గాలి నవ్వే తావులు...
x

గాలి నవ్వే తావులు...

నేటి మేటి కవిత


మైసూరు మహానగరంలో

గాలి నవ్వే తావులు ఉన్నాయని తెలిసి వెతుక్కుంటూ వెళ్లాను.

మొక్కలు, పక్షులూ ఉంటేనే
గాలి నవ్వుతుందని తెలిసింది
*
ఈ భూమ్మీద అత్యంత విలువైనది
ప్రాణవాయువే అని
పేరు తెలియని మొక్కలు పక్షులు నవ్వుతూ చెప్పాయి.
*
పరిపూర్ణ మౌనంలోనే
చెట్ల మాటలు, పక్షుల పాటలు
గాలి నవ్వులు.
*
ఆకాశం కింద,మొక్కల మధ్య
పక్షులతో కలసి
నీతో నీవు నిశ్శబ్దంగా
నడవటం ధ్యానమే!.
*
ఇన్నేండ్లూ -
ఇందరి మనుషుల పేర్లు తెలుసనుకున్నాను -కానీ ,
కనీసం నాలుగు మొక్కల పేర్లు, నాలుగు పక్షుల పేర్లయినా
తెలుసుకోనందుకు సిగ్గుపడుతున్నాను.
*
ఏ ఊర్లో అయినా
మొక్కల మాటలు ,
గాలి నవ్వులు
పక్షుల పాటల‌ కోసమే
ఉదయాలు,
సాయంత్రాలు,
రాత్రులు.

(కారంజి ప్రకృతి ఉద్యానవనం, మైసూరులో ఉంటుంది)

- పలమనేరు బాలాజి

Read More
Next Story