జబర్దస్త్ కి నాగబాబు రీ ఎంట్రీ, లాభమా, నష్టమా?
x

'జబర్దస్త్' కి నాగబాబు రీ ఎంట్రీ, లాభమా, నష్టమా?

మల్లెమాల మాస్టర్ ప్లాన్


ఒకప్పుడు గురు, శుక్రవారాలు వస్తే చాలు.. రాత్రి తొమ్మిదిన్నరకి టీవీల ముందు జనం వాలిపోయేవారు. డబుల్ మీనింగ్‌లు ఉన్నా, బాడీ షేమింగ్ అని కొందరు విమర్శించినా.. 'జబర్దస్త్' నవ్వుల విందుకు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేకుండా పోయింది. కానీ, ఇదంతా ఒకప్పటి ముచ్చట. ప్రస్తుతం ఈ షో పరిస్థితి చూస్తుంటే.. మల్లెమాల యాజమాన్యానికి చెమటలు పడుతున్నాయన్నది ఇండస్ట్రీ టాక్. ఈ క్రమంలోనే పాతాళానికి పడిపోయిన రేటింగ్స్‌ను మళ్లీ పైకి లేపడానికి 'మెగా బ్రదర్' నాగబాబును రంగంలోకి దించారు.

నవ్వుల బాస్ మళ్లీ వచ్చేశాడు!

జబర్దస్త్ ప్రేక్షకులకు నాగబాబు ఒక జడ్జి మాత్రమే కాదు, ఆ షోకి ఆయనే ఒక సిగ్నేచర్. ప్రస్తుతం జడ్జిలుగా ఉన్నవాళ్లు తమ పని తాము చేస్తున్నా.. నాగబాబులో ఉండే ఆ 'ఎనర్జీ' వారిలో కనిపించడం లేదు. స్కిట్ మధ్యలో నాగబాబు ఇచ్చే రన్నింగ్ కామెంట్రీ, ఆ పగలబడి నవ్వే నవ్వు ప్రేక్షకుల్లో ఒక జోష్ నింపేవి. ఆయన రాకతో షోకు పోయిన 'కళ' మళ్లీ వస్తుందని యాజమాన్యం గట్టిగా నమ్ముతోంది.

మల్లెమాల-మెగా బ్రదర్ మధ్య 'రాజీ' కుదిరిందా?

గతంలో మల్లెమాల సంస్థపై నాగబాబు చేసిన విమర్శలు అప్పట్లో పెద్ద దుమారమే లేపాయి. నిర్వహణ సరిగా లేదని, ఆర్టిస్టులను సరిగా చూడటం లేదని ఆయన ఓపెన్‌గానే మాట్లాడారు. అయితే ఇప్పుడు మళ్లీ అదే సంస్థ నాగబాబును పిలవడం చూస్తుంటే.. షో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగత విభేదాల కంటే షో మనుగడే ముఖ్యమని భావించి మల్లెమాల ఒక అడుగు వెనక్కి వేసి మరీ ఆయన్ని తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది.

ఓ రకంగా నాగబాబును తిరిగి తీసుకురావడం. ఇది కంబ్యాక్ కాదు…సర్వైవల్ స్ట్రాటజీ అని చెప్పాలి.

నాగబాబు రాక — ఎనర్జీనా? లేక రిస్క్?

నాగబాబు అంటే జబర్దస్త్‌లో కేవలం జడ్జ్ కాదు. ఆయన షో “రిథమ్”. స్కిట్ మధ్యలో చేసే రన్నింగ్ కామెంట్స్. పగలబడి నవ్వే రియాక్షన్స్. కమెడియన్స్‌తో ఉండే కెమిస్ట్రీ. ఇవి షోకి “లైవ్ ఫీల్” ఇచ్చేవి. కానీ ఇప్పుడు ప్రశ్న: అదే మ్యాజిక్ ఇప్పటికీ పని చేస్తుందా?

ఎందుకంటే:

ఆడియన్స్ మారిపోయారు.

హ్యూమర్ స్టైల్ మారిపోయింది

పేస్ మారిపోయింది

అంటే… ఓ రకంగానాగబాబు రాక ఒక ప్లస్ మాత్రమే కాదు.ఒక పెద్ద రిస్క్ కూడా.

