టీచర్లలో ‘టెట్’ నిర్వహణ తీరుపై పెరిగిపోతున్న వ్యతిరేకత(వీడియో)
x

టీచర్లలో ‘టెట్’ నిర్వహణ తీరుపై పెరిగిపోతున్న వ్యతిరేకత(వీడియో)

క్వాలిఫై కాకపోవటానికి కారణం బోధిస్తున్న సబ్జెక్టుల్లో కాకుండా సంబంధంలేని సబ్జెక్టుల పరీక్షలు రాయాల్సి రావటమే అని టీచర్ సంఘాలు మండిపడుతున్నాయి


ప్రభుత్వం నిర్వహించిన టెట్(టీచర్ ఎలిజిబులిటి టెస్ట్)పై టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే జూన్లో నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాల్లో పరీక్షలు రాసిన సుమారు 23 వేల మంది టీచర్లలో 14,841 మంది క్వాలిఫై కాకపోవటమే. క్వాలిఫై కాకపోవటానికి కారణం బోధిస్తున్న సబ్జెక్టుల్లో కాకుండా సంబంధంలేని సబ్జెక్టుల పరీక్షలు రాయాల్సి రావటమే అని టీచర్ సంఘాలు మండిపడుతున్నాయి. 20, 30 ఏళ్ళపాటు పాఠాలు బోధిస్తున్న టీచర్లు టెట్ పేరిట తమ సామర్ధ్యాన్ని నిరూపించుకోవాల్సిన రావటాన్ని ఉపాధ్యాయులు చిన్నతనంగా భావిస్తున్నారు.

2012 తర్వాత ప్రభుత్వ టీచర్లుగా ఎంపిక అవ్వాలంటే ప్రతి ఒక్కళ్ళు టెట్, డీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సిందే అన్న సుప్రింకోర్టు తీర్పుప్రకారమే రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ టీచర్లుగా చేరాలన్నా, ప్రమోషన్ కావాలన్నా టెట్ పరీక్ష పాసవ్వటం తప్పనిసరి చేసిన సుప్రింకోర్టు తీర్పు. 2028లోపు టెట్ పరీక్షలు పాసవ్వని టీచర్లను ఉద్యోగాలనుండి తొలగించాలని సుప్రింకోర్టు ఆదేశించింది. పరీక్షల నిర్వహణలోనే లోపాలున్నాయని ఆరోపిస్తున్న టీచర్లు, యూనియన్ నేతలు.

సైన్స్ సబ్జెక్టు బోధించే టీచర్‌ను మ్యాథ్స్, సోషల్ సబ్జెక్టులో పరీక్ష రాయమని చెప్పటం, రాయలేకపోతే ఫెయిల్ చేయటం ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానంగా యూనియన్లు మండిపోతున్నాయి. ఏ సబ్జెక్టు బోధించే టీచర్‌కు ఆ సబ్జెక్టులో పరీక్ష పెట్టాలని డిమాండ్ చేస్తున్న టీచర్ యూనియన్లు.

Read More
Next Story