
ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్: ఏ హీరో కెరీర్ కు దెబ్బ?
పోటీనా? పోటెత్తే పోరా?
ఉదయం 5 గంటలు… థియేటర్ గేట్లు తెరుచుకునేలోపే బయట భారీ క్యూలు. ఒక వైపు Prabhas ఫ్యాన్స్ డప్పులు కొడుతూ నినాదాలు చేస్తుంటే… పక్కనే Salman Khan అభిమానులు పటాకులు కాలుస్తూ హంగామా సృష్టిస్తున్నారు. కట్ అవుట్లు, బ్యానర్లు, పాలు పోసే అభిషేకాలు… ఒక్క సినిమా రిలీజ్ కాదు, పండుగలా మారిపోయిన వాతావరణం.
మొదటి షో ముగిసేలోపే సోషల్ మీడియాలో రివ్యూల వరద… “హిట్” “బ్లాక్‌బస్టర్” అంటూ ఫ్యాన్ వార్స్ మొదలు. అదే రోజు సాయంత్రానికి… అందరి చూపు ఒకటే — కలెక్షన్స్ మీద. ఎవరి సినిమా పైచేయి సాధించింది? ఎవరి స్టార్ డామినేషన్ చూపించాడు?
ఇది కేవలం ఇద్దరు హీరోల పోటీ కాదు… దేశం మొత్తం చూస్తున్న బాక్సాఫీస్ సమరం.
సాధారణంగా బాక్సాఫీస్ దగ్గర నిజమైన పోరు హీరోల మధ్య కాదు… వారి మార్కెట్, వారి టైమింగ్, వారి నిర్ణయాల మధ్య జరుగుతుంది. కానీ అప్పుడప్పుడు ఇద్దరు భారీ స్టార్స్ ఒకేసారి రంగంలోకి దిగే పరిస్థితి వస్తుంది. అప్పుడు మిగతావేమీ లెక్కలోకి రావు, బాహా బాహీ పోరాటమే. అయితే అలాంటి సందర్భాలు అరుదు… కానీ వచ్చినప్పుడు అవి సినిమా చరిత్రలో మైలురాళ్లు అవుతాయి. ఇప్పుడు అలాంటి సన్నివేశమే మళ్లీ ముందుకొస్తోంది.
సాధారణంగా పెద్ద సినిమాలు ఒకదానికొకటి దూరంగా విడుదల అవుతాయి. ఎందుకంటే ఇద్దరు పెద్ద హీరోలు ఒకేసారి వస్తే… థియేటర్లలో స్క్రీన్ల కోసం పోటీ మొదలవుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా కనిపిస్తోంది.
Sandeep Reddy Vanga – Prabhas కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్ మార్చ్ 5కి సిద్ధమవుతుంటే…
Salman Khan – Vamshi Paidipally సినిమా ఈద్ సమయానికి (మార్చ్ 9/10) రావాలని ప్లాన్ చేస్తున్నారు.
అంటే… కేవలం కొద్ది రోజుల తేడాతో ఇద్దరు పెద్ద స్టార్స్. ఇది సాధారణ విడుదల కాదు… నేరుగా బాక్సాఫీస్ పోటీగా మారుతుంది.
బాక్సాఫీస్ దగ్గర అసలు పోరు
సౌత్‌లో పరిస్థితి:
ఇక్కడ Prabhas డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. స్పిరిట్ మీద ఉన్న అంచనాలు, Sandeep Reddy Vanga గత విజయాలు ఇవి కలిస్తే సౌత్‌లో మరో సినిమా ఎదురుగా నిలబడటం కష్టమే.
ఉత్తర భారతంలో పరిస్థితి:
ఇక్కడే అసలు పోటీ. Salman Khanకి ఈద్ విడుదల అంటే ఒక ప్రత్యేక బ్రాండ్. ఆయన సినిమాలు పండుగ సమయంలో విడుదలైతే కుటుంబ ప్రేక్షకులు భారీగా థియేటర్లకు వస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. Prabhas కూడా హిందీ మార్కెట్‌లో బలమైన గుర్తింపు సంపాదించాడు.
హిందీ బెల్ట్‌లో ప్రభాస్ పంజా.. సల్మాన్‌కు తప్పని తిప్పలు?
గతంలో 'సలార్' సినిమాతో షారుఖ్ ఖాన్ 'డంకీ'ని ప్రభాస్ ఎలా మట్టికరిపించాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా క్రేజ్ తోడవ్వడంతో హిందీ మార్కెట్‌లో ప్రభాస్ రేంజ్ మరో లెవల్‌కు వెళ్ళింది. 'యానిమల్' తర్వాత సందీప్ సినిమా అంటే బాలీవుడ్ జనాలు పిచ్చెక్కిపోతున్నారు. ఇలాంటి టైంలో సల్మాన్ ఖాన్ ప్రభాస్ ఎదురుపడితే, ఉత్తరాది గడ్డపై కూడా సుల్తాన్ గద్దె ఊగడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
వివేక్ ఓబెరాయ్ పగ తీర్చుకోబోతున్నాడా?
