వేసవి ప్రతాపం, ప్రచండ భానుడి ఉగ్రరూపం మొదలై అప్పుడే రెండువారాలైంది. దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు గత మూడు నాలుగు నెలలకు ముందునుంచే వేసవి విడిదికి ఎక్కడికెళ్లాలో నిర్ణయించుకొని పర్యటన ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం, కొందరు వెళ్లిరావడం, మంచు ప్రదేశాల్లో సేదతీరుతూ ఉండటం ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. దక్షిణాది పర్యాటకులైతే ఎప్పటిలా సుందర కాశ్మీరం, మంచుకురిసే మనోహర మనాలి (కులు) ఊటీ, కొడైకెనాల్ లేదా ఇంకో అడుగు ముందుకేసి డార్జిలింగ్, సిక్కిం వరకు వెళ్లిరావడం పరిపాటి.
మరి ఈశాన్య రాష్ట్రాల మాటేమిటి?
పత్రికలు, చానళ్ళు, సామజిక మాధ్యమాల కారణంగా ఏడు అక్కచెల్లెళ్లుగా ప్రసిద్ధి చెందిన -త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలకు వెళ్ళడానికి ముందు అక్కడి నాలుగు రాష్ట్రాలలో జరుగుతున్న అల్లర్ల కారణంగా భయపడుతున్నారు. కొంతవరకు ఇది నిజమే కానీ అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ కు మాత్రం హాయిగా వెళ్లి సేద తీరవచ్చు అని మేము వెడితేగాని తెలియలేదు.
అక్కడి ఆకుపచ్చని కనుమలు, లోయలు, అత్యధుతమైన ప్రక్రుతి నడుమ జోరున పడే జలపాతాలు, కమనీయమైన సుందర వనాలు, జీవ జాతులు, అడుగడుగునా కనిపించే సంప్రదాయబద్ధమైన స్థానిక బాలబాలికలు, స్త్రీలు-అంతా శ్రమజీవులే.
మా ప్రయాణం సాగిందిలా....
నేను, శ్రీమతితో పాటు మా రెండో అబ్బాయి కలిసి హైదరాబాద్ నుండి గౌహతికి పొనురాను flight tickets చేయించుకొని 12 రోజులు (ఏప్రిల్ 4 నుంచి 16 వరకు )మూడు రాష్ట్రాలు అలుపెరుగక కలియతిరిగాము. ఎక్కడా అలసట, నిద్ర లేమి అన్న మాట లేదు. ఇందుకు కారణం మేము ఎంచుకున్న ట్రావెల్ కంపెనీ. దాని గురించి చివరిలో వివరిస్తాను.
గౌహతి అనగానే అష్టాదశ పీఠాల్లో అతిశక్తివంతమైన "కామాఖ్యా మందిరం" గుర్తుకు వస్తోంది. ఆమె దర్శనం తిరుమల వెంకటేశ్వర స్వామి కంటే ఆలస్యమవుతుంది అని చెప్పినా మా దగ్గర ఢిల్లీ లో ఉన్నమంచి మిత్రుడు, ప్రముఖ ఛానల్ లో పనిచేసే శ్రీ ప్రసాద్ గారికి తెలిసిన ప్రముఖ వ్యక్తి సిఫారసు ఉందనే ధైర్యంతో వెళ్లినా వీవీఐపీ దర్శనానికి 3 గంటలు పట్టింది. ఐతే ఇక్కడి పండిట్ (పూజారులు) మనిషికి ఐదు వేలు ఇస్తే 10 నిమిషాల్లో దర్శనం చేయిస్తారని అక్కడి వారు చెప్పారు.
దర్శనం తరువాత సాయంత్రం బ్రహ్మపుత్ర నదికి వ్యాహ్యాళికి వెళ్ళాము. మరుసటి రోజు అస్సాం నేషనల్ మ్యూజియం వెడితే సాంప్రదాయ నృత్య రీతులు, గిరిజన సంప్రదాయానికి సంబంధినిచ్చిన ఒకప్పటి ఆయుధాలు ఇలా ఎన్నో వున్నాయి.
