గత పదేళ్లో భారత్ లో రద్దయిన పరీక్షలు ఇవే
x

గత పదేళ్లో భారత్ లో రద్దయిన పరీక్షలు ఇవే

కనీసం కోటి మంది విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల మానసిక క్షోభ అనుభవించారు. దేశంలో ఒక్క వ్యవస్థ కూడా సక్రమంగా పరీక్షలు నిర్వహించలేకపోతున్నది


‘నీట్ యుజి 2026 పరీక్ష జరగటానికి నెల రోజుల ముందు నుంచే ఈ గెస్‌ పేపర్‌ అంటూ ఒక పేపర్ విద్యార్థుల్లో చక్కర్లు కొడుతూ ఉంది. అందులో410 ప్రశ్నలు ఉన్నాయి. విచిత్రమేమిటంటే, నీట్‌ కెమిస్ట్రీ పరీక్ష పేపర్‌ నాలుగు సెట్లకు సంబంధించిన 120 ప్రశ్నలు గెస్ పేపర్ లో యధాతధంగా ప్రత్యక్ష మయ్యాయి. ఈ గెస్‌ పేపర్‌ ను ఎవరు సెట్ చేశారు, 120 ప్రశ్నలు వాళ్లకి ఎలా అందాయి, ఎవరు దీనిని సర్క్యులేట్ చేస్తున్నారు అనే దాని మీద ఇపుడు దర్యాప్తు జరుగుతూ ఉంది. అనే ఈ రోజు పత్రికల్లో ప్రముఖంగా వచ్చిన దుర్వార్త

నిన్న మధ్యాహ్నం పొక్కిన ఈ వార్త 23 లక్షల మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసిక సంక్షోభంలోకి నెట్టింది.

పరీక్ష ప్రతాలు లీక్ కావడం కొత్త కాదు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో పరీక్ష పత్రాలు లీక్ అవుతున్నాయి. విశ్వగురు అని కీర్తి తెచ్చుకోవాలనుకుంటున్న దేశంలో ప్రభుత్వవిద్యారంగ వ్యవస్థలేవీ పరీక్షలను కట్టుదిట్టంగా జరిపలేకపోతున్నాయి. తెలంగాణ నుంచి బీహార్, రాజస్థాన్ దాకా అన్నీ లీకేజీలో. దీనితో దేశీయ విద్యావిధానం మీద విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో నమ్మకం పోతున్నది. ఫలితంగా విదేశాలలో ఉన్నత విద్య కోసం వేళ్లే వారి సంఖ్య ఎక్కువయింది. గత పదేళ్ల జాతీయ స్థాయిలో ఏదో ఒక కారణంతో రద్దయిన పరీక్షలవే. ప్రతి పరీక్షల రద్దు లక్షలాది మంది విద్యార్థులకు ఆవేదన మిగిలించింది. ఎంతో శ్రమకోర్చి పరీక్షలకు ప్రిపేరయి రాస్తే పరీక్ష రద్దు కావడం, కష్టించే విద్యార్థులను కృంగదీస్తుంది. వీళ్లలో చాలామంది మళ్లీ అంతే ఉత్సాహంతో చదవలేకపోవచ్చు కూడా.

Year

Exam

Reason for Cancellation/Postponement

Impact

2026

NEET-UG

Question paper leaked via WhatsApp "guess papers" in Rajasthan.

23 Lakh students

2024

UGC-NET

Integrity compromised (paper leaked on Darknet/Telegram).

9 Lakh candidates

2024

CSIR-UGC NET

Postponed due to "unavoidable circumstances" and logistics.

2 Lakh candidates

2024

NEET-PG

Postponed as a "precautionary measure" following UG leaks.

2 Lakh doctors

2024

UP Police Constable

Massive paper leak; exam cancelled after 48 lakh appeared.

48 Lakh candidates

2023

Rajasthan REET

Repeated leaks led to multiple cancellations and internet shutdowns.

16 Lakh candidates

2022

BPSC (Bihar)

67th Prelims cancelled after paper was leaked on social media.

6 Lakh candidates

2021

UPTET

Cancelled mid-exam after the paper went viral on WhatsApp.

20 Lakh candidates

2021

REAP/Rajasthan SI

Cancelled in 2026 (retroactively) due to 2021 probe findings.

Thousands

2020

JEE/NEET

Multiple postponements due to the COVID-19 pandemic.

25 Lakh+ students

2018

CBSE Class 10/12

Economics (12) and Maths (10) papers leaked; re-exam ordered.

28 Lakh students

2017

SSC CGL

Tier-II cancelled after protests over alleged paper leaks.

1.5 Lakh students

2015

AIPMT

Supreme Court scrapped the exam due to large-scale cheating.

6 Lakh students

దీని వల్ల విద్యార్థులు విదేశాలలో విద్యను అభ్యసించేందుకు పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చిస్తున్నారు. గత పదేళ్లలో ఇలా విదేశాల్లకు వెళ్ళిన డబ్బు 2874శాతం పెరిగింది. ఇది కళ్లు చెదిరిపోయే వాస్తవం. నీతి ఆయోగ్ నివేదిక Internationalisation of Higher Education in India: Prospects, Potential, and Policy Recommendations దీనిని గురించిన ఆసక్తికరమయిన వివరాలు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2013-14లో భారతీయ విద్యార్థులు విదేశాలలో విద్య కోసం బదిలీ చేసిన మొత్తం రు. 975కోట్లు మాత్రమే. కాని, ఇది 2023-24 నాటికి ఇరవైఇంతలు పెరిగి రు.29,000 కోట్లకు చేరింది.ఇది భారత ప్రభుత్వ విద్యాశాఖ బడ్జెట్ లో 50 శాతం. అంతర్జాతీయంగా గొప్పదేశంలో పేరు పొందాలనుకుంటున్న దేశంనుంచి ఉన్నత విద్యాకోసం విద్యార్థులు ఇంత పెద్ద మొత్తం చెల్లించి దేశం విడిచిపోతున్నారు. ఇది కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే. ఆదేశంలో భారతీయ విద్యార్థుల జీవించేందుకు, ప్రయాణలు, ఇతర ఖర్చు ల మొత్తాలను లెక్కిస్తే 2025 నాటికి వాళ్లు ఖర్చుచేసిన మొత్తొ రు.6 లక్షలకోట్ల దాకా ఉంటుందని నీతి ఆయోగ్ లెక్కించింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ సమానం గా ఉంటుంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ₹3,24,234 కోట్ల (3.24 లక్షల కోట్లు) బడ్జెట్‌ను ఆ మధ్య అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 14, 2026న శాసనసభలో ప్రవేశపెట్టారు. రెండు కలిపితే రు. 6.5 లక్షల కోట్లు.

