షేక్ హ్యాండ్ ఓకే.. శృంగారం తప్పా?
x

షేక్ హ్యాండ్ ఓకే.. శృంగారం తప్పా?

నిలదీసిన ‘విరూపాక్ష’ నటి!


ఆమె కేవలం గ్లామర్ బొమ్మ కాదు, అంతకుమించి చదువుకున్న డాక్టర్. కానీ ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సమాజం దాచేసే ఒక పచ్చి నిజాన్ని, అందరూ బూతుగా చూసే ఒక విషయాన్ని నడిరోడ్డుపై నిలబెట్టి ప్రశ్నించింది. ఆ బోల్డ్ స్టేట్‌మెంట్‌తో ఒక్కసారిగా ఇండస్ట్రీ అంతా ఆమె వైపే చూసేలా చేసింది ‘మా ఊరి పొలిమేర’ ఫేమ్ కామాక్షి భాస్కర్ల.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు రిలేషన్‌షిప్స్, బ్రేకప్స్ గురించి మాట్లాడటమే పెద్ద విషయం అనుకునే సమయంలో, కామాక్షి భాస్కర్ల మాత్రం నేరుగా సమాజం ఆలోచనలపైనే ప్రశ్నలు విసిరటం చాలా మందిని మాట్లాడుకునేలా చేసింది. “శృంగారాన్ని తప్పుగా ఎందుకు చూస్తారు?” అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడటమే తప్పు అన్నట్టుగా ఉన్న మన సమాజంలో, కామాక్షి చెప్పిన మాటలు చాలామందిని షాక్‌కు గురి చేశాయి. అదే సమయంలో మరికొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.

చైనాలో ఎంబీబీఎస్.. అపోలోలో ఉద్యోగం.. కానీ స్క్రీన్ పై బోల్డ్ ట్విస్ట్!

చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో డాక్టర్‌గా సేవలందించిన ఈ బ్యూటీ, సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘మా ఊరి పొలిమేర’, ‘విరూపాక్ష’ లాంటి సినిమాలతో నటిగా తన ముద్ర వేసుకున్న కామాక్షి, రీసెంట్‌గా ‘అగధ’ అనే చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అయితే సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె తన వ్యక్తిగత జీవితం, రిలేషన్‌షిప్స్ గురించి ఓపెన్ అయిపోయి అందరికీ ఫ్యూజులు ఎగరగొట్టింది.

మూడు బ్రేకప్స్.. బెడ్ రూమ్ సీక్రెట్స్ పై ఓపెన్ టాక్!

తన లైఫ్‌లో ఇప్పటివరకు మూడు బ్రేకప్స్ అయ్యాయని ఏమాత్రం దాచకుండా చెప్పేసింది కామాక్షి. ఆ బ్రేకప్స్ అన్నీ ఇరు పక్షాల పరస్పర అంగీకారంతోనే జరిగాయని, ఏ బంధంలోనైనా స్వార్థం ఉండకూడదని, అవతలి వ్యక్తి ఇష్టాలను గౌరవించాలని క్లారిటీ ఇచ్చింది. అంతటితో ఆగకుండా, సమాజంలో శృంగారాన్ని ఒక బూతులా చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. షేక్ హ్యాండ్ ఇవ్వడం నుంచి సెక్స్ వరకు అన్నీ శారీరక, మానసిక ప్రక్రియలే అని తేల్చేసింది.

మనసులు కలిస్తే అబ్బా.. బాడీలు కలిస్తే తప్పా?

ఇద్దరు వ్యక్తులు తమ మనసులోని ఆలోచనలను పంచుకున్నప్పుడు గొప్పగా చూసే ఈ సమాజం, శారీరక కలయికను మాత్రం ఎందుకు తప్పుగా లేదా బూతులా చూస్తోందని కామాక్షి సూటిగా ప్రశ్నించింది. ఒక డాక్టర్‌గా, ఒక నటిగా ఆమె అడిగిన ఈ ప్రశ్న ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె ధైర్యాన్ని, నిజాయితీని కొందరు మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం ఈ రేంజ్ బోల్డ్‌నెస్ అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా కామాక్షి కామెంట్స్ ఇప్పుడు హాట్ కేకుల్లా మారాయి.

కామాక్షి మాటల వెనక అసలు సందేశం ఇదేనా?

కామాక్షి భాస్కర్ల చేసిన కామెంట్స్ కొందరికి బోల్డ్‌గా అనిపించొచ్చు, మరికొందరికి అసౌకర్యంగా కూడా అనిపించొచ్చు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్.. సమాజం దాచిపెట్టే విషయాలను ఆమె నేరుగా బయటపెట్టింది. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Read More
Next Story