భారత్ నాపై ఆధారపడవచ్చు: ట్రంప్
x

భారత్ నాపై ఆధారపడవచ్చు: ట్రంప్

ప్రధాని మోదీ నాకు గొప్ప స్నేహితుడు అన్న అమెరికా అధ్యక్షుడు


Click the Play button to hear this message in audio format

భారత్ ఇప్పటికి నన్ను నమ్మవచ్చని, నాపై ఆధారపడవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడారు. మోదీ గొప్ప స్నేహితుడని పేర్కొన్నారు. భారత్ మండపంలో జరిగిన కార్యక్రమానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, అమెరికా రాయబారీ సెర్గియో గోర్ హజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ఏఆర్ రెహమాన్ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘‘నేను అందరికీ నమస్కారం చెప్పాలనుకుంటున్నాను. నాకు ప్రధాని అంటే ఇష్టం. ఆయన గొప్పవారు, నా స్నేహితుడు, అందరికి శుభ సాయంకాలం’’ అని గోర్ తో ఫోన్ సంభాషణలో ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను ప్రేక్షకులు వినడానికి వీలుగా అమెరికా రాయబారీ తన ఫోన్ ను మైక్రోఫోన్ కు పట్టుకున్నారు.

‘‘మేము బాగా రాణిస్తున్నాము. రికార్డులు సృష్టిస్తున్నాము. మా ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ స్థాయిలో ఉన్నాయి’’ అని ఆయన అన్నారు. తన వ్యాఖ్యలలో ట్రంప్, రూబియోను అమెరికా చరిత్రలోనే అత్యంత గొప్ప విదేశాంగ కార్యదర్శిగా అభివర్ణించారు. ప్రధానికి నమస్కరించండి.. నేను ఆయనకు పెద్ద అభిమానినని తెలియజేయండని ట్రంప్ ముగించారు.

తన సంక్షిప్త ప్రసంగంలో రూబియో, భారత్ ను అమెరికాకు కీలక భాగస్వామిగా అభివర్ణించారు. అమెరికా స్వాతంత్ర్య ఉద్యమ అనుభవాలను భారత రాజ్యాంగ నిర్మాతలు పరిగణలోకి తీసుకున్నారని, లోతైన, ఆర్థిక, సాంకేతిక సంబంధాలలతో ఇరుపక్షాల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని జైశంకర్ అన్నారు.

రాజకీయ ప్రజాస్వామ్యాలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు, స్వేచ్ఛా సమాజాలు అనే ఉమ్మడి లక్షణాలు జాతీయ ప్రయోజనాల సమన్వయంతో మరింత బలపడ్డాయని, దీనివల్ల ఇరుపక్షాలు చారిత్రక సంకోచాలను అధిగమించాయని విదేశాంగ మంత్రి అన్నారు. అమెరికాలోని భారతీయ ప్రవాసులు ఇరు దేశాల మధ్య రాజకీయ అవగాహానను పెంపొందించడంలో సహాయపడ్డారని ఆయన పేర్కొన్నారు. ఇదే వేదికలో మార్కో రూబియో పుట్టిన రోజు వేడుకుల కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెహమాన్ కచేరీ అందరిని ఆకట్టుకుంది. ‘‘దిల్ సే, మా తుఝే సలామ్, తేరే బినా’’ వంటి హిట్ పాటలు పాడారు.

Read More
Next Story