అన్నింటికన్నా అక్కడ ఆశ్చర్య పరిచింది -అస్సామీ ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు, గాయకుడు, రచయిత, నటుడు, రాజకీయ నాయకుడు కూడా ఐన శ్రీ భూపేన్ హజారికాకు ప్రత్యేక గేలరీ (ఒక పెద్ద మందిరం) ఉండటమే. అప్పుడు మన ఘంటసాల, బాలు గారి లాంటివారికి మనం ఏమిచ్చాము అని బాధ కలిగింది.
గౌహతిలో మరో రెండుమూడు ప్రదేశాలు వున్నా సమయాభావం కారణంగా మా మొదటి దశ యాత్ర మేఘాలయ వైపు సాగించాము.
మేఘాలలో తేలిపోయాం:
"స్కాట్లాండ్ అఫ్ ఈస్ట్" గా పిలవబడే ఈ రాష్ట్ర రాజధాని షిలాంగ్ వైపు వెడుతుంటే మార్గమధ్యం నుంచే మా ఉత్సాహం, ఉత్సుకత ఉరకలు వేసింది. పచ్చని పర్వత శ్రేణుల మధ్య మేఘాలు మన కాళ్ళ క్రింద పరుగులు తీస్తున్నాయా అన్నట్లు వుండే "లైట్లుమ్ కెన్యన్" (Laitlum Canyon) పాయింట్ దగ్గర ఆగితే కదలబుద్ది కాలేదు. దానికి ఎదురుగా పెద్ద జలపాతం వద్ద మా ఫోన్లు వరుసగా ఫోటోలు తీయకుండా ఉండలేక పోయాయి. నేరుగా షిలాంగ్ చేరి రాత్రికి పోలీస్ బజార్ తోపాటు 1939 లో కట్టిన "బిజో సినిమాహాల్"ను నేను, మా అబ్బాయి ఆసక్తిగా చూసాము. అక్కడ "దురంధర్-2" అస్సామిలో డబ్ చేసి ఆడిస్తున్నారు. ఇక్కడే అసలు సైన్యం పహారా మొదలైంది. సూర్యోదయం 5 గంటలకు మొదలు కావడం రాత్రి 8 ౩౦ కి అన్ని మూసివేయడం ప్రతిరోజూ మామూలు అయిపోయింది.
మనదేశంలో అత్యంత స్వచ్ఛమైన, ఇసుక, రాళ్ళూ కూడా స్పష్టంగా కనిపించే "డాకి" నదికి మా వాహనాన్ని పరుగులు తీయించాం. అది బంగ్లాదేశ్ సరిహద్దులో ప్రవహించే నది. కానీ అక్కడ ప్రస్తుతం అక్కడ కొత్త బ్రిడ్జి నిర్మిస్తుండటం, మూడు రోజుల ముందు భారీ వర్షం కురుస్తుండటంతో ఆ మట్టి నదిలోకి జారడంతో నది మొత్తం నల్లగా మారింది. అక్కడ బోట్ షికారు చేసి బాంగ్లాదేశ్ వైపు ఎగుతున్న వారి జాతీయపతాకం కంటే మన మువ్వన్నెల జెండా రెపరెపలు ఎంతో అందంగా ఎగురుతూ ఉందట చూసి మనకు తెలియకుండానే వందనం చేసాము.
ఆ గ్రామం చూడాల్సిందే:
ఆసియా ఖండం మొత్తం మీద శుభ్రమైన గ్రామంగా పేరుతెచ్చుకున్న మౌలియాంగ్ కి వెడితే ఆశ్చర్యం వేసింది. చిన్న గ్రామం అయినా పూర్తిగా పచ్చదనం, రాలిపడే ప్రతి ఆకును అప్పటికప్పుడు గ్రామస్తులు ప్రక్కనే వున్నా వెదురు గంపలో (చెత్త బుట్ట) వేయడం మనకు ఎంతో నేర్పుతుంది.
