రామాయణం మొదటి భాగం: బిగ్ స్క్రీన్ పై అద్భుత దృశ్య కావ్యం
x

రామాయణం మొదటి భాగం: బిగ్ స్క్రీన్ పై అద్భుత దృశ్య కావ్యం

నిరాశపరిచిన అంశాలు ఉన్నాయా?


Click the Play button to hear this message in audio format

పూజ తల్వార్


రణబీర్ కపూర్, సాయి పల్లవి, రాక్ స్టార్ యష్ నటించిన ‘రామాయణం’ మొదటి భాగం నవంబర్ 5న భారత్ లో విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదల కావడానికి ముందే చర్చలు, వివాదానికి కేంద్రంగా మారింది. సినీ నిర్మాతలు చెప్పినదాని ప్రకారం ఈ చిత్రం రెండు భాగాలకు దాదాపు రూ. 4 వేల కోట్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ‘దంగల్’ లాంటి సినిమా తీసిన నితీశ్ తివారీ దీనికి దర్శకుడు.
నమిత్ మల్హోత్రా, యష్ సంయుక్తంగా నిర్మించారు. భారతీయ తెరపై అరుదుగా కనిపించే స్థాయిలో దృశ్యపరంగా తీర్చిదిద్దిన అనుసరణ అనే వాగ్ధానం కారణంగా వార్తల్లో నిలిచింది.
తరతరాలుగా లెక్కలేనన్నీ సార్లు తెరకెక్కిన ఒక పూజనీయమైన, పవిత్రమైన ఇతిహాసం అయిన రామాయణం ప్రజల మనస్సులలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. రామానంద్ సాగర్ 1987 టెలివిజన్ అనుసరణ, ఆ పవిత్ర గ్రంథానికి సంబంధించిన అత్యంత గుర్తింపు పొందిన తెర రూపాలలో ఒకటిగా నిలిచిపోయింది. దీనికి పూర్తి విరుద్దంగా ఓం రౌత్ దర్శకత్వంలో వహించిన ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ చిత్రం అసలు తీయకూడదని ఒక ట్రోల్ మెటీరియల్ గా మిగిలిపోయింది.
తాజా సినిమా విషయానికి వస్తే ఈ సినిమా అన్ని విషయాల్లోనూ సరిగ్గా లేకపోయినప్పటికీ ఈ ప్రయత్నంలోని అపారమైన ఆశయం ఆకట్టుకుంది. ఒక విశాలమైన కాన్వాస్ పై ఆవిష్కరించబడిన సుపరిచితమైన ఇతిహాసం( అంటే ఇది ఇలాగే జరిగిందని అర్థం)
నితీష్ తివారీ ‘రామాయణం’ మొదటి భాగం.. అసురులకు, దేవతలకు మధ్య జరిగిన యుద్ధాన్ని వర్ణించే ఒక విలక్షణమైన నార్నియా తరహ భారీ దృశ్యాలతో ప్రారంభం అయింది. యుద్ధానంతరం లంక నగరానికి అధిపతి అయిన కుబేరుడి రోజులకు మనల్ని తీసుకెళ్తుంది.
అయితే రావణుడి తల్లి అయిన కైకసీ(శోభన) తన కుమారుడైన దశగ్రీవుడిని విలాసాలపై సమయం గడపకుండా, ఓటమి పాలైన అసురులకు నాయకుడిగా నిలబడాలని ఆదేశిస్తుంది. దానితో దశగ్రీవుడు(రావణాసురుడి అసలు పేరు ఇదే.. రావణుడు అనేది శివుడు ఇచ్చిన బిరుదు) బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు. అలా వచ్చిన వరాలతో దేవతలపైకి యుద్ధానికి వెళతారు.
ఆ పరాక్రమానికి దేవతలు కూడా చిత్తవుతారు. దీనితో దేవతలు తమ రక్షకుడైన విష్ణువుకు మొరపెట్టుకుంటారు. దానితో ఆయన అయోధ్యలో దశరథుని కుమారుడైన శ్రీ రాముడిగా (రణబీర్ కపూర్) అవతరిస్తాడు. దాదాపు మూడున్నర గంటల పాటు సాగే మొదటి భాగం .. రావణుడి సీతమ్మ తల్లిని(సాయి పల్లవి) అపహరించడంతో ముగిసింది.
వాల్మీకి ఇతిహాసం ఆధారంగా రూపొందిన మొదటి భాగం, కథలోని రెండు పక్షాలను స్థాపించడానికి గణనీయమైన సమయాన్ని వెచ్చించింది. ముఖ్యంగా రావణుడి కళలు, జ్యోతిష్యం, యుద్ధ విద్యలలో ప్రావీణ్యం ఉన్న ఒక మేధావిగా చిత్రీకరించారు.
అతడిని కేవలం శ్రీ రాముడి కథలోని ప్రతినాయకుడిగా పరిచయం చేయకుండా, అతని అధికారంలోకి రావడం, అతన్ని అలా తీర్చిదిద్దిన శక్తులను మనం చూస్తాము. ఇది ఆ పాత్రకు మరింత ప్రాధాన్యం ఇవ్వడానికి, అతని ఆశయం తిరిగి అహంకారంగా మారే ఒక భయంకరమైన వ్యక్తి ఎలా రూపుదిద్దుకున్నాడో అన్వేషించడానికి చేసిన ఒక ప్రయత్నంగా మారింది.

