
మరో దృశ్యం? ‘వలతు వశతే కల్లన్’ మూవీ రివ్యూ
జీతూ జోసెఫ్ ఈసారి మ్యాజిక్ చేసాడా?
పోలీస్ స్టేషన్ అంటే న్యాయం దొరికే చోటు అనుకుంటాం. కానీ అదే స్టేషన్‌లో నేరస్థులకే రక్షణ దొరికితే? డబ్బు, రాజకీయ శక్తి, ఖాకీ ఒకే వైపు నిలిస్తే? అప్పుడు బాధితుడు చట్టాన్ని నమ్ముతాడా... లేక తన చేతుల్లోనే తీర్పు రాస్తాడా? ఇదే ప్రశ్నను గట్టిగా మన ముఖంపై విసిరే థ్రిల్లర్ ‘వలతు వశతే కన్నన్’.
కాలడి సీఐ ఆంటోనీ (బిజూ మీనన్) ఒక పోలీస్ ఆఫీసర్ కంటే, స్థానిక రాజకీయ నేత మురళికి నమ్మకమైన బంటుగా ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. మురళి కొడుకు రాజీవ్ చేసే ప్రతి దారుణాన్ని, ప్రతి అక్రమాన్ని ఆంటోనీ తన అధికారంతో అణిచివేస్తుంటాడు.కేసులు మాయం చేయడం, సాక్ష్యాలు మేనేజ్ చేయడం, బాధితులను బెదిరించడం... ఇవన్నీ అతనికి రోజువారీ పని. అదే క్రమంలో 'దీప్తి' అనే అమ్మాయి హత్య కేసును కూడా రాజీవ్ కోసం గాలికొదిలేశాడు.
అయితే, పాపం ఏదో రోజు పండక మానదు అన్నట్టు.. రాజీవ్ తో తిరుగుతూ తన సొంత కొడుకు ఫిలిప్ కూడా చెడిపోతుంటే, ఆంటోనీ అదుపు చేయలేక సతమతమవుతుంటాడు. తండ్రిగా ఆంటోని అతడిని మందలిస్తాడు, ఆపాలని ప్రయత్నిస్తాడు. కానీ ఒక దశ తర్వాత అతనికే అర్థమవుతుంది... తాను కాపాడిన నేరాలే ఇప్పుడు తన ఇంటి తలుపు తడుతున్నాయని. అసలు సినిమా అక్కడే మొదలవుతుంది.
మాయమైన కూతురు.. బయటపడ్డ నిజం
సరిగ్గా ఇలాంటి సమయంలోనే శామ్యూల్ (జోజూ జార్జ్) అనే వ్యక్తి స్టేషన్ కి వస్తాడు. తన కూతురు మాయమైందని, దీప్తి కేసు విషయంలో రాజీవ్ నుంచి ఆమెకు బెదిరింపులు వచ్చాయని మొరపెట్టుకుంటాడు. ఆమె ‘లా’ చదివిందని, దీప్తి హత్య కేసులో నిజాలు బయటకు తీయడానికి ప్రయత్నించిందని అంటాడు. శామ్యూల్ ఒక 'ఎథికల్ హ్యాకర్' అని తెలియగానే ఆంటోనీకి లోపల భయం మొదలవుతుంది. కొద్దిరోజులకే ఓ నిర్జన ప్రదేశంలో శామ్యూల్ కూతురు శవమై కనిపిస్తుంది. తన కూతురు మరణం వెనుక రాజీవ్ ఉన్నాడని, అతడిని కాపాడుతున్నది సీఐ ఆంటోనీ అని శామ్యూల్ కి అర్థమవడానికి ఎంతో సమయం పట్టలేదు. డబ్బున్న వాళ్ల కోసం కేసులు ఎలా మాయం అవుతాయో అతనికి అర్థమవుతుంది. పోలీస్ స్టేషన్‌లో న్యాయం దొరకదని తెలిసిన తర్వాత, అతను చట్టాన్ని నమ్మడం మానేస్తాడు.
రివెంజ్ ఆఫ్ ది హ్యాకర్
నేరస్థుడు పక్కనే ఉన్నాడని తెలిసి, వ్యవస్థ మొత్తం వాడికే కొమ్ముకాస్తున్నప్పుడు.. శామ్యూల్ చట్టం ముందు మోకరిల్లలేదు. అతన్ని పట్టుకోవడానికి అతను ఎంచుకున్న మార్గం పోలీసుల ఊహకు కూడా అందదు. డిజిటల్ ప్రపంచంలో రారాజు అయిన ఒక తండ్రి, తనకున్న హ్యాకింగ్ తెలివితేటలతో అధికార గర్వాన్ని ఎలా చెదరకొట్టాడు..అతనేం చేశాడు? ఆంటోనీని ఎలా ఇరుకున పెట్టాడు? అనేది చూసి తెలుసుకోవాల్సిన కథ.
