
పాకిస్తాన్: జాఫర్ ఎక్స్ ప్రెస్ పై మరోసారి దాడికి ప్రయత్నం
పట్టాలపై ఐఈడీ అమర్చిన తిరుగుబాటుదారులు, గుర్తించి నిర్వీర్యం చేసిన పాక్ సైన్యం
పాకిస్తాన్ మొత్తాన్ని దాదాపు చుట్టి వచ్చే ప్యాసింజర్ రైలు అయిన జాఫర్ ఎక్స్ ప్రెస్ పై మరోసారి దాడికి ప్రయత్నం జరిగింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని నసీరాబాద్ ప్రాంతంలో షెషావర్ వెళ్తున్న రైలు పట్టాలపై ఐఈడీ అమర్చినట్లు పాకిస్తాన్ టీవీ ఛానల్లు వార్తలు ప్రసారం చేశాయి.
రైలు మార్గంలో గుర్తు తెలియని వస్తువులు ఉన్నాయనే సమాచారం మేరకు ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టిన భద్రతా దళాలు సంబంధిత బాంబును నిర్వీర్యం చేసినట్లు తెలిసింది.
దాదాపు నెల రోజుల క్రితం ఇదే ప్రాంతంలో రైలుపై ఆత్మాహుతి దాడికి ప్రయత్నం జరిగింది. అప్పడు రైలు సురక్షితంగా ఈ గండం నుంచి బయటపడింది. కొన్ని నెలల ముందు బలూచ్ తిరుగుబాటుదారులు రైలును హైజాక్ చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
దాదాపు రెండోందల మంది పాక్ సైనికులను తమ ఆధీనంలోకి తీసుకుని వారిని హతమార్చింది. అయితే యధావిధిగా పాక్ మాత్రం ఎలాంటి సైనికులు బందీలుగా చిక్కలేదని, ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించింది.


