సమంతకు ఆ ఇద్దరి హీరోలతోనే సమస్య?
x

సమంతకు ఆ ఇద్దరి హీరోలతోనే సమస్య?

ఎవరా హీరోలు..ఏమా కథ


ప్రస్తుతం తెలుగులో చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు థియేట్రికల్ మార్కెట్ పరిస్థితి భయంకరంగా మారింది. ఒకప్పుడు స్టార్ వాల్యూ, ఫ్యామిలీ ఇమేజ్, సాంగ్స్‌తో ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రేక్షకుల తీర్పు పూర్తిగా మారిపోయింది. చిన్న పొరపాటు జరిగినా సరే... మిడ్ రేంజ్ సినిమాలను ఆడియన్స్ నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టేస్తున్నారు. ట్రైలర్‌లో కిక్ లేకపోయినా, ప్రమోషన్స్ కనెక్ట్ కాకపోయినా, కంటెంట్‌పై సందేహం వచ్చినా థియేటర్లకు రావడం మానేస్తున్నారు.

దాంతో ఇప్పుడు మీడియం రేంజ్ సినిమా రిలీజ్ అంటే నిర్మాతల గుండెల్లో నిజంగానే రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి. అలాంటి టైమ్‌లోనే సమంత ‘మా ఇంటి బంగారం’ తో దిగుతోంది. అయితే ఈ సినిమా కేవలం థియోటర్స్ కు జనం రావటం, రాకపోవటం అనే సమస్య కాకుండా మరో రెండు సమస్యలు వెంబడిస్తున్నాయి.

చాలా కాలంగా సిల్వర్ స్క్రీన్‌కు దూరంగా ఉన్న సామ్... ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలనే కసితో ఉంది. ఇందుకోసం దర్శకురాలు నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమాపైనే ఆమె కొండంత ఆశలు పెట్టుకుంది. ఒక పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం సమంత కెరీర్‌కు అత్యంత కీలకంగా మారింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాను ముంచేయడానికి రెండు భారీ గండాలు పొంచి ఉన్నాయనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అసలు సమంతను భయపెడుతున్న ఆ రెండు ప్రమాదాలు ఏంటో చూస్తే..

ప్రమాదం 1: దళపతి విజయ్ ‘రాజకీయ’ తుఫాన్!

మొదట మే 14న రావాల్సిన ‘మా ఇంటి బంగారం’ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం వల్ల జూన్ 19కి వాయిదా పడింది. అయితే, సరిగ్గా అదే తేదీన కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జననాయగన్’ విడుదల కాబోతున్నట్లు సమాచారం.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. విజయ్ ఇప్పుడు తమిళనాడు సీఎం అయ్యారు. ఆయన కెరీర్‌లో ఇదే చివరి సినిమా కావడంతో తమిళనాట దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

స్క్రీన్ల కొరత: విజయ్ క్రేజ్ ముందు సమంత సినిమాకు తమిళనాడులో థియేటర్లు దొరకడం గగనమే.

మార్కెట్ దెబ్బతినే ప్రమాదం: సమంతకు తమిళంలో మంచి మార్కెట్ ఉంది. కానీ విజయ్ ‘రాజకీయ తుఫాన్’ ముందు సామ్ సినిమా కొట్టుకుపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రమాదం 2: అక్కినేని వర్సెస్ సమంత..!

సమంతకు ఎదురుకాబోతున్న రెండో ప్రమాదం మరింత వివాదాస్పదంగా మారేలా ఉంది. ‘మా ఇంటి బంగారం’ విడుదలైన వారం రోజులకే, అంటే జూన్ 26న అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ సినిమా థియేటర్లలోకి వస్తోంది.

టార్గెట్ కాబోతున్న సామ్:

సమంతకు, అక్కినేని కుటుంబానికి ఉన్న గత అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అఖిల్ సినిమాతో వారం రోజుల వ్యవధిలోనే ఈ క్లాష్ జరగబోతుండటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు, ఫ్యాన్స్ మధ్య వార్ దారుణంగా మారేలా ఉంది.

నెగిటివ్ ప్రచారం:

ఈ ఇండైరెక్ట్ క్లాష్ వల్ల సమంత సినిమాను టార్గెట్ చేస్తూ నెగిటివ్ ట్రోలింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు.

ఏదైమైనా...

రిలీజ్ డేట్లు ఒత్తిడి పెడతాయి... కానీ బాక్సాఫీస్‌లో చివరికి నిలబెట్టేది కంటెంట్ మాత్రమే. అయితే ఈసారి సమంత ముందున్నది కేవలం ఓపెనింగ్ సమస్య కాదు... ఎమోషన్స్, ఫ్యాన్ వార్స్, స్టార్ పొలిటిక్స్ కలిసి తయారైన అసలు పరీక్ష.

Read More
Next Story