ఎలా ఉంది
కొన్ని సినిమాలు కథ చెప్పవు… ప్రేక్షకుడితో ఆడుకుంటాయి. ఈ సినిమా మొదట మనకు ఒక థ్రిల్లింగ్ పజిల్ ఇస్తాయి, తర్వాత ఒక్కో లేయర్ తీస్తూ మనల్ని లోపలికి లాగుతాయి. కానీ ఆ పజిల్ చివరికి మనల్ని ఆశ్చర్యపరచాలంటే, సినిమా ముందుగా ప్రేక్షకుడి తెలివిని గౌరవించాలి.
‘వలతు వశతే కన్నన్’ దగ్గర అసలు సమస్య అదే. ఈ సినిమా ప్రేక్షకుడిని నమ్మదు. అందుకే ప్రతి భావాన్ని అండర్‌లైన్ చేస్తుంది, ప్రతి రియాక్షన్‌ను జూమ్ చేస్తుంది, ప్రతి ట్విస్టును ముందే లీక్ చేస్తుంది.
దృశ్యం వంటి సూపర్ హిట్ ఇచ్చిన Jeethu Joseph అనే దర్శకుడి బలం ఎప్పుడూ “స్క్రీన్‌ప్లే స్ట్రక్చర్”. ఆయన సినిమాల్లో కథలు పెద్దవి కాకపోవచ్చు, కానీ సమాచారం దాచే విధానం, reveal timing, audience manipulation చాలా sharp గా ఉంటాయి. కానీ ‘వలతు వశతే కన్నన్’లో ఆయన అదే దృశ్యం స్క్రీన్ ప్లే గ్రామర్ ను రిపీట్ చేసిన ఫీలింగ్ వస్తుంది.ఈ సారి కథ ఆర్గానిక్ గా కాకుండా, చాలా సీన్స్ లో ఇక్కడ సస్పెన్స్ ఫీల్ అవ్వాలి” అని బలవంతంగా డిజైన్ చేసినట్టుగా అనిపిస్తాయి. అందుకే క్లైమాక్స్ రివీల్ అయ్యినప్పుడు “వావ్” అనిపించదు.
టెక్నికల్ గా..
కథనం బలహీనంగా ఉన్నా, చిత్రీకరణ మాత్రం సినిమాకు పెద్ద బలం. చాలా దృశ్యాలను మసక రంగుల్లో చూపిస్తూ, కథలోని చీకటి వాతావరణాన్ని బాగా పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తీసిన సీన్స్ చాలా సహజంగా అనిపిస్తాయి. కెమెరా వర్క్ నీట్ గా సినిమా ఎస్సెన్స్ ని పట్టుకుంది.
విష్ణు శ్యామ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని భావాన్ని నిలబెట్టింది.అనేక సన్నివేశాలకు బలం ఇచ్చింది. కథలో భావోద్వేగం తగ్గిన చోట కూడా సంగీతం ఆ లోటును కొంత భర్తీ చేసింది. ముఖ్యంగా సస్పెన్స్ సీన్స్ లో సంగీతం ప్రభావం బాగా పనిచేసింది.
నటనలు సహజంగా ఉన్నా… పాత్రల డెప్త్ తక్కువ
Joju George తన పాత్రలో సహజత్వాన్ని తీసుకొచ్చాడు. ముఖ్యంగా అలసిపోయిన తండ్రిలా కనిపించే శరీర భాష బాగా పనిచేసింది. పోలీస్ స్టేషన్ సన్నివేశాల్లో కూడా ఆయన నటన బాగుంటుంది.
Biju Menon తన అనుభవంతో పాత్రను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ పాత్ర రచన ముందే ఆయన స్వభావాన్ని బయటపెట్టేయడంతో, నటుడిగా ఆయనకు పెద్దగా అవకాశం దక్కలేదు. మిగతా నటీనటులు తమ పరిధిలో బాగానే చేశారు. కానీ ఎవరికీ ప్రత్యేకంగా గుర్తుండిపోయే పాత్ర దక్కలేదు.
ఫైనల్ థాట్
గతంలో వచ్చిన మళయాళ థ్రిల్లర్స్ లో ఆడియన్స్ డిటేల్స్ ని ఆబ్జర్వ్ చేసి వాళ్లు సైతం ఇన్విస్టిగేట్ చేసేలా స్క్రీన్ ప్లే డిజైన్ చేసేవారు. ఇప్పుడు కెమెరా ..ఆడియన్స్ కు ఆన్సర్స్ చెప్తోంది. జీతూ జోసెఫ్ ని దృశ్యం సినిమా ఇంకా వదలినట్లు లేదు.
ఎక్కడ చూడచ్చు
తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది

