‘‘దౌత్యవేత్తల కుటుంబాలు తక్షణమే బంగ్లా వీడండి’’
x

‘‘దౌత్యవేత్తల కుటుంబాలు తక్షణమే బంగ్లా వీడండి’’

భద్రతకారణాల రీత్యా ఆ దేశం వీడాలని భారత్ సూచన


పొరుగు దేశం బంగ్లాదేశ్ లో రోజురోజుకీ పరిస్థితి దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేసిన న్యూఢిల్లీ, తన దౌత్యవేత్తలకు ‘‘కుటుంబం లేని పోస్టింగ్’’(నో ఫ్యామిలి పోస్టింగ్) గా ఢాకాను ప్రకటించింది.

దేశంలో ఉన్న అన్ని భారతీయ అధికారుల కుటుంబాలు తక్షణమే భారత్ కు రావాలని ఆదేశించింది. పెరుగుతున్న భద్రతా సమస్యలు, రెండు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

మీడియా నివేదికల ప్రకారం.. ఉగ్రవాద శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ చర్య తీసుకున్నప్పటికీ ఢాకాలోని భారత హైకమిషన్ తో పాటు ఛటోగ్రామ్, ఖుల్నా, రాజ్ షాహీ, సిల్హెట్ లోని నాలుగు అసిస్టెంట్ హైకమిషన్లు సాధారణంగా పనిచేస్తూనే ఉన్నాయి.
‘‘ముందు జాగ్రత్త చర్యగా, హైకమిషన్ లోని అధికారులపై ఆధారపడినవారు, నలుగురు అసిస్టెంట్ హైకమిషన్ లు భారత్ కు రావాలని మేము సూచనలు జారీ చేశాం’’ అని భారత విదేశాంగ ఆదేశాలు జారీచేసినట్లు జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.
నో ఫ్యామిలీ పోస్టింగ్..
కుటుంబేతర పోస్టింగ్ అంటే దౌత్యపరమైన నియామకం, దీనిలో అధికారులు జీవిత భాగస్వాములు, పిల్లలతో సహ వారి కుటుంబ సభ్యులతో పాటు పోస్టింగ్ వ్యవధి వరకూ ఉండటానికి అనుమతి లేదు.
ఇటువంటి హోదాలు సాధారణంగా భద్రతా ప్రమాదాలు రాజకీయ అస్థిరత లేదా సంఘర్షణ ఎదుర్కొంటున్న ప్రాంతాలలో చేస్తారు. ఉదాహారణకు పాకిస్తాన్ కు భారత పోస్టింగ్ లను పిల్లలు లేని అసైన్ మెంట్ లు వర్గీకరిస్తారు. దౌత్యవేత్తలతో పాటు పిల్లలు కాకుండా జీవిత భాగస్వాములు కూడా ఉండవచ్చు.
ఈ చర్య దేనికి సంకేతం..
షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన తరువాత 2024 లో ఢాకాలో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి భారత్- బంగ్లా సంబంధాలు క్రమంగా బలహీనమవుతున్నాయి.
తాత్కాలిక ప్రభుత్వానికి మహ్మద్ యూనస్ సారథ్యం వహిస్తున్నారు. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్ షేక్ హసీనాకు మరణశిక్ష విధించినప్పటి నుంచి సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ఆమె ప్రస్తుతం న్యూఢిల్లీ సమీపంలో ఉన్నారు. సమీపకాలంలో బంగ్లాదేశ్ కు వెళ్లే పరిస్థితి లేదు.
బంగ్లాదేశ్ లో మతపరమైన ఉద్రిక్తతలు పెరగడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. మతపరమైన మైనారిటీలపై దాడులపై న్యూఢిల్లీ పదేపదే ఆందోళనలు వ్యక్తం చేస్తూ, ఢాకా ఈ సమస్యను తగినంతగా పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించింది.
మైనారిటీ భద్రతలపై ఆందోళన..
మైనారిటీలపై ముఖ్యంగా హిందువులపై హింస పెరుగుతున్నట్లు భావించి, బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని భారత్ విమర్శించింది. దైవదూష ఆరోపణలపై భాలుకాలో దీపుదాస్ అనే హిందువుని దారుణంగా కొట్టి చంపేశారు.
తరువాత ఇస్లామిక్ యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య ఈ ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇవే భారతే చేయించిందని బంగ్లా ఆరోపించింది. అయితే వీటిని న్యూఢిల్లీ తోసిపుచ్చింది.
వీటికితోడు బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ నుంచి 2026 ఐపీఎల్ నుంచి విడుదల చేయడంతో బీసీబీ కూడా భారత్ లో నిర్వహించే టీ20 వరల్డ్ కప్ కు ఆడబోమని ప్రకటించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి బీసీబీ తో ఐసీసీ చర్చలు జరుపుతోంది.
Read More
Next Story