విదేశీ విద్యకోసం భారతీయ విద్యార్థులు చెల్లించిన ట్యూషన్ ఫీజు వివరాలు

Fiscal Year

Amount (in ₹ Crore approx.)

Key Trend / Event

2013-14

₹975

నీతిఆయోగ్ రిపోర్టు ఎంచుకున్నబేస్ లైన్ సంవత్సరం

2014-15

₹1,050

భారీగా పెరగడం మొదలయింది.

2015-16

₹2,800

రిజర్వు బ్యాంక్ Liberalised Remittance Scheme (LRS) పరిమితిని $250,000 కి పెంచారు.

2016-17

₹5,100

విదేశీ విద్య కాంక్షిస్తున్న అండర్ గ్రాజ్యుయేట్ విద్యర్థుల సంఖ్య పెరిగింది

2017-18

₹7,200

పెరుగుదల ఆగలేదు

2018-19

₹12,300

మొదటి సారి రు.పదివేల కోట్లు దాటింది.

2019-20

₹18,500

కోవిడ్ కుముందు పతాక స్థాయికి చేరింది.

2020-21

₹14,000

కోవిడ్ కాలంలో ప్రయాణాల మీద నిషేధం ఉండటం వల్ల తగ్గింది.

2021-22

₹22,500

విపరీతంగా పెరిగింది. కోవిడ్ వల్ల ఆగిపోయిన వాళ్లంతా విదేశాలకు పరుగుపెట్టారు. దీనితో డబ్బు ప్రయాణం కూడా పెరిగింది.

2022-23

₹26,500

ఇంకా పెరిగింది.

2023-24

₹29,000

నీతిఆయోగ్ నివేదిక చూపించిన అత్యున్నత స్థాయి

పరీక్షల రద్దు - విచ్ఛిన్నమవుతున్న ఆశలు

కేవలం చదువులో ప్రతిభ ఉంటే సరిపోదు, వ్యవస్థలోని అవినీతిని కూడా తట్టుకోవాలనే పరిస్థితి నేడు నెలకొంది. 2026 మే నెలలో జరిగిన నీట్-యుజి (NEET-UG) పేపర్ లీకేజీ ఉదంతం దీనికి పరాకాష్ట. రాజస్థాన్‌లో వాట్సాప్ ద్వారా ప్రశ్నపత్రం లీక్ కావడంతో 23 లక్షల మంది విద్యార్థుల శ్రమ వృధా అయ్యింది. గడచిన దశాబ్ద కాలంలో NEET, UGC-NET, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలు, మరియు వివిధ రాష్ట్రాల పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు లీకేజీ భూతానికి బలైపోయాయి.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వంటి ఉన్నత స్థాయి సంస్థలు ఉన్నప్పటికీ, 'సాల్వర్ గ్యాంగులు' సాంకేతిక లోపాలు విద్యార్థుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ఒక పరీక్ష కోసం ఏళ్ల తరబడి సిద్ధమయ్యే విద్యార్థికి, పరీక్ష రద్దయిందనే వార్త పిడుగుపాటు వంటిది.

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం భారతదేశం మొత్తం ఉన్నత విద్యా బడ్జెట్‌లో సగం కంటే ఎక్కువ సొమ్మును, కేవలం 3 శాతం మంది విద్యార్థులు విదేశీ విద్య కోసం ఖర్చు చేస్తున్నారు. అంటే, దేశంలోని 97 శాతం మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం కేటాయించే నిధుల కంటే, విదేశాలకు తరలిపోతున్న ప్రైవేట్ నిధుల వాటా పెరిగిపోతోంది. కానీ ఈ 97శాతం విద్యార్థుల కష్టాలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. వాళ్ల రాసిన పరీక్షలు ఎపుడు రద్దవుతాయో తెలియని భయం వారిని నిత్యం వెంటాడుతూ ఉంటుంది.

పరిష్కారం ఎక్కడ?

నిరంతరం పరీక్షలు వాయిదా పడటం వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరగడమే కాకుండా, విద్యా సంవత్సరం కూడా దెబ్బతింటోంది. తక్కువ సమయంలో సిలబస్ పూర్తి చేయాల్సి రావడం వల్ల విద్యా నాణ్యత తగ్గుతోంది.

ప్రభుత్వం కేవలం సాంకేతిక మార్పులు (CBT) చేయడం కాకుండా, పరీక్షా నిర్వహణలో జవాబుదారీతనం (Accountability) పెంచాలని నిపుణులు నిపుణలు సూచిస్తున్నారు. లేనిపక్షంలో, మేధో వలసలతో పాటు ఆర్థిక వలసలు కూడా పెరిగి, భారతదేశం తన విలువైన మానవ వనరులను కోల్పోయే ప్రమాదం ఉంది.


Read More
Next Story