భారత్- రష్యా సంబంధాలు మరింత బలీయం
x

భారత్- రష్యా సంబంధాలు మరింత బలీయం

వంద బిలియన్ డాలర్ల వాణిజ్యమే లక్ష్యంగా ప్రణాళికలు


Click the Play button to hear this message in audio format

భారత్- రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వంద బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ ప్రభుత్వాలను ఆదేశించారని రాయబారీ వినయ్ కుమార్ తెలిపారు.

శనివారం రష్యన్ వార్తా సంస్థ టాస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెప్టెంబర్ 12- 13 తేదీలలో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక సంబంధాల పూర్తి స్థాయి అంశాలపై చర్చించారని భారత రాయబారీ కుమార్ తెలిపారు.
‘‘ఈ సహకారం వల్ల కలిగిన స్పష్టమైన ఫలితాలలో ఒకటి, బ్రిక్స్ వ్యాపార సదస్సులో మన దేశాల నాయకులు సంయుక్తంగా పాల్గొనడం, అలాగే న్యూఢిల్లీలో జరిగిన మొదటి రష్యన్ పారిశ్రామిక ప్రదర్శన అయిన ఇన్నోప్రొమ్ - ఇండియా ఎగ్జిబిషన్ ను సందర్శించడం’’ అని భారత రాయబారీ టాస్ కు తెలిపారు.
వ్యాపార వాణిజ్యాలతో సహ పలు రంగాల్లో సహకారాన్ని మరింతగా అభివృద్ది చేయాలని నాయకులు సంబంధిత మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలను ఆదేశించారని ఆయన అన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వంద బిలియన్ డాలర్లకు ఇరు దేశాల మధ్య పెట్టుబడులను 50 బిలియన్ డాలర్లకు పెంచే దిశగా భారత్, రష్యాలు కృషి కొనసాగిస్తున్నాయని కుమార్ తెలిపారు.
కార్మిక సహకారంపై కుమార్ మాట్లాడుతూ.. రష్యా అవసరాలకు అనుగుణంగా అవసరమైన సంఖ్యలో నైపుణ్యం కలిగిన కార్మికులను సరఫరా చేయడమే భారత్ లక్ష్యమని అన్నారు.
రష్యా విదేశీ కార్మికుల కోటాలో భారతీయులు సుమారు 25 నుంచి 30 శాతం వరకూ ఉన్నారని ఆయన అన్నారు. దాదాపు 150 కోట్ల జనాభా కలిగిన భారత్ నైపుణ్యం కలిగిన సిబ్బందికి ప్రపంచ కేంద్రంగా మారనుందని కుమార్ పేర్కొన్నారు.
భారత్ కార్మిక శక్తి సగటు వయస్సు 29 సంవత్సరాలు కాగా, జనాభాలో కార్మికులు సుమారు 69 శాతం ఉన్నారని ఆయన అన్నారు. భారత్ తన దేశీయ మార్కెట్ తో పాటు విదేశాలలో ఉపాధి కోసం నిఫుణులకు శిక్షణ ఇస్తుందని కుమార్ అన్నారు. రష్యా పరిశ్రమలకు అవసరమైన కార్మికులకు శిక్షణ ఇచ్చేందుకు భారత్ లో విద్యా సంస్థలను స్థాపించాలని లేదా ఇప్పటికే ఉన్న భారతీయ సంస్థలతో సహకరించాలని న్యూఢిల్లీ రష్యాకు ప్రతిపాదించిందని ఆయన అన్నారు.
Read More
Next Story