
పీట్ హెగ్సెత్
ఇరాన్ తో యుద్ధంలో 37 బిలియన్ డాలర్లు ఖర్చు
సెనెట్ కమిటీ ముందు తెలిపిన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్
ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా 37. 5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ పేర్కొన్నారు. మరో 95 బిలియన్ డాలర్ల మేర అంచనాలు ఉన్నాయని చెప్పారు. మంగళవారం సెనెట్ అప్రోప్రియేషన్స్ కమిటీ విచారణ సందర్భంగా హెగ్సెత్ వివరించారు.
రెండో విడత యుద్ధం ప్రారంభమైన తరువాత ఇప్పటి వరకూ ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించారని, మొత్తంగా మృతుల సంఖ్య 17 చేరుకుందని చెప్పారు. యుద్ధం ఆరంభం నుంచి దాదాపు వందమంది గాయపడినట్లు తెలిపారు. ఈ విచారణ సందర్భంగా తీవ్రవాదోపవాదాలు, గందరగోళం నెలకొంది. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు మద్దతుదారులు నినాదాలతో హోరెత్తించారు. దీనితో చాలాసేపు విచారణకు అంతరాయం కలిగింది.
యుద్ధానికి అదనపు నిధులు పెంపుపై కూడా హెగ్సెత్ వివరణ ఇచ్చారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 1.5 ట్రిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్ భవిష్యత్ లో అమెరికా సైన్యానికి ఒక పెట్టుబడిలాంటిదని కమిటీ ముందు తెలిపారు.
ఈ నిధులు లేకపోతే అమెరికా సైన్యం తీవ్రమైన కొరతను ఎదుర్కొంటుందని చెప్పారు. ఈ యుద్ధం గురించి ప్యానెల్ లోని అగ్రశ్రేణీ డెమోక్రాట్ అయిన సెన్ ప్యాటీ మాట్లాడుతూ.. మరో శాశ్వత యుద్ధంలో అమెరికా ఇరుక్కుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
యుద్ధం పూర్తిగా అదుపు తప్పినట్లు కనిపిస్తోందని అన్నారు. అధ్యక్షుడు అనేకసార్లు ఒప్పందానికి వచ్చినట్లు పేర్కొన్నారని కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లు చెప్పారు. ఇవే కాకుండా అదనంగా మరో 70 బిలియన్ డాలర్లు కావాలని అడుగుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
Next Story