అసలు ఆ అద్భుతం ఎలా సాధ్యం?
అక్కడి నుండి ఓ ఐదారు కిలోమీటర్లు వెళ్ళగానే "మీరు కర్ర సాయంతో కొంచెం ఎత్తు ఎక్కి జాగ్రత్తగా దిగండి. మొత్తం బంక మట్టి, రాళ్లతో ఏర్పడిన దారి ఇది. అక్కడ ఒక అద్భుతం చూస్తారు" అని మా డ్రైవర్ కమ్ గైడ్ చెప్పగానే పక్కనే వున్నా లోయలో పడకుండా కర్రపోటుతో దిగగానే పెద్ద మర్రి చెట్టు ఊడలు దిగివుంది. ఆ మర్రి ఊడలే ఒక బ్రిడ్జిలా ఏర్పడి క్రింద పారుతున్న పెద్ద సెలయేరు కనిపించింది. ఆ జలపాతంలోకి వెళ్లాలంటే మాత్రం కొన్ని మెట్లు దిగాల్సిందే.ఆలా దిగి వెళ్ళగానే జలపాతం పైవైపు మర్రి ఊడల బ్రిడ్జి చాల అందంగా కనిపించింది.
మళ్ళీ ప్రకృతి ఒడిలోకి : ఏనుగు సవారీ, జీప్ సఫారీ :
అక్కడి నుంచి తిరిగి అస్సాం సరిహద్దుల్లో ఉన్న యునెస్కో గుర్తింపు పొందిన కజిరంగ అంతర్జాతీయ పార్కుకు వచ్చాము. అక్కడి ప్రకృతి అందాల మధ్య ఒక రోజు సినిమాల్లో చూపించే విధంగా జీపు సఫారీ చేయడం (ఒళ్ళు హూనం అవుతుంది. అదే వేరే విషయం), మరో రోజు ఏనుగు సవారీ (అంబారీ ఎక్కి మనల్ని ఎవరూ ఊరేగించరు కనుక) ఒక 50 ఏనుగులపై అక్కడికి వచ్చిన మిగిలిన ఏనుగులతో పార్కు మొత్తం ఉదయం 6 గంటలకు కలియ తిరగడం గొప్ప అనుభూతి.
అసలు కథ ఇక్కడి నుంచే, వీర సైనికులకు నివాళులు:
కజిరంగ నుంచి అస్సాం వదిలి దిరంగ్ పర్వతాల వైపు ఘాట్ రోడ్లలో సన్నటి పాము లాంటి మెలికల దారిలో వెడుతూ దారి పొడవునా 1962 చైనాతో యుద్ధం, ఆ తరువాత జరిగిన యుద్దాలలో వీరత్వం పొందిన లెఫ్టినంట్లు, బ్రిగేడియర్, దేశంకోసం అసువులు బాసిన వీర సైనికులకు కట్టిన స్మృతి చిహ్నాల వద్ద ఆగి అందరు పర్యాటకులు ఒక్క నిమిషం నివాళులు అర్పించి ఫోటోలు తీసుకోవడం దిరంగ్ దారిలో సహజమే.
వణికించే తవాంగ్ కు వెళ్లడమే సవాల్: శీలా పాస్ వద్ద మనం తీసుకున్న పాస్, గుర్తింపు పత్రాలు (ఇవి మన ట్రావెల్ ఏజెన్సీ మనకు ముందుగానే సిద్ధం చేసి ఇస్తుంది) సైనికులు క్షుణ్ణంగా చెక్ చేస్తారు. అక్కడి నుంచే గడ్డకట్టే మంచు ప్రారంభం అవుతుంది. పర్వత శ్రేణులు అన్ని పూర్తిగా మంచుతో కప్పబడి వెండి కొండల్లా కనబడుతాయి. చలికి వణుకుతున్నా దిగి ఒక అరగంట కొద్దిగా ఎత్తైన ప్రదేశం వరకు వెళ్లి మన ఫోన్ కెమెరాలకు పనిచెబుతాము.