“ఫెయిల్ అయితే?” — ఇది మల్లెమాల లాస్ట్ గాంబ్లా?

ఈ రీఎంట్రీ వెనుక ఒక పెద్ద భయం ఉంది: “ఇది కూడా వర్క్ కాకపోతే?”. ఏం చేయాలి. స్టార్ కమెడియన్స్ తిరిగి వచ్చినా ఉపయోగం ఉండకపోతే ..ఏమిటి నెక్ట్స్ స్టెప్. ఇది నిజానికి: మల్లెమాల లాస్ట్ ట్రై లాంటిదే.

స్టార్ కమెడియన్స్ — రివర్స్ మైగ్రేషన్ జరుగుతుందా?

నాగబాబు బయటకు వెళ్లినప్పుడు: సుడిగాలి సుధీర్, గెటప్ శీను, హైపర్ ఆది ఇలా ఒక్కొక్కరిగా దూరమయ్యారు. ఇప్పుడు నాగబాబు తిరిగి వస్తే వాళ్లు కూడా తిరిగి వస్తారా?

అదే జరిగితే:

షోకి నాస్టాల్జియా బూస్ట్ వస్తుంది

ఫ్యాన్స్ మళ్లీ కనెక్ట్ అవుతారు

కానీ…

అదే పాత టీమ్‌తో కొత్త ఆడియన్స్‌ను ఆకట్టుకోగలరా? ఇది కీలక ప్రశ్న.

ఈ షోకి అసలు శత్రువు — టీవీ కాదు, మొబైల్

జబర్దస్త్ కు పోటీ ఛానెల్స్ టీవీ షోలతో కాదు. YouTube, Instagram, Reels‌తో. మారిన కాలంలో 30 నిమిషాల స్కిట్ ఎవరు చూడటం లేదు. 30 సెకండ్ల పంచ్ సరిపోతుంది.

కొత్త జనరేషన్:

స్కిట్ కోసం వేచి ఉండదు. స్క్రోల్ చేస్తుంది

అంటే… ఓ రకంగా జబర్దస్త్ ఫార్మాట్ itself అవుట్‌డేటెడ్ అవుతోంది.

ఆడియన్స్ మారిపోయాడు — షో మారుతుందా?

ఒకప్పుడు: స్లో బిల్డ్ కామెడీ

ఇప్పుడు: ఇన్‌స్టంట్ పంచ్

ఒకప్పుడు: క్యారెక్టర్ బేస్డ్ స్కిట్స్

ఇప్పుడు: మీమ్ బేస్డ్ హ్యూమర్

నాగబాబు వచ్చి పాత ఫార్మాట్‌ను revive చేస్తాడా? లేక షోను పూర్తిగా రీడిజైన్ చేస్తారా? ఇదే గేమ్ ఛేంజర్.

రాజకీయ ఇమేజ్ vs కామెడీ ఫ్రీడమ్

ఇప్పటి నాగబాబు: కేవలం ఎంటర్టైనర్ కాదు, రాజకీయంగా కూడా ఒక ఫిగర్ . ఇది షోపై ప్రభావం చూపుతుందా?

ఈ నేపధ్యంలో అనేక ప్రశ్నలు .. కామెడీపై లిమిట్స్ వస్తాయా?సెటైర్ తగ్గుతుందా?, ఇమేజ్ మేనేజ్‌మెంట్ పెరుగుతుందా?. “ఫ్రీ కామెడీ” నుంచి “కంట్రోల్డ్ కామెడీ”కి షిఫ్ట్ అయితే… అది ప్రమాదకరం.

ఏదైమైనా ఒకప్పుడు నవ్వులతో టీఆర్‌పీలు కొట్టిన ‘జబర్దస్త్’… ఇప్పుడు తిరిగి రీలాంచ్ అవ్వటం కోసం తనే సృష్టించిన ఐకాన్‌ను మళ్లీ ఆశ్రయిస్తోంది.

నాగబాబు రాకతో:

ఎనర్జీ వస్తుంది నాస్టాల్జియా వస్తుంది కానీ… కాలం మారిపోయింది. ప్రేక్షకుడు మారిపోయాడు. ఇది ఇప్పుడు కేవలం షో కథ కాదు… సర్వైవల్ డ్రామా.

Read More
Next Story