
ఫ్రాన్స్ లో రోడ్లెక్కిన నాలుగు లక్షల మంది నిరసనకారులు
యూరప్ మొత్తం పాకిన ఆందోళనలు..
విద్య, జీవన వ్యయాలు, పింఛన్లు, భారీగా పెరిగిన ఇంటి అద్దెలు వంటి పలు సమస్యలపై యూరప్ లో ప్రారంభమైన భారీ నిరసనలు రోజు రోజుకి ఉధృతం అవుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్ వ్యాప్తంగా జరిగిన నిరసనల్లో దాదాపు నాలుగు లక్షల మంది నిరసనకారులు పాల్గొన్నారు. పలు ర్యాలీలు శాంతియుతంగా జరిగినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం పోలీసులతో వారు ఘర్షణకు దిగారు.
ఈ నిరసనలు ఫ్రాన్స్ తో పాటు అల్భేనియా, ఇటలీ, బెల్జియం, పోర్చుగల్, గ్రీస్ దేశాలకు కూడా పాకాయి. ముఖ్యంగా ఐరోపాలో ఫ్యాషన్ రాజధానిగా పేరుగాంచిన ప్యారిస్ ను తగలబెట్టేస్తోంది. పాఠశాలలకు నిధులు కేటాయించాలని, పెరిగిన జీవన వ్యయాల నుంచి రక్షణ కల్పించాలని కోరతూ చేస్తున్న ఉద్యమానికి భారీ స్థాయిలో ప్రజా మద్దతు లభించింది. దాదాపు నాలుగు లక్షల మంది నిరసనకారులు ఇందులో పాల్గొన్నారు.
అధికారుల అంచనా ప్రకారం.. దేశవ్యాప్తంగా 4,10,000 వేల మంది పాల్గొన్నారు. ప్యారిస్ లో లక్షా పదివేల మంది హాజరయ్యారు. రాజధానిలో శాంతియుతంగా ప్రారంభమైనప్పటికీ దాని ముగింపు స్థలమైన ‘పోర్ట్ డీ విన్సెన్స్’ లో హింసాత్మకంగా మారింది.
నిరసనకారులు రాళ్లు విసరగా, పోలీసులు బాష్పవాయువు, నీటి ఫిరంగులు ప్రయోగించారు. లియోన్, స్ట్రాస్ బర్గ్, క్లెర్మాంట్, ఫెర్రాండ్, మార్సెయిల్స్, నైస్, నాంటేస్ లలో కూడా ఇలాంటివి జరిగినట్లు నివేదికలు వచ్చాయి. దీనికి సంబంధించి 64 మంది అరెస్ట్ అయ్యారు. దీనిలో ఆరుగురు మైనర్లు ఉన్నారు.
మాక్రాన్ కు సవాల్...
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న మాక్రాన్ కు తన పరిపాలన చివరి రోజుల్లో విపరీతమైన వ్యతిరేకతలను ఎదుర్కొంటున్నాడు. వేలాది వ్యాపారాలు ఈ సందర్భంగా మూసివేసుకోవాల్సి వచ్చింది. అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునేజ్ దేశవ్యాప్తంగా 70 వేల మంది పోలీసులను మోహరించారు. వారికి మద్దతుగా హెలికాప్టర్లు, సాయుధ వాహనాలు, నీటి ఫిరంగులు మద్దతులు నిలిచాయి.
విద్యార్థులు విశ్వవిద్యాలయ సీట్లు, పార్కోర్సప్ ప్రవేశాల వ్యవస్థలో సమూల మార్పులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో అధిక పెట్టుబడులు, పెరిగిన ఆర్థిక సహాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఇంధన ధరల ఒత్తిడి పెరుగుతోందని కూడా నిరసనకారులు పేర్కొన్నారు.
ఆర్థిక డిమాండ్లు...
విద్యార్థి బృందాలు, సంఘటిత కార్మిక వర్గం మధ్య పొత్తు అనేది ఫ్రెంచ్ ఉద్యమం ఒక ముఖ్య లక్షణం.. కార్మిక సంఘాలు శనివారం నాటి పారిస్ మార్చ్ కు నాయకత్వం వహించగా, వారి వెనక బ్యానర్లు చేతితో తయారు చేసిన ప్లకార్డులను విద్యార్థులు నడిచారు.
గతంలో జరిగిన హింసాకాండ వలన ఉద్యమ డిమాండ్లు పక్కన పడకూడదని చాలామంది నిరసనకారులు అన్నారు. విద్య సంబంధిత సమస్యలను ప్రభుత్వం తగినంతగా పరిష్కరించలేదని వాదిస్తూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి కవాత్ చేస్తారు.
