
అమెరికా నిబంధనల వల్ల మాకేం నష్టం లేదు: ఇన్ఫోసిస్
పెర్మ్, గ్రీన్ కార్డులకు భారీగా పడిపోయిన దరఖాస్తులు
యూఎస్ ప్రభుత్వం శాశ్వత కార్మిక ధృవీకరణ(పీఈఆర్ఎం) కార్యక్రమం కింద ఉన్న దరఖాస్తులను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల తమ పై ఎటువంటి ప్రభావం ఉండదని ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తెలిపింది.
స్టాక్ ఎక్స్ ఛేంజ్ లకు సమర్పించిన ఒక ఫైలింగ్ లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. బెంగళూర్ కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న ఇన్ఫోసిస్.. ఏవైన సందేహాలు నివృత్తి చేయడానికి యూఎస్ కార్మిక శాఖ, సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీ లతో కలిసి పనిచేసే అవకాశాన్ని స్వాగతిస్తామని పేర్కొంది.
‘‘నిన్నటి సస్పెన్షన్ ప్రకటన సంస్థ ప్రభావం చూపుతుందని మేము అనుకోవడం లేదు. ఇన్ఫోసిస్ యునైటెడ్ స్టేట్స్ లో బలమైన స్థానిక శ్రామిక శక్తిని, టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్ లను నిర్మించడంలో పెట్టుబడి పెట్టింది. కంపెనీ యునైటెడ్ స్టేట్స్ అంతటా ఉన్న తన ఉద్యోగులకు, క్లయింట్ లకు, కమ్యూనిటీలకు కట్టుబడి ఉంది. స్థానికంగా వర్తించే అన్ని చట్టాలు, నిబంధనలను పాటిస్తుంది’’ అని ఇన్ఫోసిస్ తెలిపింది.
ఈ విధానం అమెరికన్ కార్మికులకు దేశీయ ఉద్యోగ మార్కెట్ నుంచి దూరం చేసిందన్న వాదన నేపథ్యంలో విదేశీ సిబ్బందికి శాశ్వత నివాసం(గ్రీన్ కార్డ్) కోసం దరఖాస్తు చేసుకునేందుకు యజమానులకు వీలు కల్పించే కార్యక్రమం నుంచి భారతీయ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్ సీఎల్ టెక్నాలజీస్ తో సహ ఎనిమిది ప్రధాన టెక్నాలజీ సంస్థలను గురువారం అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేసిన నిర్ణయం నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. గ్లోబల్ సంస్థలైన క్యాప్ జెమిని, కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్, అడోబ్ ల పేర్లు కూడా ఉన్నాయి.
విదేశీ కార్మికులకు శాశ్వత ప్రాతిపదికన నియమించుకోవాలనే యజమానులకు యూఎస్ కార్మిక శాఖ జారీ చేసిన పీఈఆర్ఎం ధృవీకరణ పత్రం ప్రాథమిక అవసరం. ఇదే తరువాత గ్రీన్ కార్డు పొందడానికి ప్రధాన మార్గంగా పనిచేస్తుంది.
భారతీయ పరిశ్రమ గణాంకాల ప్రకారం.. ఇటీవల కాలంలో మన కంపెనీలు భారీ స్థాయిలో గ్రీన్ కార్డు దరఖాస్తులు భారీగా తగ్గించుకున్నాయి. టీసీఎస్ 2024 లో 1804 దరఖాస్తులు చేయగా 2025 నాటికి 513 కి తగ్గించుకుంది. 2026 లో యూఎస్ కేవలం రెండ్ పీఈఆర్ఎం దరఖాస్తులు మాత్రమే దాఖలు చేసింది. హెచ్ సీఎల్ 2025 లో 323 దరఖాస్తులు చేయగా, 2026 లో కేవలం 59 మాత్రమే చేసింది. ఇన్ఫోసిస్ 2024 లో కేవలం 87 దరఖాస్తులు మాత్రమే చేసింది.
విప్రో ప్రకారం 2024 లో 257, 2025 లో 523 అప్లై చేసింది. వీటిలో 2024 లో 169 దరఖాస్తులను యూఎస్ తిరస్కరించింది. మరో 88ని కంపెనీ ఉప సంహరించుకుంది.
‘‘గత ఏడాది యూఎస్ జారీ చేసిన 1,17,849 పెర్మ్ సర్టిఫికెట్లలో భారతీయ ఐటీ కంపెనీలకు కేవలం 1400 మాత్రమే దక్కాయి. అంటే రెండు శాతం కంటే తక్కువ. అందువల్ల దీని ప్రత్యక్ష ప్రభావం తీవ్రంగా ఉండకపోవచ్చు’’ అని హెచ్సీఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈఓ వినీత్ నాయర్ ఒక పోస్ట్ లో పేర్కొన్నారు.
గత రెండు ఏళ్లలో తమ పెర్మ్ దరఖాస్తులు.. సింగల్ డిజిట్లకు పడిపోయాయని, ఈ నిలిపివేత తమ క్లయింట్ కట్టుబాట్లను లేదా టాలెంట్ వ్యూహాన్ని ప్రభావితం చేయదని పేర్కొంటూ, టీసీఎస్ కూడా ఈ పరిణామాన్ని తక్కువ చేసి చూపింది.
తమ యూఎస్ కార్మిక శక్తి వ్యూహం, పటిష్టమైన క్యాంపస్ రిక్రూట్ మెంట్ నమూనా మద్దతుతో స్థానిక ప్రతిభను నియమించుకోవడంపై ఆధారపడి ఉందని, అలాగే కంపెనీ 31 కార్యాలయాలు, డెలివరీ కేంద్రాలలో గణనీయమైన స్థానిక కార్మిక శక్తిని నిర్మించిందని ఆ సంస్థ తెలిపింది.
గతంలో ప్రకటించినట్లుగా, తమ స్థానిక ఉద్యోగుల సంఖ్యను మరింత పెంచుకోవడానికి రాబోయే ఐదేళ్లలో అమెరికాలో అదనంగా 15 వేల మందిని నియమించుకోవాలని భావిస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది.
Next Story

