
‘పెద్ది’ ప్యాకేజీ వర్సెస్ ‘డ్రాగన్’ పజిల్.. గెలుపెవరిది?
బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ బ్రదర్స్ సవాల్
వేసవి వచ్చిందంటే థియేటర్లు కలర్‌ఫుల్‌గా, ప్రేక్షకుల కేరింతలతో కళకళలాడుతూంటాయి. కానీ ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ కాస్త డల్‌గా కనిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే సోషల్ మీడియాను షేక్ చేయడానికి, థియేటర్లలో పూర్వ వైభవం తేవడానికి ‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ సరికొత్త చిత్రాలతో రంగంలోకి దిగారు. మే 18న చరణ్ ‘పెద్ది’ ట్రైలర్, మే 19 అర్ధరాత్రి తారక్ బర్త్ డే కానుకగా ‘డ్రాగన్’ గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
అయితే, పైపైన చూసే నెటిజన్ల నుంచి ఈ రెండింటికీ కాస్త మిశ్రమ స్పందన వచ్చినట్లు కనిపిస్తున్నా, లోతుగా పరిశీలిస్తే మాత్రం ఈ రెండు చిత్రాల ప్రమోషనల్ కంటెంట్ వెనుక ఇద్దరు అగ్ర దర్శకుల వేర్వేరు వ్యూహాలు, ఆసక్తికరమైన కథాంశాలు దాగున్నాయి. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా, ఆధునిక ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా ఈ రెండు సినిమాలు ఎలాంటి కంటెంట్‌ను ప్రెజెంట్ చేశాయో చూద్దాం.
‘పెద్ది’:ఓ భారీ కమర్షియల్ ప్యాకేజీ
దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ‘పెద్ది’ మూడు నిమిషాల సుదీర్ఘ ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ ట్రైలర్ చూసిన వెంటనే ఒక విషయం క్లియర్‌గా అర్థమవుతుంది — బుచ్చిబాబు చాలా పెద్ద సినిమా తీయాలని ప్రయత్నించాడు.స్పోర్ట్స్ డ్రామా… గ్రామ రాజకీయాలు… క్లాస్ ఒప్రెషన్… ఢిల్లీ లెవెల్ సిస్టమ్ వార్… మధ్యలో ప్రేమ కథ… ఇలా అన్నింటినీ ఒకే ట్రైలర్‌లో నింపేశాడు.
సమస్య ఏమిటంటే…
ట్రైలర్ కథ చెప్పింది. కానీ “క్యూరియాసిటీ” మాత్రం మిగల్చలేదు.
క్రికెట్… రెజ్లింగ్… రన్నింగ్… ఒకేసారి మూడు స్పోర్ట్స్ ఎలిమెంట్స్ రావడంతో ప్రేక్షకుడు ఎమోషన్‌లోకి వెళ్లేలోపే ట్రైలర్ ఇంకో ట్రాక్‌కి వెళ్లిపోతుంది. ఫలితం? కనెక్ట్ కంటే “కన్ఫ్యూజన్” ఎక్కువ అవకాశం ఇచ్చింది.
సినిమా ప్రారంభమైన రోజు నుంచి “మాస్ యాక్షన్ డ్రామా” అని అమ్మిన సినిమాకు ట్రైలర్‌లో ఆ మాస్ హై కనిపించలేదు.చరణ్ లాంటి స్టార్‌ను చూసి ఫ్యాన్స్ ఎదురు చూసేది రా ఎనర్జీ… ఎలివేషన్… విజృంభణ. కానీ ట్రైలర్ మొత్తం “ఇన్సిప్రేషనల్ స్పోర్ట్స్ మూవీ” వైబ్‌తోనే వెళ్లింది. దాంతో చాలా మందిది ఒకటే కామెంట్... “సినిమా బాగుండేటట్లే అనిపిస్తోంది… కానీ థియేటర్ బ్లాస్ట్ ఫీలింగ్ ఇంకా రాలేదు.” సినిమా రిలీజ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి, మున్ముందు మాస్ కంటెంట్‌తో హైప్ పెంచే అవకాశం ఉంది.
‘డ్రాగన్’: ప్రశాంత్ నీల్ సృష్టించిన మైండ్ బెండింగ్ పజిల్
మరోవైపు ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘డ్రాగన్’ 4 నిమిషాల గ్లింప్స్ మాత్రం పూర్తి భిన్నమైన స్ట్రాటజీతో నడిచింది. ఇది రొటీన్ హైలైట్ రీల్ లా కాకుండా, ఒక ఇంటెన్స్, స్లో-బర్న్ నరేటివ్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక్కడే ప్రశాంత్ నీల్ గేమ్ స్టార్ట్ అవుతుంది.
