వైఖరుల ఆధారంగా కాకుండా, భద్రత, జాతీయ ప్రయోజనాల ఆధారంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. 1991 ఆర్థిక సంస్కరణల తరువాత భారత్ తన పొరుగు దేశాలతో పీవీ నరసింహరావు ప్రభుత్వ హాయాంలో ఈ మార్పు ప్రత్యేకంగా కనిపించింది.
భారత్- ఇజ్రాయెల్ దోస్తీ...
సైనిక పాలకులతో సంప్రదింపులు జరపకపోవడం వల్ల మయన్మార్ లో భారత్ లోటును చైనా పూరిస్తుందని భావించిన రావు ప్రభుత్వం వెంటనే తన మనస్సును మార్చుకుంది. మయన్మార్ లో ప్రజాస్వామ్య ఫలితాలను అంగీకరించడానికి నిరాకరించిన సైనిక జుంటాలతో రావు ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. అయితే ఈ నిర్ణయంపై ఆంగ్ సాన్ సూకీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూకీ తండ్రి ఆంగ్ సాన్ కు నెహ్రూతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె తన బాల్యాన్ని, చదువును ఢిల్లీలోనే పూర్తి చేసుకున్నారు. ఆమె భారత్ సందర్శిన సమయంలో రావు ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్, దాని మూల సూత్రాలను విడిచిపెట్టిందని అన్నారు. తరువాత సూకీని భారత్ అరెస్ట్ చేసింది.
రాజీవ్ గాంధీ అవార్డును స్వీకరిస్తున్న సమయంలో మొదటి వరుసలో సోనియాగాంధీ, కాంగ్రెస్ మంత్రులు కూర్చొన్న సమయంలోనే సూకీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయినా భారత్ తన విధానాన్ని మార్చుకోలేదు.
పాలస్తీనా వివాదాన్ని నీరుగార్చడానికి కూడా భారత్ ప్రయత్నించింది. హమాస్ పరిపాలనను న్యూఢిల్లీ పట్టించుకోలేదు. 1992 లో పీవీ నరసింహరావు ప్రభుత్వం ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాలను ప్రారంభించింది. ఈ స్నేహాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లింది మాత్రం నరేంద్ర మోదీనే. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో వ్యక్తిగత సాన్నిహిత్యం నెరుపుతున్నారు.
గాజాలో జరుగుతున్న హింసను కొన్ని దేశాల మాదిరిగానే భారత్ కూడా ఖండించలేదు. 2023, అక్టోబర్ ఏడు నాడు ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన పాశవిక దాడులను భారత్ తక్షణమే ఖండించింది. అయితే గాజాలో జరుగుతున్న సైనిక దాడులను మాత్రం ఇప్పటి వరకూ ఖండించలేదు. పాలస్తీనాకు మద్దతు ఇస్తున్న గ్లోబల్ సౌత్ దేశాలతో న్యూఢిల్లీ విభేదిస్తోంది. ఇజ్రాయెల్ కు అమెరికా, భారత్ నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది.
లోపాలు ఉన్నాయి...
ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడి సమయంలో కూడా ఇది స్పష్టం కనిపించింది. ఇరాన్ నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై కేవలం విదేశాంగ శాఖ మాత్రమే స్పందించింది. 200 మంది పిల్లలు ఉన్న పాఠశాలపై అమెరికా దాడి చేసి హత్య చేసిన సంఘటనపై కూడా స్పందన తెలపలేదు. ఇలాంటివి అనేకం ఉన్నాయి. అయితే హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలకు కచ్చితంగా టెహ్రాన్ తో సంప్రదింపులు జరపాల్సి వచ్చింది.
అయితే భారత్ క్రమంగా తన వైఖరిని మార్చుకుంటోంది. ఈ సంవత్సరం కిర్గిజ్ స్థాన్ లోని బిష్కేక్ లో జరిగిన ఎస్సీఓ సమావేశంలో ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడులను ఖండించింది. ఇవి అంతర్జాతీయ చట్టానికి, ఐరాస చార్టర్ కు విరుద్దమని పేర్కొంది.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు పశ్చిమాసియాను అస్థిరపరిచాయని, దీనికి రెండు దేశాల విధానమే పరిష్కారమని ప్రకటించింది. ఇదే విధమైన ప్రకటన బ్రిక్స్ లో వినిపించింది. ఇవన్నీ కూడా భారత్ విదేశాంగ విధానంలో మార్పు వస్తోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
‘‘భారత్ భాగస్వామ్యం ప్రాముఖ్యతను అర్థం చేసుకునే వారు తదుపరి అధ్యక్షుడు అవుతారనే ఆశతో, భారత్ ట్రంప్ రెండో అధ్యక్ష పరిపాలన ముగిసే వరకు వేచి ఉంటుంది’’ అని పాండే అన్నారు. అయితే భారత ఉన్నత వర్గాలు అమెరికాతో మెరుగైన సంబంధాలు కోరుకుంటున్నారు.
భారత్ లో ఏ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు, వ్యాపార నాయకులు అమెరికాతో మెరుగైన సంబంధాలే కోరుకుంటున్నాయి. రష్యా లేదా చైనా తో ఉన్న సంబంధాలకు భిన్నంగా ఇరు దేశాల ప్రజలు మధ్య సంబంధాలు మాత్రం బలంగా ఉన్నాయి.
ఒకవేళ భారత్ బ్రిక్స్ తో బలమైన సంబంధాలు నెరుపుతూ ట్రంప్ తరువాత వచ్చిన యూఎస్ ప్రభుత్వం కూడా తనకు మరింత స్వేచ్ఛ కావాలని పట్టుబడితే అది వ్యవస్థాగత మార్పు వైపు ప్రయాణిస్తుంది. ట్రంప్ తరువాత అమెరికాతో సంబంధాలు వేగంగా నిర్మాణం జరిగితే ప్రస్తుత సమీకరణ చాలా వరకు వ్యూహాత్మకంగా నిజమయ్యే అవకాశం ఉంది.
Next Story

