బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత
x

బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత

గోవాలో సొంత ఇంటిలో గుండె పోటు, ఆస్పత్రికి తరలించిన దక్కని ప్రాణాలు


Click the Play button to hear this message in audio format

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానాపటేకర్(75) గురువారం తీవ్రమైన ఛాతినోప్పితో మరణించాడు. గోవాలోని డోనాపౌలాలో నివాసం ఉంటున్న పటేకర్.. గురువారం ఉదయం ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించాడు. కుటుంబ సభ్యులు ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సుమారు 45 నిమిషాలు చికిత్స అందించిన ఆయన ప్రాణాన్ని కాపాడలేకపోయారు. ఉదయం 5.20 నిమిషాలకు పటేకర్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

సీపీఆర్ చేసినా...

‘‘45 నిమిషాల పాటు నిరంతరాయంగా సీపీఆర్ చేసినప్పటికీ ఆయనను బ్రతికించలేకపోయాము’’ అని మణిపాల్ ఆసుపత్రికి చెందిన ఆంకాలజీ విభాగం చీఫ్ డాక్టర్ శేఖర్ సల్కర్ జాతీయ మీడియాకు తెలిపారు. ‘‘ వైద్య న్యాయ కేసు(ఎంఎల్సీ) నమోదు చేశాం. పోస్ట్ మార్టం నిర్వహిస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.
పటేకర్ కుమారుడు మల్హార్ పుణెకు వెళ్లాడు. ఆయన మరణ వార్త తిరిగి గోవాకు ప్రయాణం అయ్యాడు. పటేకర్ నాలుగు రోజుల క్రితం గోవాలో బహిరంగంగా కనిపించారు. ఆయన డోనాపౌలాలో జరిగిన సామ్రాట్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాపన కార్యక్రమానికి హజరై ప్రసంగించారు.

‘గామన్’ తో కెరీర్ ప్రారంభం..

1951, జనవరి 1న మహారాష్ట్రలో జన్మించిన ఆయన అసలు పేరు విశ్వనాథ్ పటేకర్, 1978 లో ‘గమన్’ అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించారు. ‘పరిందా’ లో ఆయన నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.
పటేకర్ అంగార్, తిరంగా, క్రాంతివీర్, అగ్నిసాక్షి, ఖామోషీ: ది మ్యూజికల్, యశ్వంత్, అబ్ తక్ ఛప్పన్, అపహరన్, రాజ్ నీతి వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

కొత్తతరం అభిమానుల..

‘వెల్కమ్’ చిత్రంలోని ఉదయ్ శెట్టి పాత్రతో ఆయన కొత్తతరం ప్రేక్షకులను కూడా ఆకర్షించారు. ఆ తరువాత వెల్కమ్ బ్యాక్ లోనూ ఇదే పాత్ర పోషించారు. మరాఠీ చిత్ర పరిశ్రమలో ‘నట సామ్రాట్’ చిత్రంలో ఆయన నటనకు గాను 2016 లో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది. ఆయన తన కెరీర్ లో ఇతర నటన విభాగాలలో కూడా ఫిల్మ్ ఫేర్ అవార్డులు కైవసం చేసుకున్నారు.

మూడు జాతీయ పురస్కారాలు.. పద్మ శ్రీ...

పటేకర్ మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు. సినిమా, కళలకు ఆయన చేసిన సేవలకు గాను 2013 లో ఆయన పద్మ శ్రీ పురస్కారం లభించింది. ఆయన యశ్వంత్, వజూద్, ఆంచ్ చిత్రాలకు నేపథ్య గాయకుడిగా ఉన్నారు.
కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా సామాజిక సేవ కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. ఇందులో వ్యవసాయం వల్ల నష్టపోయిన రైతులు, కుటుంబాలకు సంబంధించిన ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఆయన చివరగా ‘హౌస్ ఫుల్ 5 ’ లో కనిపించారు.


Read More
Next Story