
రజనీ క్రేజ్‌కు బ్రేకులు వేసిన బాలయ్య!?
జైలర్ 2 తెలుగు రిలీజ్ పై సస్పెన్స్!
Rajinikanth పేరు ఉంటేనే బాక్సాఫీస్ గేట్ దగ్గర ఫెస్టివల్ స్టార్ట్ అయిపోతుంది. Jailer తో వచ్చిన బ్లాక్‌బస్టర్ వేవ్ ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పుడు అదే వేవ్‌ను మల్టిప్లై చేయాలని చూస్తున్నది Jailer 2. డైరెక్టర్ Nelson Dilipkumar — స్టైల్, డార్క్ హ్యూమర్, మాస్ ఎలివేషన్స్… అన్నీ రెడీ. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే తెలుగు మార్కెట్‌లో “హైప్ = సేఫ్ బిజినెస్” అనే ఫార్ములా ఇప్పుడు వర్క్ కావడం లేదు. అసలేం జరుగుతోంది?
రజనీకాంత్ మాస్ మేనియా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'జైలర్' సృష్టించిన ప్రభంజనం తర్వాత ఇప్పుడు అందరి కళ్లు 'జైలర్ 2' పైనే ఉన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్టు రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ, తెలుగు బిజినెస్ దగ్గరకు వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని షాక్ తగిలింది.
ఆ భారీ రేటు చూసి బయ్యర్లు పరార్?
'జైలర్' సినిమా తెలుగులో సంచలన వసూళ్లు సాధించడంతో, ఇప్పుడు సీక్వెల్‌కు ఏకంగా రూ. 60 కోట్ల మేర థియేట్రికల్ రైట్స్ కోట్ చేస్తున్నారట మేకర్స్. ఈ భారీ ఫిగర్ వినగానే టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూటర్లు సైతం వెనకడుగు వేస్తున్నారు. నాన్-థియేట్రికల్ బిజినెస్ ఎప్పుడో క్లోజ్ అయిపోయినా, తెలుగు థియేట్రికల్ డీల్ మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. రిలీజ్‌కు ఇంకా సమయం ఉండటంతో, ఇప్పుడే అంత రిస్క్ చేయడం అవసరమా అని నిర్మాతలు ఆలోచనలో పడ్డారు.
కాగితం మీద లాజిక్ ఉంది:
‘జైలర్’ తెలుగు కలెక్షన్స్ సాలిడ్ గా ఉంది. రజనీకాంత్ బ్రాండ్ ఎప్పుడూ ఎవర్‌గ్రీన్. సీక్వెల్ ఫ్యాక్టర్ బాగానే హైప్ క్రియేట్ చేస్తుంది.
కానీ డిస్ట్రిబ్యూటర్స్ దృష్టిలో మ్యాథ్ ఇలా ఉంటుంది:
Break-even అంటే కనీసం ₹100–110 కోట్ల గ్రాస్ అవసరం. OTT, TV రైట్స్ ఇప్పటికే సేల్ అయిపోయాయి (సేఫ్టీ నెట్ తగ్గింది). రీసెంట్‌గా డబ్బింగ్ సినిమాలపై టెలుగు ఆడియన్స్ సెలెక్టివ్‌గా రిస్పాండ్ అవుతున్నారు
కాబట్టి వాళ్ల ప్రశ్న సింపుల్:
“హైప్ ఉంది… కానీ రిపీట్ వాల్యూ ఉందా?”
బాలయ్య నో.. ప్లాన్ మొత్తం తలకిందులు!
తెలుగు మార్కెట్‌ను క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. సినిమాలో ఒక కీలక పాత్ర కోసం నందమూరి బాలకృష్ణను సంప్రదించారు. బాలయ్య లాంటి మాస్ హీరో తోడైతే తెలుగు రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతాయని ఆశించారు. అప్పుడు అది కేవలం క్యాస్టింగ్ కాదు, మార్కెట్ స్ట్రాటజీ. ఎందుకంటే:
బాలయ్య = సీడెడ్ + ఆంధ్రలో గ్యారంటీ ఓపెనింగ్స్
ఫ్యాన్ బేస్ అంటే మాస్ పల్స్
లోకల్ కనెక్ట్ అయ్యినప్పుడు డబ్బింగ్ ట్యాగ్ తగ్గిపోతుంది
కానీ ఆయన ‘నో’ చెప్పడంతో:
“లోకల్ హుక్” మిస్సైంది. బయ్యర్లకు సేఫ్టీ సిగ్నల్ తగ్గింది. ఒక్క కాస్టింగ్ డిసిషన్… ₹10–15 కోట్ల వాల్యూ తేడా తెచ్చే లెవెల్!
మళ్లీ పాత పద్ధతిలోనే రిలీజ్?
ప్రస్తుతానికి ఎన్ఆర్ఏ (NRA) పద్ధతిలో భారీ రేటు పెట్టి కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. గతంలో 'జైలర్' చిత్రాన్ని ఏషియన్ సునీల్, దిల్ రాజు, సురేష్ బాబు వంటి దిగ్గజాలు కమిషన్ పద్ధతిలోనే రిలీజ్ చేశారు. ఒకవేళ 60 కోట్ల డీల్‌కు ఎవరూ సెట్ అవ్వకపోతే, రెండో పార్ట్ కూడా అదే పద్ధతిలో విడుదలయ్యే అవకాశం ఉంది. మేకర్స్ ఆశించిన రేటు దక్కాలంటే సినిమా టీజర్ లేదా సాంగ్స్‌తో సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ అవ్వాల్సిందే!
ఏదైమైనా ..
“హైప్‌తో బజ్ క్రియేట్ చేయొచ్చు… కానీ బయ్యర్ గుండెల్లో భయం క్రియేట్ అయితే బిజినెస్ నిలబడదు.” ‘జైలర్ 2’ హిట్ అవ్వాలంటే ఫ్యాన్స్ హర్షధ్వానాలు సరిపోవు… డిస్ట్రిబ్యూటర్ సైలెన్స్ బ్రేక్ కావాలి.

