
మైఖేల్ జాక్సన్ చీకటి కోణాలు పై షాకింగ్ డాక్యు-సిరీస్!
ప్రపంచం చూసింది అబద్ధమా?
ఆ మూసి ఉన్న తలుపుల వెనుక అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఇదే ప్రశ్న బాంబులా మైఖేల్ జాక్సన్ అభిమానుల మధ్య పేలింది. ప్రపంచాన్ని తన డ్యాన్స్‌తో, పాటలతో ఊపేసిన మైఖేల్ జాక్సన్ జీవితంలో అత్యంత వివాదాస్పద అధ్యాయాన్ని టచ్ చేస్తూ నెట్‌ఫ్లిక్స్ ఒక మైండ్ బ్లోయింగ్ బాంబ్ పేల్చింది. 'మైఖేల్ జాక్సన్: ది వర్డిక్ట్' (Michael Jackson: The Verdict) పేరుతో రాబోతున్న ఈ డాక్యు-సిరీస్ ట్రైలర్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
ట్రైలర్ విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో ఒకే ప్రశ్న తిరుగుతోంది “జాక్సన్ నిజంగా నిర్దోషినా?.. లేక ప్రపంచం చూడని ఇంకో కథ ఉందా?”
కోర్ట్‌లో కెమెరాలు లేవు… కానీ ఇప్పుడు తలుపులు తెరుచుకుంటున్నాయి!
2005లో జరిగిన ఈ విచారణ ప్రపంచ మీడియాను ఊపేసింది. పిల్లలపై లైంగిక వేధింపుల ఆరోపణలు, నెవర్‌ల్యాండ్ రాంచ్ చుట్టూ తిరిగిన అనుమానాలు, మీడియా ట్రయల్, అభిమానుల ఆగ్రహం మొత్తం కేసు అప్పట్లో ఒక గ్లోబల్ స్పెక్టకిల్‌గా మారిపోయింది.
కానీ అసలు విషయం ఏమిటంటే… ఆ కోర్ట్ రూమ్‌లో కెమెరాలకు అనుమతి లేదు. అంటే ప్రపంచం చూసింది బయట మీడియా చెప్పిన కథ మాత్రమే. ఇప్పుడు అదే అంశాన్ని ప్రధాన హుక్‌గా తీసుకుని దర్శకుడు Nick Green ఈ డాక్యు-సిరీస్‌ను రూపొందించాడు.
ట్రైలర్‌లో వినిపించే ఒక్క డైలాగ్‌నే సిరీస్ టోన్‌ను సెట్ చేస్తుంది:
“ప్రపంచం విన్నది వాదనలు మాత్రమే… కానీ కోర్ట్‌లో జరిగినది వేరే కథ.”
ఈ డాక్యుమెంటరీలో ఏముంది?
ఈ మూడు భాగాల డాక్యు-సిరీస్‌లో…
జ్యూరీ సభ్యుల ప్రత్యక్ష అనుభవాలు
ప్రాసిక్యూషన్ & డిఫెన్స్ లాయర్ల అభిప్రాయాలు
కోర్ట్‌ను కవర్ చేసిన జర్నలిస్టుల విశ్లేషణలు
ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు
జాక్సన్‌ను సమర్థించిన వారి వాదనలు
ఆరోపణలు చేసిన వ్యక్తుల భావోద్వేగ క్షణాలు
అన్నింటినీ కలిపి “ఒకే ఫ్రేమ్‌లో” చూపించే ప్రయత్నం కనిపిస్తోంది.
ఇది కేవలం “మైఖేల్ జాక్సన్ బయోగ్రఫీ” కాదు. ఇది ఒక వ్యక్తి మీద ప్రపంచం ఎలా తీర్పు ఇచ్చిందో… మీడియా కథనాలు ప్రజల ఆలోచనలను ఎలా మలిచాయో… సెలబ్రిటీ పవర్ న్యాయవ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో అన్వేషించే కోర్ట్‌రూమ్ స్టడీలా కనిపిస్తోంది.
‘మైఖేల్’ సినిమా జాక్సన్‌ను హీరోగా చూపితే… ఈ సిరీస్ ప్రశ్నలు వేస్తోంది!
