
క్రైమ్ కామెడీ:‘ఉత్తుత్త హీరోలు’ రివ్యూ
కిడ్నాపర్లుగా మారిన హీరోలు
ఎలాగైనా వెండితెరపై మెరిసిపోవాలని,టాలీవుడ్ ఏలయ్యాలని కలలు కనే బ్యాచ్ చందూ (మహేశ్ విట్టా) అండ్ కో.“ఒక్క ఛాన్స్ దొరికితే చాలు… ఇండస్ట్రీని షేక్ చేస్తాం” అనే కాన్ఫిడెన్స్‌తో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తిరుగుతుంటారు. అదృష్టం కలిసి వచ్చి, ఓ సినిమాలో అవకాశం కూడా దక్కుతుంది. కానీ వారి డ్రీమ్ ఎంట్రీకి ఇంటర్వెల్ కార్డ్ పడినట్టు, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోతుంది.
దీంతో సీన్ రివర్స్ అవుతుంది. అంతవరకు సెలబ్రిటీలుగా చూసిన ఊరి జనాలు.. కాస్తా "ఓహో.. వీళ్లా! వీళ్లు ఉత్తుత్త హీరోలు" అంటూ సెటైర్లు వేస్తూ, వాళ్ల కలల మీద మీమ్స్ వేస్తుంటారు. హీరోలు అవ్వాలనుకున్న వాళ్లు, చివరికి టీ షాపుల్లో కామెడీ పీస్‌లుగా మారిపోతారు.
ఇక ఇలానే ఉంటే లైఫ్ మొత్తం ట్రోలింగ్‌కే పరిమితం అవుతామని ఫిక్స్ అయిన చందూ గ్యాంగ్, ఓ డేంజరస్ డిసిషన్ తీసుకుంటుంది. “ఎవరైనా ఛాన్స్ ఇవ్వకపోతే… మనమే సినిమా తీసుకుందాం!” అనుకుంటారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సినిమా తీయాలంటే కెమెరా కంటే ముందు 'క్యాష్' కావాలి కదా! మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకోసం వీళ్లు ఎంచుకున్న రూట్.. ప్రొద్దుటూరు!
ప్రొద్దుటూరులో ఫైనాన్సియర్‌గా పేరున్న రామిరెడ్డిని టార్గెట్ చేస్తారు. నేరుగా వెళ్లి అడిగితే ఆయన చెక్ ఇస్తాడా? ఇవ్వడు. అందుకే మన మేధావులు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు. రామిరెడ్డి చెల్లెళ్లను కిడ్నాప్ చేసి, ఆ డబ్బుతో సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అవుతారు.
చేతిలో చిల్లిగవ్వ లేదు కానీ, హాలీవుడ్ రేంజ్ స్కెచ్‌తో ప్రొద్దుటూరు ల్యాండ్ అవుతారు మన క్రియేటివ్ కిడ్నాపర్స్. రామిరెడ్డి చెల్లెళ్లు ఎవరు? ఎక్కడికి వెళ్తారు? ఎలా తిరుగుతారు? అంటూ ఫుల్ రెక్కీ చేస్తుంది. అయితే రామిరెడ్డి అంటే సాదాసీదా మనిషి కాదని, ప్లాన్ తేడా కొడితే తామే కిడ్నాప్ అయిపోయే పరిస్థితి వస్తుందని తెలిసినా, ఈ బ్యాచ్ వెనక్కి తగ్గదు.
రామిరెడ్డి ఇద్దరు చెల్లెళ్లు ఎవరు? వాళ్ల వీక్నెస్ ఏంటి? ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్తారు? అంటూ ఓ రేంజ్‌లో 'రెక్కీ' నిర్వహిస్తారు. రామిరెడ్డి సామాన్యుడు కాదని, తేడా వస్తే తమకు 'నరకం' గ్యారెంటీ అని తెలిసినప్పటికీ.. ఎలాగోలా కష్టపడి ఆ ఇద్దరు అమ్మాయిలను కిడ్నాప్ అయితే చేసేస్తారు.కానీ.. కథ ఇక్కడే అడ్డం తిరుగుతుంది! అప్పుడేం జరుగుతుంది. అప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఈ షార్ట్ ఫిలిం బ్యాచ్‌ను, ఈ కిడ్నాప్ వ్యవహారం ఇంకా ఎలాంటి ఇరుకున పెట్టింది? అసలు వీళ్లు అనుకున్నట్టు సినిమా తీశారా లేదా? అనేది మిగతా కథ.
విశ్లేషణ
క్రైమ్ కామెడీ అంటే కేవలం “నేరం + నవ్వులు” కాదు. అది ఒక చాలా డెలికేట్ బ్యాలెన్స్. ఒకవైపు ప్రమాదం నిజంగానే అనిపించాలి… మరోవైపు ఆ ప్రమాదంలో చిక్కుకున్న క్యారెక్టర్ల మూర్ఖత్వం, పరిస్థితుల ఐరనీ మనకు నవ్వు తెప్పించాలి. అందుకే మంచి క్రైమ్ కామెడీల్లో టెన్షన్, టైమింగ్ రెండూ కలిసి పని చేస్తాయి.
ఉదాహరణకి తెలుగులో మనీ సినిమా, అనగనగా రోజు,Lock, Stock and Two Smoking Barrels, Snatch లేదా Fargo వంటి సినిమాల్లో క్యారెక్టర్లు చేసే తప్పులు నవ్విస్తాయి… కానీ ఆ తప్పుల వల్ల వచ్చే ప్రమాదం మాత్రం నిజంగానే భయపెడుతుంది. అదే జానర్ బలం.
ఈ కథ కూడా అదే జానర్‌లోకి వెళ్లాలని ప్రయత్నించింది. “సినిమా తీయాలనే కలతో కిడ్నాప్ దాకా వెళ్లిపోయిన షార్ట్ ఫిలిం బ్యాచ్” అనే పాయింట్ వినడానికి ఫన్నీగా, ఐరానిక్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్లు క్రిమినల్స్ కాదు… డ్రీమర్స్. కానీ పరిస్థితులు వాళ్లను నేరం వైపు నెడతాయి. ఈ కాన్ఫ్లిక్ట్‌లోనే గొప్ప క్రైమ్ కామెడీకి కావాల్సిన మెటీరియల్ ఉంది.
కానీ సమస్య ఏమిటంటే… ఈ కథ ఆ మెటీరియల్‌ను లోతుగా ఎక్స్‌ప్లోర్ చేయలేదు.
అలాగే క్రైమ్ కామెడీలో పెద్ద రూల్ ఏమిటంటే కామెడీ ఎంత ఉన్నా, క్రైమ్ మాత్రం నిజంగానే ప్రమాదకరంగా అనిపించాలి.కానీ ఇక్కడ కిడ్నాప్ మొత్తం ఒక స్కిట్‌లా కనిపిస్తుంది.రామిరెడ్డి ఎంత డేంజరస్ అన్నది డైలాగ్స్‌లో చెప్తారు… కానీ స్క్రీన్‌పై ఫీల్ చేయించరు.
దాంతో కిడ్నాప్ ఫెయిల్ అయితే వీళ్ల జీవితాలు నాశనం అవుతాయనే టెన్షన్ ప్రేక్షకుడికి రాదు.అంటే కథ ఇలా అనిపిస్తుంది. “కొంతమంది వెర్రివాళ్లు సిల్లీ పనులు చేస్తున్నారు…” అంతే.“ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్న desperate dreamers” అనే డెప్త్ కనిపించదు.
ఎవరెలా చేసారు?
నటీనటులు తమ పరిధి మేరకు చేశారు.. కానీ గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ మాత్రం ఎవరి నుంచి రాదు. హర్ష కోడలి సినిమాటోగ్రఫీ, జాన్ కె జోసెఫ్ సంగీతం, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఫరవాలేదనిపిస్తాయి.
అసలు సమస్య టెక్నికల్ టీమ్ దగ్గర కాదు… స్క్రిప్ట్ దగ్గరే. కథలో ఉన్న ఐడియా వినడానికి క్రేజీగా ఉన్నా, దాన్ని తెరపై ఆసక్తికరంగా మార్చేంత బలమైన సన్నివేశాలు రాలేదు. కామెడీ నవ్వించదు… క్రైమ్ టెన్షన్ ఇవ్వదు.
ఫైనల్ థాట్
ఇది “కలల కోసం నేరం చేసిన వాళ్ల కథగా కంటే… నేరం కూడా సరిగ్గా చేయలేని కలల బ్యాచ్ కథ" గా మిగిలిపోయింది. అయితే ఓటిటిలో కాసేపు నవ్వుకోవటానికి ఓ లుక్కేయచ్చు. కొన్ని ఎపిసోడ్స్ బాగానే పండాయి
ఏ ఓటిటిలో
ఈటీవి విన్ ఓటిటిలో తెలుగులో ఉంది.

