‘పెద్ది’ మూవీకి తెలంగాణ సర్కార్ బ్రేక్ వేయబోతుందా?
x

‘పెద్ది’ మూవీకి తెలంగాణ సర్కార్ బ్రేక్ వేయబోతుందా?

ఊహించని ట్విస్ట్!


రామ్ చరణ్ కెరీర్‌ పరంగానే కాదు, తెలుగు సినిమా మార్కెట్‌లో కూడా ‘పెద్ది’ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కానీ రిలీజ్ కంటే ముందే ఈ సినిమాకు అసలు టెన్షన్ థియేటర్లలో కాదు, ప్రభుత్వ ఆఫీస్ ల్లో మొదలైంది. జూన్ 3న భారీ ప్రీమియర్స్ ప్లాన్ చేసిన మేకర్స్, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ అనుమతి వస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రద్దలు కొట్టేందుకు సిద్దంగా ఉంది.

‘ప్రీమియర్స్’ గేమ్ మొదలైంది

జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘పెద్ది’కి, ఒక రోజు ముందే భారీ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ప్రత్యేక షోలు, టికెట్ రేట్ల పెంపు కోసం అప్లికేషన్లు కూడా వెళ్లినట్లు సమాచారం.

ఇటీవలి కాలంలో పెద్ద సినిమాలకు ప్రీమియర్స్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక షోతోనే సోషల్ మీడియాలో టాక్ వైరల్ అయ్యిపోతుంది. అదే మొదటి రోజు కలెక్షన్స్‌ని డిసైడ్ చేసేస్తుంది. ‘పెద్ది’ విషయంలో కూడా అదే ఫార్ములా వర్కౌట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

తెలంగాణలో అసలు ట్విస్ట్ ఇదే!

అయితే అసలు సస్పెన్స్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపైనే ఉంది. ఇటీవల ప్రత్యేక షోలు, టికెట్ హైక్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. దీంతో ‘పెద్ది’కి అనుమతులు వస్తాయా? లేక చివరి నిమిషంలో షాక్ పడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మేకర్స్ మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ అనుమతులు వస్తాయని కాన్ఫిడెంట్‌గా ఉన్నారని తెలుస్తోంది.ఎందుకంటే ఈ సినిమా మీద ఉన్న బజ్ సాధారణ స్థాయిలో లేదని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.

మార్కెట్‌లో ‘పెద్ది’ హీట్

తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే సూపర్ హిట్ సాధించిన దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ వాయిదాలు పడినా, సినిమాపై క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ ఆఫర్లు రావడం కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ప్రస్తుతం చిన్న, మధ్య తరహా సినిమాలు థియేటర్ల వద్ద నానా బాధలు పడుతున్న ఈ సమయంలో, ‘పెద్ది’ లాంటి మాస్ సినిమా బాక్సాఫీస్‌కు కొత్త ఊపు తీసుకురావొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఒక్క అనుమతి.. ఓపెనింగ్స్ చరిత్ర మారిపోతుందా?

ఇప్పుడు అందరి చూపు జూన్ 3 ప్రీమియర్స్‌పైనే ఉంది. ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ‘పెద్ది’కి మొదటి రోజే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఒకవేళ అనుమతుల్లో ఆలస్యం జరిగితే మాత్రం మేకర్స్ ప్లాన్‌కు భారీ దెబ్బ తగిలే ఛాన్స్ ఉందనే చర్చ కూడా సాగుతోంది.

Read More
Next Story