
AI Creation
యాది కోస్తున్నాయి...
ఎండాకాలం సెలవులు వచ్చినాయంటే బడికి బోయేపోరాన్లు కలిసి బావులపోంటి పోయి అందులో కొందరు ఆంధపు లొట్టలు కట్టుకొని ఈతలు నేర్చుకునేటోళ్లం.
సరిగ్గా 40 సంవత్సరాల క్రితం మార్చి చివరి వారంలో వార్షిక పరీక్షలు పూర్తి కాగానే మా దోస్తులు అంతా బీసీ ఎస్టీ హాస్టల్లో ఉన్న వారంతా పెట్టే బేడా సర్దుకొని వారి ఊరు బాట పట్టేవాళ్ళు. మేము కూడా సెలవుల రోజు కేరింతలు వేస్తూ మా మా ఇండ్లలోకి చేరుకునే వాళ్ళం.
సెలవుల మొదటి పది రోజులు దాదాపుగా మేమందరము అమ్మమ్మ వారి ఇళ్లలోకి వెళ్లే వాళ్ళము అక్కడ కూడా మాకు సంవత్సరానికి ఒకసారి పోయినప్పుడల్లా ప్రతి సంవత్సరం సెలవులలో వెళ్ళినప్పుడు అక్కడ కూడా మాకు వారి ఊర్లో చదువుకునే మాతోటి వారు దోస్తులుగా ఏర్పడేవాళ్లు.
అమ్మమ్మ ఊరిలోని దోస్తుగాండ్లతో కలిసి ఊరంతా కలదిరిగే వాళ్ళం.
రకరకాల ఆటలు ఆడుకునే వాళ్ళం. టైరాట, దొంగ పోలీసు, చిర్రగోన, బంతాట, దాడి ఆట దాగుడుమూతలు అష్టా చమ్మా ఆట గుడు గుడు గుంచం పులి మేక ఆటలు మొదలైన ఆటలు వారితో కలిసి ఆడుకునే వాళ్ళం.
అమ్మమ్మ ఊరిలో సెలవులు కొంతకాలం గడిపి తర్వాత మా ఊరికి వచ్చి సోపతి గా గాన్లతో కలిసి రోజుకో తీరు ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళం.
ముఖ్యంగా ఈఎండాకాలం సెలవులు వచ్చినాయంటే బడికి బోయేపోరాన్లు అంతా ఒక దగ్గర కలుసుకునేటోళ్లం. కలిసి బావులపోంటి పోయి అందులో కొందరు ఆంధపు లొట్టలు కట్టుకొని ఈతలు నేర్చుకునేటోళ్లం. ఈత వచ్చిన వాళ్ళము ఈత గొట్టేటోళ్లం. గట్ల పొద్దోంగెవరకు అంత బావులలో ఈతలు గొట్టేటోళ్లం.
తడిసిన బట్టలతో తిరిగి ఇంటికొస్తుంటే మా దేహం అంతా పేలిపోయి ఇర్వమనేది.
ఇంటికి వచ్చి అమ్మ ఉట్టి మీద ముంతలో మామిడికాయ పచ్చడితో కలిపి పెట్టిన జొన్న గటక ముంతా కిందికి తీసి సత్తి గిన్నెలో పోసుకొని జుర్రుమంటూ ఉల్లిగడ్డ కొరక్కొని తింటూ తాగేది.
సెల్కా సెల్కా సెట్టు సెట్టు తిరిగేటోళ్ళం సీమ చింతకాయలు, మామిడికాయలు, జామకాయలు, ఈత పండ్లు, జిన్న పండ్లు తెంపుకొని తినడం తప్ప కొనుక్కునే వాళ్ళం కాదు.
మా అయ్యా బాయికా నుంచి తాటి కాయలు తెచ్చి ముంజలు తీసి ఇస్తే పోరాళ్ళం అంతా కలిసి కూర్చొని కడుపునిండా తినేటోళ్లం.
అమ్మ సాయంకాలం సర్వపిండి, జొన్న రొట్టెలు, కంది గుడాలు, లేదా బొబ్బరి గుడాలు వెసేది మాకు గవ్వే తినుబండారాలుగా ఉండేవి. గవ్వే మేము గాటిని జేబులలో పోసుకొని బజార్లు తిరుగుతూ అరుగుల పైన కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఒకరి దగ్గరివి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటూ తినేటోళ్లం.
పొద్దుగూగినంక పెద్దవాళ్లంతా అమ్మ, చిన్నమ్మలు ఇంటి పక్క వాళ్ళు అయ్యా పెద్ద వాళ్ళందరూ చుట్టు కామెడీ వెసుకుంటూ ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని వాన దేవుని తలుచుకుంటూ పాటలు పాడేవారు మరి కొందరు రకరకాల జానపద గేయాలు పాడుతూ ఉండేది.
మేము మాత్రంఅవ్వలేదా తాతయ్య ఆరుబయట ఆకిట్లో మంచం వేసుకొని వారి పక్కన పండుకొని ఉంటే వారు మాకు చెప్పేరామాయణ భారత భాగవతంలోని నీతి కథలు చెబుతూ ఉంటే హాయిగా వింటు ఎప్పుడు నిద్రలోకి జారిపోయేది మాకు పొద్దుగాల లేసే వరకు గాని తెలిసేది కాదు. గిట్ల ఎండాకాలం సెలవులు ఆటపాటలు తో ఆనందంగా గడిపేటోల్లం.
Next Story