స్క్రీన్ ను శాసించిన యష్..

ఇక సినిమాలో నటన విషయానికి వస్తే రావణుడిగా యశ్ పాత్ర చాలా బాగుంది. తన స్క్రీన్ ప్రజెన్స్, కళ్లతోనే క్రౌర్యం, తాను అనుకున్నది సాధించగలననే తత్వాన్ని ప్రేక్షకులకు కలిగించాడు. శివ తాండవ స్తోత్రాన్ని పఠిస్తూ చేసిన నృత్యం చాలా బాగుంది. ఈ నృత్యాన్ని షియామక్ దావర్ సమకూర్చారు. చిత్రంలోని ఆకట్టుకునే అంశాలలో ఇది ఒకటి.

శ్రీ రాముడు, లక్ష్మణుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే శూర్పణఖ(రకుల్) తన సోదరుడిని నిలదీసే సన్నివేశం మరొక చక్కటి ఎపిసోడ్. అతని పది లోకాలకు ప్రతీకలుగా నిలిచే పది వ్యక్తిత్వాలు, పరస్పర విరుద్ద సలహలు ఇవ్వడం, అతని సందిగ్థత, అమోఘమైన సంఘర్షణ చాలా నాటకీయంగా బాగుంది.
శ్రీ రాముడి పాత్రలో రణబీర్ కపూర్ ను చూడటానికి కొంత సమయం పడుతుంది. ఈ బాలీవుడ్ స్టార్ చాలాకాలంగా నెగటివ్ పాత్రలతోనే సందడి చేశాడు. ఒక రోమియోగా, అనిమల్ గా ఇంతకుముందు కనిపించి, ఒక్కసారిగా ప్రశాంతంగా ఉండే శ్రీ రాముడి పాత్రను పోషించాడు. రామాయణంలో ఒదిగి పోయాడు. నటనలో సంయమనం పాటించాడు. కొన్ని సందర్భాలలో బిగువుగా ఉన్నట్లు కనిపించాడు. సాయి పల్లవి సీత పాత్రలో చక్కగా కనిపించింది. కళ్లతోనే భావవ్యక్తీకరణ చేసింది. కానీ సీత పాత్రకు ఉన్న పరిపక్వత కొన్నిసార్లు మిస్సయింది.
శ్రీ రాముడు అంటే అమితమైన ప్రేమ ఉన్న లక్ష్మణుడి పాత్రలో రవి దూబే పరకాయ ప్రవేశం చేశాడు. లక్ష్మణుడు అంటేనే కోపం, రాముడి పట్ల నిస్వార్థమైన ప్రేమ.. రెండింటిని చక్కగా తెరపై పండించాడు. దశరథుడిగా అరుణ్ గోవిల్ చాలా బాగా నటించి ఆ పాత్రకు గంభీరతను తీసుకొచ్చాడు. రామానంద్ సాగర్ తీసిన రామాయణంలో ఆయనే శ్రీ రాముడి పాత్రను పోషించి, ఇప్పుడు తండ్రిగా తిరిగి రామాయణ ప్రపంచంలోకి తిరిగి వచ్చాడు.
దశరథుని మూడో భార్యగా, రామాయణాన్ని మలుపు తిప్పే పాత్ర అయిన కైకేయిగా లారా దత్త నటించారు. తన దాసి మంత్ర(షీబా చద్దా) ప్రభావంతో తన ధ్యాన మందిరంలోకి దూసుకువచ్చి, శ్రీ రాముడిని అడవికి పంపమని దశరథుడిని బలవంతం చేసే చారిత్రాత్మక సన్నివేశం ఈ కథనంలో అత్యంత ముఖ్య ఘట్టం. ఒక స్త్రీ ఆవేశం, అపరాధభావం, ఆశ, ఉగ్రతను లారా దత్త తన నటనతో మెప్పించలేకపోయింది. ఈ సన్నివేశం అంతగా ప్రభావవంతంగా లేదు.

సంగీతం సోసో...

ఆస్కార్ విజేతలు అయిన ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కానీ ఇది పూర్తిగా నిరాశపరిచింది. ప్రజలలో రామాయణానికి ఉన్న భావోద్వేగ, భక్తిపూర్వక, భారీస్థానానికి మంచి మనస్సుకు హత్తుకునే సంగీతాన్ని ఆశిస్తారు. కానీ ఇందులో సంగీతం చాలా భాగం వాద్య సంగీతం మాత్రమే ఉంది. ఇది కనిపించే సన్నివేశాలకు సరిగా అతకలేదు.