ఈ వార్‌లో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. 'స్పిరిట్'లో విలన్‌గా వివేక్ ఓబెరాయ్ నటిస్తున్నారనే టాక్ ఉంది. నిజజీవితంలో సల్మాన్, వివేక్ మధ్య ఉన్న వైరం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ అండతో వివేక్ బాక్సాఫీస్ వద్ద సల్మాన్‌ను ఢీకొట్టబోతుండటం నెటిజన్లకు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది.
లాభాలు:
భారీ ఓపెనింగ్స్ (రెండు సినిమాలకు)
నేషనల్ లెవెల్ హైప్
మీడియా ఫ్రీ పబ్లిసిటీ
ఫ్యాన్ వార్స్ వల్ల వైరల్ ట్రెండ్
నష్టాలు:
స్క్రీన్ షేరింగ్ సమస్య
రెండు సినిమాలకు కలెక్షన్స్ డివైడ్
నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయితే… రెండింటికీ డ్యామేజ్
డిస్ట్రిబ్యూటర్స్ రిస్క్ డబుల్
“డుంకీ vs సలార్” తర్వాత ఇండస్ట్రీకి తెలిసిన ఒక నిజం:
క్లాష్ = హైప్ + హాఫ్ కలెక్షన్స్.
ప్రాంక్ గా చెప్పాలంటే:
పోటీ ఎక్కువైతే… సంపాదన తక్కువయ్యే అవకాశం ఉంది. అంటే… హైప్ పెరిగినా, పూర్తి స్థాయిలో లాభం రావడం కష్టం. గతంలో జరిగిన పెద్ద క్లాష్‌లు ఇదే విషయాన్ని స్పష్టంగా చూపించాయి.
దిల్ రాజు ఫ్యాక్టర్: రిస్క్ తీసుకుంటాడా?
ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతల ఆలోచన మరింత కీలకం అవుతుంది. ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన వ్యక్తి Dil Raju. ఆయన ఒకేసారి రెండు వైపులా సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి. ఒక వైపు బాలీవుడ్ స్టార్ Salman Khan… మరో వైపు తెలుగు ఇండస్ట్రీలో అత్యంత విలువైన హీరోల్లో ఒకరైన Prabhas.
ఇద్దరితోనూ రిలేషన్ ఉంది.
ఇలాంటి సిట్యుయేషన్‌లో డైరెక్ట్ క్లాష్‌కు వెళ్లడం అంటే… బిజినెస్ సుసైడ్.
రియాలిటీ చెక్: ఈ క్లాష్ నిజంగానే జరుగుతుందా?
రిలీజ్ డేట్స్ మారే ఛాన్స్ చాలా ఎక్కువ. కనీసం 2–3 వారాల గ్యాప్ క్రియేట్ చేసే అవకాశం. “వార్” కంటే “విన్-విన్” ప్లాన్ చేయడం సేఫ్ గేమ్
గతాన్ని చూస్తే:
Sandeep Reddy Vanga తన Animal రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేశాడు
పాన్-ఇండియా సినిమాలు అనౌన్స్ చేసిన డేట్స్‌కు రావడం అరుదు
మరో ముఖ్యమైన కోణం — ప్రొడక్షన్ స్థాయి. ఈ రెండు సినిమాలు కూడా ఇంకా పూర్తిగా సిద్ధంగా లేవు. షూటింగ్, నిర్మాణ పనులు చాలా మిగిలి ఉన్నాయి. పాన్-ఇండియా సినిమాలు ప్రకటించిన తేదీలకు రాకపోవడం కొత్త విషయం కాదు.
ఫైనల్ గాచూస్తే
Prabhas – Salman Khan మధ్య పోటీ అనేది ప్రేక్షకులకు పండుగలా కనిపించవచ్చు. కానీ నిర్మాతల దృష్టిలో అది ఒక లెక్కల ఆట. సరైన సమయంలో విడుదల చేస్తే రెండు సినిమాలు కూడా భారీ విజయాలు సాధించే అవకాశం ఉంది. అదే ఒకేసారి వస్తే, ఒకటి హిట్టైనా… ఇంకొకటి నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే సినిమాపెద్దలు ఒకటే చెప్తారు..బాక్సాఫీస్ వద్ద చివరికి గెలిచేది హీరో కాదు… టైమింగ్.
అయితే ఇప్పుడో రెండు ప్రశ్నలు భాక్సాఫీస్ దగ్గర డిస్కషన్ లో నిలాచాయి.
“ఈసారి కూడా నార్త్ లో ప్రభాస్ గెలుస్తాడా?”
“సల్మాన్ ఈద్ సెంటిమెంట్ ఈసారి పని చేస్తుందా?”
సింపుల్‌గా చెప్పాలంటే:
వార్ జరిగితే హిస్టరీ…
వార్ తప్పితే ఇద్దరికీ విక్టరీ.

