మళ్లీ హార్ముజ్ జలసంధి బంద్
x

మళ్లీ హార్ముజ్ జలసంధి బంద్

యురేనియాన్ని అప్పగించేది లేదు. ఆ యురేనియం అంటే మా పవిత్ర భూమితో సమానం అంటున్న ఇరాన్


Click the Play button to hear this message in audio format

పశ్చిమాసియాలో మరోసారి సంక్షోభం తలెత్తింది. ప్రపంచ ముడి చమురుకు కీలకమైన చోక్ పాయింట్ గా ఉన్న హార్ముజ్ ను ఇరాన్ తిరిగి మూసివేసింది. హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా విధించిన ఆంక్షలు, నౌకా దిగ్భంధనం అమలులో ఉంటుందని ట్రంప్ ప్రకటించిన కాసేపటి ఇరాన్ చర్యలు తీసుకుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉండటంతో, ముఖ్యంగా దేశంలో దాచిపెట్టిన ఎన్ రిచ్డ్ యురేనియం(Enriched Uranium)అని అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ చేసిన ప్రకటనతో చర్రెత్తిపోయిన ఇరాన్ జలసంధిని మూసేసింది.

ట్రంప్ కొన్ని డిమాండ్లను ఇరాన్ కు పంపారని, వాటన్నింటికి ఇరాన్ ఆమోదం తెలిపిందని, అందులో యురేనియాన్ని అమెరికాకు అప్పగించడం ఒకటని ట్రంప్ కోతలు కోసినట్లు మీడియా కథనం. దీనితో ఇరాన్ అగ్రహించి, జలసంధిని మూసేయాలని నిర్ణయించింది.

దీని మీద ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాగే(Esmaeil Baghaei) ఒక ప్రకటన చేశారు. ‘ఇరాన్ యురేనియం స్టాక్ పైల్ ను వదలుకునే ప్రసక్తే లేదు. ఆ యురేనియం అంటే ఇరాన్ పవిత్రభూమితో సమానం,’ అని బాగే పేర్కొన్నారు.

హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ దళాలు తిరిగి కాల్పులు ప్రారంభించాయి. ఐఆర్జీసీకి చెందిన రెండు గన్ బోట్లను ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ట్యాంకర్ ను సమీపించి కాల్పులు జరిపినట్లు సదరు నౌక కెప్టెన్ వెల్లడించారు.
ఈ రోజు ఉదయం ఇరాన్ తన ఆధీనంలో ఉన్న హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనపై ట్రంప్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఎప్పటిలాగే ఇరాన్ పై ఆంక్షలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. రెండో దఫా చర్చలు కూడా పాక్ కేంద్రంగా కొనసాగిస్తామని చెప్పారు.
ఈ ప్రకటనపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సార్వభౌమత్వం వదులుకునే విషయంలో అమెరికా చేస్తున్న ప్రకటన ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. వెంటనే హార్ముజ్ ను మూసివేస్తున్నట్లు వెల్లడించింది.

పుండు మీద కారంలా ఆంక్షలు..

పశ్చిమాసియాలో ఇరాన్ మద్దతు ఉన్న షియా మిలీషియా అమెరికాపై దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారనే ఆరోపణలపై వాషింగ్టన్ ఆంక్షలు విధించింది. ఇరాన్ పై సైనిక శక్తినే కాకుండా తిరిగి ఆర్థిక ఆంక్షలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు కూడా యూఎస్ తెలిపింది. ‘‘ఇరాన్ మద్దతు ఉన్న ఇరాక్ ఉగ్రవాద మిలీషియాలు, అమెరికన్ల ప్రాణాలకు లేదా ప్రయోజనాలకు ముప్పు కలిగించడాన్ని మేము అనుమతించము’’ అని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ చెప్పారు.
ప్రపంచ ముడి చమురు అవసరాలలో దాదాపు 20 శాతం వరకూ హార్ముజ్ గుండానే వెళ్తుంది. ఇది ఇరాన్ ఆధీనంలో ఉండటంతో దీన్ని అమెరికాపై ఒత్తిడి తీసుకురావడానికి ఒక అస్త్రంగా వాడుకుంటోంది. హార్ముజ్ సంక్షోభంలో చిక్కుకోవడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 60 డాలర్ల నుంచి 110 డాలర్లకు చేరుకుంది.
అయితే ఈ రోజు తిరిగి హార్ముజ్ ను తిరిగి తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో ముడి చమురు ధరలు దాదాపు 11 శాతం పతనం అయ్యాయి. అయితే ఈ ఆనందం ఎక్కువ సేపు ప్రపంచానికి దక్కలేదు. ఇరాన్ ధిక్కారం, అమెరికా తొండి వాదనతో ప్రపంచాన్ని మరోసారి చిక్కుల్లో పడేసింది.
Read More
Next Story