ఇటీవల విడుదలైన Michael బయోపిక్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. ఆ సినిమా జాక్సన్ ఎదుగుదల, సంగీత ప్రతిభ, స్టార్‌డమ్‌పై ఎక్కువగా ఫోకస్ చేసింది.
కానీ…
అతని జీవితాన్ని వెంటాడిన వివాదాల్ని మాత్రం దాదాపు పక్కన పెట్టింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ తీసుకొస్తున్న “The Verdict” మాత్రం అదే చీకటి వైపు నేరుగా వెళ్లింది. అంటే ఒకవైపు “లెజెండ్” కథ నడుస్తుంటే… మరోవైపు “ఆరోపణల వెనుకున్న నిజం”పై విచారణ మొదలైంది. అందుకే ఈ రెండు ప్రాజెక్ట్స్ మధ్య పోలిక ఇప్పుడు హాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అసలు కేసులో ఏం జరిగింది?
2005లో జరిగిన ఈ విచారణ మొత్తం 14 వారాలు సాగింది. జాక్సన్‌పై మొత్తం 10 తీవ్రమైన ఫెలనీ కేసులు నమోదయ్యాయి.
అందులో:
పిల్లలపై లైంగిక వేధింపులు
మైనర్‌కు మద్యం ఇవ్వడం
కుట్ర ఆరోపణలు
బంధించి ఉంచినట్టు ఆరోపణలు
వంటి అంశాలు ఉన్నాయి. అయితే చివరకు జ్యూరీ అన్ని కేసుల్లోనూ జాక్సన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. కానీ…
అదే తీర్పు తర్వాత కూడా వివాదం ఆగలేదు. కొంతమంది “అతను మీడియా వేటకు బలయ్యాడు”అంటుంటే… మరికొందరు “పవర్ & ఫేమ్ నిజాన్ని కప్పేశాయి” అని నమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ అదే పాత గాయాన్ని మళ్లీ తెరిచింది.
ఇది కేవలం జాక్సన్ కథ కాదు… సెలబ్రిటీ కల్చర్‌పై ఒక గట్టి ప్రశ్న! ఈ సిరీస్ అసలు బలం అక్కడే ఉంది.ఇది “జాక్సన్ చేశాడా లేదా?” అనే సింపుల్ డిబేట్‌గా కాకుండా…మీడియా ట్రయల్స్ ఎంత ప్రమాదకరమో అభిమానుల బ్లైండ్ ఫాలోయింగ్ ఎలా పనిచేస్తుందో కోర్టు తీర్పు వచ్చినా ప్రజల అభిప్రాయం ఎందుకు మారదో
ఒక సెలబ్రిటీ ఇమేజ్ నిజాన్ని ఎలా కప్పేస్తుందో అనే పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. అందుకే ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ఒకే మాట చెబుతున్నారు: “ఇది డాక్యుమెంటరీ కాదు… మళ్లీ మొదలైన విచారణ.”
ఏదైమైనా..
Michael Jackson పేరు ఎప్పటికీ సంగీత చరిత్రలో నిలిచిపోతుంది. కానీ అదే సమయంలో అతని జీవితంపై ఉన్న వివాదాలు కూడా ఎప్పటికీ ముగియని చర్చగానే మిగిలిపోయాయి. ఇప్పుడు Netflix తీసుకొస్తున్న “Michael Jackson: The Verdict”… ఒక లెజెండ్‌ను కాపాడే ప్రయత్నమా? లేక ప్రపంచం మర్చిపోయిన ప్రశ్నలను మళ్లీ గుర్తు చేసే విచారణా? అసలు తీర్పు కోర్ట్ అప్పుడే ఇచ్చేసింది. కానీ ప్రజల తీర్పు మాత్రం… ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
జూన్ 3న అసలు నిజాలు బయటపడతాయా?
ఈ డాక్యుమెంటరీ మైఖేల్ జాక్సన్ ఇమేజ్‌ను మళ్లీ డ్యామేజ్ చేస్తుందా లేక ఆయన నిర్దోషిత్వాన్ని మరింత బలంగా నిరూపిస్తుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏది ఏమైనా, పాప్ ఐకాన్ జీవితంలోని మోస్ట్ కాంట్రవర్షియల్ కోర్టు డ్రామాను కంటికి కట్టినట్లు చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. జూన్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ ఇంకెన్ని సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి!