తవాంగ్ చేరగానే ఒక్కసారి వాతావరణం మారిపోతుంది. మంచు తుంపరలు పడుతూ ఉంటాయి. చలి గడ గడ వణికిస్తుంది. మైనస్ 1 లేదా 4 వరకు వెడుతుంది. అత్యవసరమైన మందులు, చలిని తట్టుకునే దుస్తులు, చిన్న చిన్న హోటళ్లు, ఒకే ఒక రాజస్థానీ శాఖాహార హోటల్ తవాంగ్ లో వున్నాయి. ఆ రాత్రి ఎలాగో రూమ్ హీటర్ లు పెట్టుకుని, ఒకటికి నాలుగు రగ్గులు లేదా కంబళ్ళు కప్పుకుని వణుకుతూ గడిపాము.
మళ్ళీ ప్రకృతి ఒడిలోకి : ఏనుగు సవారీ, జీప్ సఫారీ :
అక్కడి నుంచి తిరిగి అస్సాం సరిహద్దుల్లో ఉన్న యునెస్కో గుర్తింపు పొందిన కజిరంగ అంతర్జాతీయ పార్కుకు వచ్చాము. అక్కడి ప్రకృతి అందాల మధ్య ఒక రోజు సినిమాల్లో చూపించే విధంగా జీపు సఫారీ చేయడం (ఒళ్ళు హూనం అవుతుంది. అదే వేరే విషయం), మరో రోజు ఏనుగు సవారీ (అంబారీ ఎక్కి మనల్ని ఎవరూ ఊరేగించరు కనుక) ఒక 50 ఏనుగులపై అక్కడికి వచ్చిన మిగిలిన ఏనుగులతో పార్కు మొత్తం ఉదయం 6 గంటలకు కలియ తిరగడం గొప్ప అనుభూతి.
అసలు కథ ఇక్కడి నుంచే, వీర సైనికులకు నివాళులు:
కజిరంగ నుంచి అస్సాం వదిలి దిరంగ్ పర్వతాల వైపు ఘాట్ రోడ్లలో సన్నటి పాము లాంటి మెలికల దారిలో వెడుతూ దారి పొడవునా 1962 చైనాతో యుద్ధం, ఆ తరువాత జరిగిన యుద్దాలలో వీరత్వం పొందిన లెఫ్టినంట్లు, బ్రిగేడియర్, దేశంకోసం అసువులు బాసిన వీర సైనికులకు కట్టిన స్మృతి చిహ్నాల వద్ద ఆగి అందరు పర్యాటకులు ఒక్క నిమిషం నివాళులు అర్పించి ఫోటోలు తీసుకోవడం దిరంగ్ దారిలో సహజమే.
వణికించే తవాంగ్ కు వెళ్లడమే సవాల్:
శీలా పాస్ వద్ద మనం తీసుకున్న పాస్, గుర్తింపు పత్రాలు (ఇవి మన ట్రావెల్ ఏజెన్సీ మనకు ముందుగానే సిద్ధం చేసి ఇస్తుంది) సైనికులు క్షుణ్ణంగా చెక్ చేస్తారు. అక్కడి నుంచే గడ్డకట్టే మంచు ప్రారంభం అవుతుంది. పర్వత శ్రేణులు అన్ని పూర్తిగా మంచుతో కప్పబడి వెండి కొండల్లా కనబడుతాయి. చలికి వణుకుతున్నా దిగి ఒక అరగంట కొద్దిగా ఎత్తైన ప్రదేశం వరకు వెళ్లి మన ఫోన్ కెమెరాలకు పనిచెబుతాము. తవాంగ్ చేరగానే ఒక్కసారి వాతావరణం మారిపోతుంది. మంచు తుంపరలు పడుతూ ఉంటాయి. చలి గడ గడ వణికిస్తుంది. మైనస్ 1 లేదా 4 వరకు వెడుతుంది. అత్యవసరమైన మందులు, చలిని తట్టుకునే దుస్తులు, చిన్న చిన్న హోటళ్లు, ఒకే ఒక రాజస్థానీ శాఖాహార హోటల్ తవాంగ్ లో వున్నాయి. ఆ రాత్రి ఎలాగో రూమ్ హీటర్ లు పెట్టుకుని, ఒకటికి నాలుగు పెద్ద కంబళ్ళు కప్పుకుని చలి భరించాము. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 65 నుంచి 85 ఏళ్ళ వృద్దులు కూడా ఆ పర్యాటక ప్రదేశంలో కనిపించారు.
