
వివాదంలో ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా
మురుగన్ ఉత్తరాది వాడని చూపిస్తే సినిమా బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్
ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్ వస్తున్న కొత్త మూవీపై వివాదం చెలరేగింది. ముఖ్యంగా నిర్మాత నాగవంశీ పెట్టిన క్యాప్షన్ పై తమిళనాడులో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సుబ్రమణ్యుడు లేదా కార్తికేయుడు, షణ్ముఖుడిని తమిళులు మురుగన్ గా ఆరాధిస్తారు.
ఎన్టీఆర్- త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య కొత్త సినిమా ప్రకటన సందర్భంగా నిర్మాత నాగవంశీ ఉత్తరాన పుట్టింది.. హర్ట్ ల్యాండ్ లో రూపుదిద్దుకుంది.. దక్షిణాన పూజలందుకుంటుంది.. ఇప్పుడు విశ్వానికి చెందబోయే గాథ’’ అని క్యాప్షన్ పెట్టారు. ఇదే వివాదానికి కారణమైంది.
ఉత్తరాదివాడు కాదు..
చాలామంది తమిళనాడు వాసులు సోషల్ మీడియాలో దీనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సుబ్రమణ్యుడు ఉత్తరాది వాడు కాదని అన్నారు. తమిళ సంప్రదాయంలో మురుగన్ తమిళ కడవుల్ అంటే తమిళ దేవుడుగా పూజిస్తారు.
ఆయన ఉత్తరాది నుంచి వచ్చిన వాడుగా కాకుండా ఇక్కడే పుట్టిన వాడిగా భావిస్తారు. శివుడి విస్పులింగాల నుంచి వచ్చిన శక్తితో మురుగన్ జన్మించాడని తమిళ వాగ్మయంలో ఉందని, ఉత్తరాది వాడు కాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొంతమంది నెటిజన్లు తమిళ దేవుడిని పెట్టి చరిత్రను వక్రీకరిస్తున్నారని, తమిళ చరిత్రను లేకుండా సినిమా తీస్తున్నారని దుయ్యబట్టారు. కొంతమంది వినియోగదారులు ఆర్య సంస్కృతిని మురుగన్ పై రుద్దుతున్నారని ఆరోపించారు. మరికొంతమంది నెటిజన్లు సినిమాను తమిళనాడులో నిషేధించాలని కోరారు. ఇంకొంతమంది నెటిజన్లు సంస్కృతాన్ని తమిళంపై రుద్దే ప్రయత్నంగా ఆరోపించారు.
చరిత్ర ఏం చెబుతోంది...
మురుగన్ ఎక్కడి వాడనే అంశంపై అనేక భిన్నవాదనలు ఉన్నాయి. తమిళ స్కాలర్లు, చరిత్రకారుల ప్రకారం సుబ్రమణ్యుడు సంగం కాలం నాటి దేవుడు. ఆయన కొండలలో యుద్ధం చేసేవాడు. తరువాత విస్తృత హిందూ దేవతా సమూహంలో కలిసిపోయి, శివపార్వతుల కుమారుడు, గణేశుడి సోదరుడైన కార్తికేయుడిగా కలిపేసుకున్నాడని వాదిస్తున్నారు.
తమిళ సంగం సాహిత్యం, ముఖ్యంగా తిరుమురుగరుపడై వంటి గ్రంథాలు, మురుగన్‌ను తమిళ భౌగోళికానికి, ప్రస్తుత తమిళనాడు అంతటా ఉన్న ఆరు పవిత్ర నివాసాలకు (అరుపడైవీడు) ముడిపడి ఉన్న ఒక స్థానిక దేవతగా కీర్తిస్తాయి.
అయితే వేదాలు మాత్రం మురుగన్ శివుడి మూడో కన్ను నుంచి ఉద్భవించాడు. ఆయన శక్తిని ఆరుగురు కృతికలు భరించడంతో ఆయన షణ్ముఖుడిగా, కార్తికేయుడిగా అవతరించాడు. ఈ గాథ కైలాస పర్వతంతో ముడిపడి ఉంటుంది.
దీనితో తమిళ గాథకు, రామాయణ గాథకు ఇవి వేరువేరుగా కావడంతో వివాదం రాజుకుంది. ఉత్తరాదివాడు అని చెప్పడంతో ప్రస్తుతం తమిళనాడులో వివాదం రాజుకుని, అనేక మంది తమిళులు దీనికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు.
అరవింద సమేత వీర రాఘవ..
2018లో 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రానికి చివరిసారిగా కలిసి పనిచేసిన జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కార్తికేయ లేదా సుబ్రహ్మణ్య అని కూడా పిలువబడే మురుగన్ దేవుడిపై కేంద్రీకృతమైన ఒక కొత్త పౌరాణిక యాక్షన్ చిత్రం కోసం మళ్లీ ఒక్కటయ్యారు.
తాత్కాలికంగా #NTRxTrivikram అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 2027 ప్రారంభంలో మొదలవుతుందని భావిస్తున్నారు. టీజర్ పోస్టర్‌లో, మండుతున్న యుద్ధభూమి చుట్టూ ఒక త్రిశూలం ఉండగా, దాని మధ్య కొమ్ము DNA పోగుగా రూపాంతరం చెందుతున్నట్లు చూపించారు. ఎన్టీఆర్ తన పోస్ట్‌కు, "శివుని కుమారుడు. పార్వతి గర్వం. శాశ్వత సేనాపతి." అని క్యాప్షన్ పెట్టారు.
Next Story

