రాముడు, రావణుడు కలవరా? రామాయణ బిగ్ షాక్!
x

రాముడు, రావణుడు కలవరా? 'రామాయణ' బిగ్ షాక్!

యష్ సంచలన ప్రకటన లో నిజమెంత?


రాముడు లేనిదే రావణుడు లేడు.. కానీ వీరిద్దరూ ఎదురుపడకుండానే రామాయణం ముగుస్తుందా? వైరల్ అవుతున్న ఈ వార్త నిజమైతే... వెండితెరపై అతిపెద్ద యుద్ధం చూడాలనుకున్న కోట్లాది మంది ఫ్యాన్స్‌కు ఇది కోలుకోలేని దెబ్బే!

ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా దూసుకుపోతున్న 'రామాయణ' గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రణబీర్ కపూర్ రాముడిగా, కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా వీరిద్దరి మధ్య జరిగే ఆ మహా సంగ్రామం వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని ఆడియన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫ్యాన్స్ అంచనాలపై చిత్ర యూనిట్ నీళ్లు చల్లినట్టే కనిపిస్తోంది.

అసలు ట్విస్ట్ ఏంటంటే?

యష్ స్వయంగా అమెరికాలో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. రామాయణం మొదటి భాగంలో రాముడు, రావణుడు ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశం లేదని ఆయన హింట్ ఇచ్చారు. అంటే, పార్ట్-1లో వీరిద్దరి మధ్య ఎలాంటి ఫేస్-ఆఫ్ ఉండదు. అసలు కథ మొత్తం వీరిద్దరి క్యారెక్టర్ బిల్డ్-అప్ చుట్టూనే తిరుగుతుందట. ఈ వార్త విన్న సినీ వర్గాలు, ట్రేడ్ అనలిస్టులు షాక్ అవుతున్నారు. మెయిన్ విలన్, హీరో తలపడకుండా సినిమాను ఎలా ముగిస్తారనేది ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది.

క్లైమాక్స్ ఎక్కడ ముగుస్తుంది?

ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. జటాయువు మరణం, సీతాపహరణం సీన్ దగ్గరే మొదటి భాగాన్ని ముగించబోతున్నారట. రాముడు సీతను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లే సీన్‌తో సినిమా ఎండ్ అవుతుందని వినికిడి. అంటే క్లైమాక్స్‌లో రావణుడు కనిపిస్తాడు తప్ప, రాముడితో యుద్ధం చేసే అవకాశం అస్సలు లేదు. ఆ భారీ యుద్ధాన్ని పార్ట్-2 కే పరిమితం చేయాలని డైరెక్టర్ నితేష్ తివారీ ప్లాన్ చేసినట్లు సమాచారం.

నితేష్ తివారీ డేరింగ్ స్టెప్!

సినిమా అంటేనే మాస్ ఫైట్లు, హీరో వర్సెస్ విలన్ క్లాష్ కోరుకునే ఈ రోజుల్లో.. ఇలాంటి ఒక ప్రయోగం చేయడం మామూలు విషయం కాదు. అయితే, కేవలం క్యారెక్టర్ ఎమోషన్స్, డెప్త్ మీద ఫోకస్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రావణుడిగా యష్ పాత్రను ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తారో, అదే స్థాయిలో రాముడి పాత్రను కూడా ఎస్టాబ్లిష్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆడియన్స్‌ను నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయించేలా ఒక భారీ క్లిఫ్ హ్యాంగర్‌ను ప్లాన్ చేస్తున్నారు.

నిజంగానే ఈ సినిమా యుద్ధం లేకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందా? అసలు రాముడు, రావణుడు ఎదురుపడని ఈ ప్రయోగం వర్కవుట్ అవుతుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవేళ ఫ్యాన్స్‌ను మెప్పించలేకపోతే సినిమా రిజల్ట్ తేడా కొట్టే ప్రమాదం కూడా ఉంది. ఏది ఏమైనా 'రామాయణ' టీమ్ తీసుకున్న ఈ డెసిషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. మరీ ఈ ఎపిక్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

Read More
Next Story