హిమాలయ శ్రేణుల్లో చైనా సరిహద్దుకు:
పక్క రోజు ఉదయం ఆరు గంటలకల్లా స్థానికంగా వుండే మరో వాహన డ్రైవర్ వచ్చి మమ్మల్ని "బుమ్లా పాస్" కు తన వాహనాన్ని పరుగులుతీయించాడు. దారి పొడవునా ఎప్పుడెప్పుడు సరిహద్దు చేరుతామా అన్న తొందరే గాని, అక్కడికి వెడితే దాదాపు గడ్డ గట్టి పోతామన్న ఆలోచనే రాలేదు.
సముద్రమట్టానికి 15,200 అడుగుల ఎత్తున ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో అడుగు పెట్టగానే ఒక్కసరిగా ఆక్సిజన్ తగ్గి ఊపిరి తీసుకోవడం కాస్త కష్టమనిపిస్తుంది ( 40 ఏళ్ళు దాటిన వారికి).
చైనా సరిహద్దుకు ఆమడ దూరంలోనే అక్కడ పహారా కాస్తున్న సైనికులు మనల్ని ఏంటో స్నేహపూర్వకంగా ఆహ్వానించి మన కెమెరాలను వాడకండి అని చెప్పి వారే మన ఫోటోలు తీసి ఒక ఫ్రేములో అమర్చి పది నిమిషాల్లో ఇస్తారు. ఇది కేవలం అక్కడి రక్షణ వ్యవస్థ, సరిహద్దు కాపలాలో ఉన్న సున్నితమైన అంశాల దృష్ట్యానే.
మేము నేర్చుకున్న విషయాలు, అంశాలు:
దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే శుభ్రతకు పెద్ద పీట వేయడం మేము తిరిగిన మూడు రాష్ట్రాలలో స్పష్టంగా కనిపించింది. (ఐతే గుట్కాలు తిని ఉమ్మడం మాత్రం వారు మానలేదు.)
ఇది ఇలా ఉంటే, అక్కడి వారు తమ సంస్కృతీ సంప్రదాయాలను, భాషను కాపాడుకునే తీరు, 28 రకాల జాతులు, అడుగు అడుగుకు మారుతున్న ఆ హిమనగముల నివాసితుల భాష, వేషధారణ మనలను అబ్బురపరుస్తాయి. ఈశాన్య రాష్ట్రాల పర్యటన నా జీవితంలో ఒక మరుపురాని మజిలీ.
ఫైనల్:
చివరిలో ఒక గొప్ప విషయం చెబుతానని అన్నాను. అది మేము ఎంచుకున్న ట్రావెల్ ఏజెన్సీ గౌహతి కేంద్రంగా వుండే అంతర్జాతీయ జైన్ అంటే జ్ ట్రావెల్స్. ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఆ సంస్థ యజమాని శ్రీ సౌరభ్ జైన్, ఆయన వద్ద పనిచేసే సిబ్బంది ఎంతో జాగ్రత్తగా మా ప్రయాణాన్ని ప్లాన్ చేసారు. ప్రతి రోజు ఫోన్ చేసి వారు చేసిన ఏర్పాట్లు, శాకాహార భోజనం గురించి, ఆరోగ్యం గురించి అర్ధరాత్రి అయినా వాకబు చేయడం చాలా తృప్తినిచ్చింది.