హైదరాబాద్‌కు త్వరలో 15 విదేశీ విశ్వవిద్యాలయాలు(వీడియో)
x

హైదరాబాద్‌కు త్వరలో 15 విదేశీ విశ్వవిద్యాలయాలు(వీడియో)

అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ తదితర దేశాలకు చెందిన ప్రముఖ యూనివర్సిటీలు తమ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటుచేయాలని డిసైడ్ అయ్యాయి


అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోంది. విదేశాలకు చెందిన 15 విశ్వవిద్యాలయాలు హైదరాబాదులో తమ క్యాంపస్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించటమే దీనికి నిదర్శనం. అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ తదితర దేశాలకు చెందిన ప్రముఖ యూనివర్సిటీలు తమ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటుచేయాలని డిసైడ్ అయ్యాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వంతో పైదేశాల్లోని విశ్వ విద్యాలయాల యాజమాన్యాలు చర్చలు జరుపుతున్నాయి.

కేంద్రప్రభుత్వ జాతీయ విద్యా విధానం 2020, యూజీసీ నిబంధనలను సరళీకరించటంతో విదేశాలకు మనదగ్గర యూనివర్సిటీలను ఏర్పాటుచేసే వెసులుబాటు దక్కింది. యూనివర్సిటీ ఆఫ్ లండన్, కొలరాడో యూనివర్సిటీల యాజమాన్యాలు యూజీసీతో చర్చలు జరుపుతున్నాయి. మిగిలిన మెట్రో నగరాలతో పోల్చినపుడు హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యం అవటమే విదేశాల చూపు హైదరాబాద్ పై నిలిచింది. ఏరోస్పేస్, ఐటీ, ఫార్మా, డేటాసెంటర్ల ఏర్పాటులో హైదరాబాద్ శరవేగంగా పుంజుకుంటోంది.

అందుకనే ఈ రంగాలతో పాటు మాన్యుఫాక్షరింగ్ రంగంలోని కంపెనీలకు అవసరమైన ప్రాక్టికల్ విద్యను సిలబస్ రూపంలో విదేశీ విశ్వవిద్యాలయాలు విద్యార్ధులకు అందించబోతున్నాయి. యూనివర్సిటీల ఏర్పాటుకు నానక్‌రామ్‌గూడ, కొల్లూరు-తెల్లాపూర్, శంషాబాద్, మహేశ్వరం-ఆదిబట్ల, హౌదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు భూములను పరిశీలిస్తున్నాయి. విదేశీ విశ్వవిద్యాలయాలు స్ధానిక యూనివర్సిటీలతో కొలాబరేట్ అవటంలేదని ఉన్నత విద్యా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు చెప్పారు విదేశీ యూనివర్సిటీలే విద్యార్ధులకు నేరుగా డిగ్రీలు ప్రధానం చేస్తాయని కూడా విశ్వేశ్వరరావు చెప్పారు.

Read More
Next Story