
గ్రీస్ లో యూపీఐ సేవలు ప్రారంభిస్తున్న పీయూష్ గోయల్
ఇక నుంచి ఏథెన్స్ లో మన ‘యూపీఐ’
ప్రారంభించిన కేంద్రమంత్రి పీయూశ్ గోయల్
భారత్ లో విశేషంగా ఆదరణ పొందుతున్న యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్) ఇప్పుడు గ్రీస్ లో ప్రారంభమైంది. ఈ సేవలను వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూశ్ గోయల్ చేతుల మీదుగా ఆరంభమైంది.
యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ప్రపంచవ్యాప్త విస్తరణలో మరో మైలురాయి అని ఆయన తెలిపారు. ఫ్రాన్స్‌లోని నైస్‌లో ఉన్న ప్రముఖ డిపార్ట్‌మెంట్ స్టోర్ 'గాలరీస్ లాఫాయెట్'లో భారత్ యూపీఐని ప్రారంభించిన కొన్ని వారాల తర్వాత గ్రీస్ లోనూ ప్రారంభమైంది.
2024లో పారిస్‌లోని ఈఫిల్ టవర్‌లో యూపీఐని ప్రారంభించారు. ఇప్పుడు గ్రీస్‌లో యూపీఐ అందుబాటులోకి రావడంతో, అర్హులైన వినియోగదారులు తక్షణమే, సురక్షితంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా డబ్బును బదిలీ చేసుకోవచ్చని, లావాదేవీల ఖర్చులు సాంప్రదాయ బదిలీ ఖర్చులలో చాలా తక్కువగా ఉంటాయని ఆయన ఒక ట్వీట్ లో తెలియజేశారు.
"ఏథెన్స్‌లోని యూరోబ్యాంక్ ప్రధాన కార్యాలయంలో, యూరోబ్యాంక్ సీఈఓ శ్రీ ఫోకియన్ కరవియాస్, ఫెయిర్‌ఫాక్స్ డిజిటల్ సర్వీసెస్ సీఈఓ శ్రీ సంజయ్ తుగ్నైట్‌లతో కలిసి, యూపీఐ సేవలను ప్రారంభించే యూరోబ్యాంక్-ఎన్‌ఐపీఎల్ భాగస్వామ్యంతో ఇది ప్రారంభం కావడం ఆనందంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
UPIకి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆమోదం, ప్రశంసలు, సరిహద్దులకు అతీతంగా విలువను సృష్టించే సాంకేతికత ఆధారిత పరిష్కారాలను రూపొందించడంలో ఉమ్మడి వృద్ధి, శ్రేయస్సు కోసం భాగస్వామ్యాలను పెంపొందించడంలో భారత్ పై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు.
గ్రీస్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, భూటాన్, ఖతార్, శ్రీలంక, కంబోడియా లాంటి పది దేశాలలో UPI ఇప్పుడు సేవలు అందిస్తోంది. ఇది భారతీయ ప్రయాణికులకు సుపరిచితమైన ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విదేశాలలో సులభంగా చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తోంది.
Next Story

