
ముడి చమురు ఒత్తిడితో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ఆసియా, అమెరికా మార్కెట్లోనూ డౌన్ ఫాల్ అయిన సూచీలు
ముడిచమురు ధరలలో అనిశ్చితి, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, విదేశీ నిధుల తరలింపు కారణంగా భారత్ సహ ప్రపంచ మార్కెట్ లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రారంభ ట్రేడింగ్ లో 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 503 పాయింట్లు పడిపోయి, 72,206 పాయింట్ల వద్ద ముగిసింది. 50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 151 పాయింట్లు పడిపోయి 22,626 వద్ద ముగిసింది.
బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ లు భారీగా నష్టపోయాయి. సన్ ఫార్మా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్ మాత్రం లాభాలు ఆర్జించాయి.
ప్రపంచ చమురు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 1.74 శాతం పెరిగి 107 డాలర్లకు చేరింది. దీనితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై విపరీతమైన ఒత్తిడి నెలకొంది. అమెరికా - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగడం కూడా దీనికి మరో కారణంగా చెప్పవచ్చు.
హర్ముజ్ జలసంధి నుంచి కానీ అటూ బాబ్ ఎల్ మాండేబ్ నుంచి కానీ గల్ఫ్ దేశాల నుంచి ముడిచమురు సరఫరా కాకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా కల్లోల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో వైపు రష్యా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు చేయడంతో పరిస్థితి మరింత ముదిరిపాకాన పడింది.
ఎక్స్ చేంజ్ డేటా ప్రకారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సోమవారం ఒక్కరోజే రూ. 5,353 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియాలోని కోస్పీ, జపాన్ నిక్కీ 225 సూచీ, హంగ్ కాంగ్ సెంగ్ సూచీ కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సోమవారం అమెరికా సూచీలు కూడా నష్టాల్లో ముగిశాయి. సోమవారం సెన్సెక్స్ 1,124 పాయింట్లు లేదా 1.52 శాతం పతనమై 72,771 వద్ద ముగిసింది. ఇది 2026 మార్చి 30 తరువాత అత్యంత కనిష్ట స్థాయి ముగింపుగా నిఫుణులు చెబుతున్నారు. నిఫ్టీ 360. 25 పాయింట్లు లేదా 1.56 శాతం పతనమై 22,780.25 వద్ద ముగిసింది.
Sensex, Nifty
Next Story

