
వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరింది: ట్రంప్
భారత్ తో అన్ని అంశాలను చర్చించామని ప్రకటన
అమెరికా, భారత్ మధ్య ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చోవడానికి చాలా దగ్గరగా ఉన్నాయని ఇవి గత వాటికంటే భిన్నంగా ఉండబోతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మంగళవారం ఆయన ఓవల్ ఆఫీస్ లో విలేకరులతో మాట్లాడారు. భారత్, యూఎస్ వాణిజ్య ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయని ట్రంప్ అన్నారు.
‘‘వారు ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు. మనం ఒక ఒప్పందం చేసుకోబోతున్నాం. దాదాపుగా కుదిరినట్లే, అవును’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ అన్నారు. ‘‘ఇది మనం ఇంతకుముందు చేసుకున్న ఒప్పందాల కన్నా భిన్నమైనదిగా ఉండబోతోంది’’ అని అధ్యక్షుడు అన్నారు.
విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్ పర్యటనలో ఉన్నారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, రక్షణ, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాలపై దృష్టి సారించి ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించిన సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల ప్రారంభంలో వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ వాణిజ్య ఒప్పందంలోని సూక్ష్మ అంశాలపై చర్చించడానికి మిలాక్వీ, వాషింగ్టన్ లలో యూఎస్ వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ ను కలిశారు. భారత్, యూఎస్ దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశకు సంబంధించిన ముసాయిదాను ఖరారు చేసినట్లు ఫిబ్రవరిలో ప్రకటించాయి. అయితే అమెరికాలో సుంకాల విధానంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ ఒప్పందం పై మరిన్ని చర్చలు జరగాల్సి వచ్చింది.
Next Story