నిర్మాణపరంగా చూస్తే ఐమాక్స్ సర్టిఫైడ్ హై రిజల్యూషన్ కెమెరాలతో చిత్రీకరించబడిన ఈ చిత్రం ఒక భారీ ఐమాక్స్ తెరను పై నుంచి క్రింది వరకూ నింపేంత విస్తారమైన కాన్వాస్ ను సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్ చాలా వరకూ చాలా అద్భుతంగా ఉన్నాయి. నిర్మాత్ నమిత్ మల్హోత్రా నేతృత్వంలోని ఆస్కార్ గెలుచుకున్న వీఎఫ్ఎక్స్ స్టూడియో అయిన డీఎన్ఈజీ కు ఈ ఇతిహాసంలోని అద్బుత ప్రపంచాలను మునుపెన్నడూ లేని స్థాయిలో సృష్టించే బాధ్యతను అప్పగించారు.
ఇందులో చాలా సన్నివేశాలు చాలా వరకు బాగా వచ్చాయి. ముఖ్యంగా జటాయువు ఎపిసోడ్ మంచి ప్రభావం కలిగి ఉంది. అయితే కొన్ని భాగాలు కాస్త వెనకబడి ఉన్న భావన కలుగుతుంది. వాటిలో కొన్ని కృత్రిమంగా, కంప్యూటర్ గ్రాఫిక్స్ లాగా తెలిసిపోయాయి. కొన్నిసార్లు బాహుబలి, కల్కి 2898 ఏడీ చిత్రాలను గుర్తుకు తెచ్చాయి.
లంక నగరాన్ని చూపించిన విధానం ఆకట్టుకుంది. కానీ దీన్ని అధర్మానికి ప్రతీకగా చూపించే సమయంలో కొంచెం బ్లాక్, అశుభ్రమైనదిగా చూపించారు. ఎందుకంటే శ్రీ రాముడు ధర్మం అంటే వెలుగుకి ప్రతీకగా ఉన్న కారణంగా అలాంటి ఆలోచన వచ్చినట్లుంది

దుస్తుల ఎంపిక..

ఈ చిత్రంలో ఎంపిక చేసిన దుస్తులు కూడా సరిగా లేవని చెప్పవచ్చు. ముఖ్యంగా భారీగా అలంకరించిన వెల్వేట్లు, షిఫాన్, ముక్కాయిల్ షాల్స్, టూ టోన్ ఎఫెక్ట్స్, వీటికి తోడు గ్లాడియేటర్ శాండిల్స్ ఇవన్నీ కలిసి గ్రీకూ రోమన్ ప్రభావాలను, 18 వ శతాబ్దపు మధ్యయుగ సౌందర్యాన్ని, ఆడంబరమైన పెళ్లి దుస్తుల శైలిని కలగలిపి ఒక విచిత్రమైన ఆడంబరాన్ని సృష్టించారు. ఇది ఇతిహాసంగా తలపించే విధంగా లేవు.


శ్రీ రాముడు, సీత అడవికి వెళ్లే సమయంలో కూడా ధరించిన దుస్తులు నమ్మశక్యంగా లేవు. అంటే డిజైనర్ల సృజనాత్మకత బాగుంది కానీ.. కథ కాలానికి సరిపోలేదు. ఇవి ఇతిహాసం సృజించినట్లు కాకుండా.. అమెజాన్ లాంటి ఈ కామర్స్ దిగ్గజాల నుంచి తీసుకొచ్చి వాడినట్లు కనిపిస్తుంది.

ప్రతిష్టాత్మకమైన ప్రయత్నం..

‘రామాయణం: మొదటి భాగం’ ఒక సాహసోపేతమైన ప్రతిష్టాత్మకమైన ప్రయత్నం అనడంలో సందేహం లేదు. నిర్మాణ స్థాయి దృశ్య కల్పన, తరతరాలుగా మన సామూహిక చైతన్యంలో భాగమైన ఒక ఇతిహాసాన్ని పున: సృష్టించాలనే తపన వంటివి ప్రశంసలకు అర్హమైనవే.
అయితే రామాయణాన్ని దాని అనేక సుపరిచిత రూపాల్లో చూస్తూ పెరిగిన భారతీయ ప్రేక్షకుల కంటే, ఈ చిత్రం అంతర్జాతీయ ప్రేక్షకులను ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటోందా అనే సందేహం కలుగుతుంది. ఈ కథను ఒక భారీ ప్రపంచ ప్రదర్శనగా పున: సృష్టించాల్సిన అవసరం లేకుండా మరింత సరళమైన సుపరిచితమైన పద్దతిలో చెప్పడాన్ని చూసి సంతోషించే ప్రేక్షకులు ఇప్పటికే ఉన్నారు.
దాదాపు మూడున్నర గంటల నిడివితో ఈ సినిమా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో దాని కథనం కంటే దాని ఆశయమే పైచేయిగా కనిపిస్తుంది. రెండవ భాగం 2028 దీపావళి కానుకగా విడుదల కానుంది. మొదటి భాగం ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందనే దానిపైనే ఎక్కువ అంచనాలు ఆధారపడి ఉంటాయి.
Read More
Next Story