‘డ్రాగన్’ గ్లింప్స్‌ను చాలామంది “సలార్ షేడ్స్” అంటూ ట్రోల్ చేశారు. డస్ట్… డార్క్ ఫ్రేమ్స్… బ్లాక్ & వైట్ టోన్… స్లో మోషన్… ఇవన్నీ నిజంగానే నీల్ ట్రేడ్‌మార్క్స్.
కానీ చాలా మంది మిస్ అయిన విషయం ఏమిటంటే ఈ గ్లింప్స్ “హీరో ఇంట్రో” కంటే “ఒక క్రిమినల్ ప్రపంచం పుట్టుక” మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది.
1967 ఓపియం ట్రేడ్… ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ vs గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ… నార్కోటిక్స్ వార్… ఇవి వింటూనే సినిమా ఒక రియల్ హిస్టారికల్ అండర్‌వరల్డ్ వైబ్‌లోకి వెళ్లిపోతుంది.ఇక్కడ ఎన్టీఆర్‌ను “రక్షకుడు”గా కాదు… “పశ్చాత్తాపం లేని హంతకుడు”గా చూపించడం గ్లింప్స్‌కు అసలు బలం.
“నా దగ్గర ఉన్న గిఫ్ట్… నాకు పశ్చాత్తాపం లేకపోవడం.” ఈ ఒక్క లైన్… మొత్తం సినిమాకి టోన్ సెట్ చేసింది. ఇదే కారణంతో చాలామంది గ్లింప్స్‌ను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. అది యాక్షన్ కోసం కాదు…“ఈ ప్రపంచం అసలు ఎలా ఉంటుంది?” అనే క్యూరియాసిటీ కోసం.
పెద్ది vs డ్రాగన్ : అసలు తేడా ఏమిటి?
‘పెద్ది’ ప్రేక్షకుడికి కథ చెప్పింది.
‘డ్రాగన్’ ప్రేక్షకుడిని కథలోకి లాగింది.
ఒకటి “సినిమా”లా కనిపించింది.
మరొకటి “ప్రపంచం”లా అనిపించింది.
అందుకే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ ఫీలింగ్ కనిపిస్తోంది:
‘పెద్ది’పై రెస్పెక్ట్ ఉంది.
‘డ్రాగన్’పై క్యూరియాసిటీ ఉంది.
ఇప్పటి ఆడియన్స్‌కు రెండోది ఎక్కువ ప్రమాదకరం… ఎందుకంటే curiosity creates obsession.
ఎవరిది పైచేయి?
‘పెద్ది’, ‘డ్రాగన్’.. ఈ రెండు కూడా వేర్వేరు జోనర్స్, విభిన్నమైన కంటెంట్స్. కాబట్టి వీటిని నేరుగా పోల్చలేం. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఈ సినిమాల కోసం తమ ప్రాణాన్ని పెట్టారనేది వారి మేకోవర్ చూస్తేనే అర్థమవుతోంది.
పెద్ది ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా గుండెలను హత్తుకోవాలని చూస్తుంటే, డ్రాగన్ ఒక మైండ్ బ్లోయింగ్ ఇంటర్నేషనల్ క్రైమ్ థ్రిల్లర్‌గా థియేటర్లలో ప్రకంపనలు సృష్టించడానికి రెడీ అవుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న మిక్స్డ్ టాక్‌ను పక్కన పెడితే, రేపు థియేటర్లలో పడే బొమ్మను బట్టే ఈ ఇద్దరు ‘ఆర్ఆర్ఆర్’ హీరోలలో బాక్సాఫీస్ విజేత ఎవరో తేలనుంది!
ఏదైమైనా
ఎన్టీఆర్, రామ్ చరణ్ ...ఇద్దరూ ప్రాణం పెట్టి పనిచేసిన సినిమాలే. అది ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది. కానీ ప్రమోషన్స్ పరంగా చూస్తే… ‘పెద్ది’ తన కథను చాలా త్వరగా బయటపెట్టేసింది. ‘డ్రాగన్’ మాత్రం తన చీకటిని దాచిపెట్టి ప్రేక్షకుడిని వెంటాడుతోంది.
ఈ రెండు ట్రైలర్స్‌లో మీ మైండ్ బ్లాక్ చేసిన కంటెంట్ ఏది? బుచ్చిబాబు రూరల్ డ్రామానా లేక ప్రశాంత్ నీల్ ఇంటర్నేషనల్ మాఫియానా? కామెంట్స్ లో చెప్పండి.