విద్యార్థి ప్రతినిధులు శుక్రవారం మాక్రాన్ ను కలుసుకుని విశ్వవిద్యాలయ ప్రవేశాలలో సంస్కరణలు చేస్తామని హమీ ఇచ్చారు. అయితే అవి అమలు అయ్యే వరకూ నిరసనలు కొనసాగుతాయని ఆందోళనకారులు ప్రకటించారు.
ఇది రాజకీయ ఉద్రిక్తతలను కూడా తీవ్రతరం చేసింది. మాక్రాన్ ప్రత్యర్థులు, ముఖ్యంగా రైట్ వింగ్ నేషనల్ ర్యాలీ, ప్రజల అసంతృప్తిని ఎన్నికల మద్దతుగా మలుచుకోవాలని చూశారు. అదే సమయంలో కొన్ని నగరాల్లో ప్రదర్శనలపై విధించిన ఆంక్షలను కార్మిక సంఘాలు విమర్శించాయి.
భద్రతను కట్టుదిట్టం చేసిన ఇటలీ...
ఫ్రాన్స్ నిరసనలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ దేశం స్ఫూర్తితోనే మిగిలిన యూరోప్ దేశాలకు కూడా పాకింది. ఇటలీలో వేలాది మంది నిరసనకారులు ఆందోళన చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు మిలన్, రోమ్, టూరీన్ నగరాలలో కవాతు నిర్వహించారు. ఎక్కడికక్కడ పతిష్టమైన చర్యలు తీసుకున్నారు. దుకాణాలు లూటీ కాకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.
రోమ్ లో ఉద్రిక్తతలు చాలాస్పష్టంగా కనిపించాయి. ఒక చిన్న బృందం కొలోస్సియంలోకి ప్రవేశించడానికి కొద్దిసేపు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యంగా మైనర్లను అడ్డుపెట్టి దాడులకు ప్రణాళికలు రచిస్తున్న వారికి మెలోని ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఏదైన ఆస్తులు ధ్వంసం చేస్తే వారి తల్లిదండ్రుల నుంచి నష్టాన్ని వసూలు చేస్తామని ప్రకటించారు.
అవినీతి, పింఛన్లు.. ఇంటి అద్దెలు..
అల్భేనియా రాజధాని టిరానాలో, నిరసనకారులు ప్రభుత్వ భవనాలకు నిప్పుపెట్టి, పోలీసులపైకి రాళ్లు విసరడంతో ఘర్షణలు చెలరేగాయి. అల్లర్ల నివారణ అధికారులు నీటి ఫిరంగులతో ప్రతిస్పందించారు. నగరం అంతటా పోలీసులను మోహరించారు.
తక్కువ ట్యూషన్ ఫీజులు, విద్యపై అధిక పెట్టుబడులు పెట్టాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాలు, ప్రధానమంత్రి ఎడీ రామా రాజీనామా కోరుతూ జరుగుతున్న విస్తృత ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంతో క్రమంగా చేతులు కలుపుతున్నాయి.
స్పెయిన్ , పోర్చుగల్ లలో ప్రదర్శనలు చాలావరకూ శాంతియుతంగానే కొనసాగాయి. భవిష్యత్ లో చేపట్టబోయే సంస్కరణలపై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వ పింఛన్లను పరిరక్షించుకోవడానికి వేలాది మంది మాడ్రిడ్ వరకూ కవాతు చేశారు. పింఛన్ల వ్యవస్థలను ప్రయివేటీకరణ తెరవకూడదని లేదా మార్కెట్ ఆధారిత మార్పుల ద్వారా వాటిని బలహీనపరచకూడదని నిరసనకారులు వాదించారు.
ఐరోపా దేశాల...
లిస్భన్ లో పెరుగుతున్న గృహ ఖర్చులకు అద్దెదారుల కంటే ఇంటి యజమానులకే అనుకూలంగా ఉన్నాయని వారు చెబుతున్న ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నివాసితులు నిరసనప్రదర్శనలు చేశారు. అద్దె పెంపుపై ఆంక్షలను సడలించడం, ఖాళీ చేయించే ప్రక్రియలను సరళీకరించడం వంటి ప్రతిపాదనలను నిరసనకారులు విమర్శించారు.
మొత్తం ఐరోపా మొత్తం ఇలాంటి పరిస్థితులనే చవిచూస్తోంది. వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావంతో అక్కడ హీట్ వేవ్ తో వేలాది మంది ప్రజలు మరణిస్తున్నారు. విపరీతమైన అద్దెలు, భారీగా వస్తున్న టూరిస్టులతో అక్కడ నివసించే స్థానికులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.
Next Story

