‘‘చైనాపై అతిగా ఆధారపడటం మంచిది కాదు’’
x

‘‘చైనాపై అతిగా ఆధారపడటం మంచిది కాదు’’

గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ హెచ్చరిక, సరఫరా గొలుసులు వైవిధ్య పరచాలని భారత్ కు సూచన


Click the Play button to hear this message in audio format

దేశ దిగుమతులలో చైనా వాటా 16 శాతంగా ఉందని, కానీ కొన్ని రంగాలలో చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువుల వాటా 30 శాతం దాటిందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) పేర్కొంది.

పారిశ్రామిక వస్తువుల విషయంలో దేశ అవసరాలలో సుమారు 30.8 శాతాన్ని చైనా సరఫరాదారులు తీరుస్తున్నారు. 2025-26లో దేశ దిగుమతులు 774.98 బిలియన్ డాలర్లకు చేరగా, అందులో 131.63 బిలియన్ డాలర్ల దిగుమతులు చైనా నుంచి మాత్రమే వచ్చాయి. ఇది అసమానంగా ఉందని, దేశీయ ఉత్పత్తి రంగాల పనితీరు తనాన్ని తక్కువగా ఉందనే విషయాన్ని ఇది సూచిస్తుందని పేర్కొంది.
చైనా నుంచి ఎక్కువగా ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, స్వచ్ఛ ఇంధనం వంటి రంగాలు ముడిసరుకుల స్థిరమైన సరఫరాపై ఆధారపడి ఉన్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లేదా వాణిజ్య మార్పుల వల్ల సరఫరాలకు అంతరాయం కలిగితే, ఈ రంగాలు నష్టపోయే ప్రమాదం ఉంది.

కీలక రంగాలలో పరిస్థితి ఎలా ఉందంటే..

GTRI ప్రకారం, చైనా నుంచి భారత చేసుకునే 82.6 బిలియన్ డాలర్ల దిగుమతులలో సుమారు 66 శాతం ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, కంప్యూటర్లు, సేంద్రీయ రసాయనాల రంగాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విభాగాలలో చైనా వాటా గణనీయంగా ఎక్కువగా ఉంది. భారతదేశ ఎలక్ట్రానిక్స్ దిగుమతులలో 43 శాతం, యంత్రాలు, కంప్యూటర్ల దిగుమతులలో 40 శాతం, సేంద్రీయ రసాయనాలలో 44 శాతం వాటా ఆక్రమించాయి.
"ఇవి ఐచ్ఛిక కొనుగోళ్లు కావు, భారతదేశ తయారీ పర్యావరణ వ్యవస్థకు నేరుగా చేరే కీలకమైన ముడిసరుకులు" అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అన్నారు.

సరఫరా గొలుసు అవాంతరాలు...

ఎలక్ట్రానిక్స్ భాగాలు, ఈవీ బ్యాటరీలు, సోలార్ మాడ్యూల్స్, ఏపీఐలు, ప్రత్యేక రసాయనాల వంటి చైనా ముడిసరుకులపై భారత పరిశ్రమ ఎక్కువగా ఆధారపడి ఉందని ఆయన అన్నారు. "ఫలితంగా, భారత్ ఎగుమతులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, దాని సరఫరా గొలుసులు చైనాతో ముడిపడి ఉన్నాయి. ఇది స్పష్టమైన ప్రమాదాలను సృష్టిస్తుంది" అని ఆయన అన్నారు. కీలక రంగాలలో దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని, సరఫరా గొలుసులను వైవిధ్యపరచాలని జీటీఆర్ఐ సూచించింది.

వైవిధ్యీకరణ వ్యూహం కోసం..

"కీలక రంగాలలో దిగుమతుల కోసం ఏ ఒక్కదేశంపై అయిన కూడా 30 శాతం లోపే పరిమితం చేయడం ఉత్తమం, అదే ఆచరణాత్మకత అవుతుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో చైనాకు మనం చేసే ఎగుమతులు 2021 ఆర్థిక సంవత్సరం నుంచి కేవలం 19.5 బిలియన్ డాలర్ల వద్దే ఉంటున్నాయి. కానీ దిగుమతులు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి 131.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో 2025-26 నాటికి లోటు 112.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
Read More
Next Story