ఇరాన్ పై రెండో విడత వైమానిక దాడులు చేసిన యూఎస్
x

ఇరాన్ పై రెండో విడత వైమానిక దాడులు చేసిన యూఎస్

ప్రతిగా కువైట్, జోర్డాన్, బహ్రెయిన్ పై ఇరాన్ క్షిపణి దాడులు


Click the Play button to hear this message in audio format

పశ్చిమాసియా కల్లోలం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా ఇరాన్ పై అమెరికా రెండో విడత దాడులు ప్రారంభించింది. రాజధాని టెహ్రాన్ తో సహ పోర్ట్ నగరమైన బందర్ అబ్బాస్, ఇరాన్ దక్షిణ ప్రాంతాలపై వైమానిక, క్షిపణి దాడులతో విరుచుకుపడింది.

దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ శపథం చేసింది. ఇప్పటికే హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోని ఏ నౌకకు అక్కడి నుంచి వెళ్లడానికి అనుమతి లేదని వెల్లడించింది. తమ అనుమతి లేకుండా వెళ్తే దాడులు తప్పవని హెచ్చరించింది.

అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు సజావుగా జరుగుతున్నాయని అంతా అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా యూఎస్ అపాచీ హెలికాప్టర్ కూలిపోవడం దానికి ఇరానే కారణం అని తేలడంతో మరోమారు రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణలు ప్రారంభం అయ్యాయి. అమెరికాకు ఒప్పందం కావాలంటే బెదిరించే ధోరణి ఆపాలని ఐరాసలో ఇరాన్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటికి తమ దగ్గర చాలా గట్టి సమాధానం ఉందని హెచ్చరించారు.

హర్ముజ్ జలసంధి దిగ్బంధం వల్ల ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం ఏర్పడి క్రూడాయిల్ ధరలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుత సంక్షోభంతో బ్రెంట్ క్రూడ్ అయిల్ ధర 93 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇంకో వైపు అమెరికా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దిగ్భంధించడానికి దాని నుంచి సరఫరా చేసే ఆయిల్ ట్యాంకర్లను సీజ్ చేస్తోంది.
ఇజ్రాయెల్ కూడా హిజ్ బుల్లాపై దాడులు కొనసాగిస్తోంది. గురువారం లెబనాన్ లోని ఉత్తర ప్రాంతంపై విరుచుకుపడింది. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది.
సోమవారం, ఇరాన్ - ఇజ్రాయెల్ ఒకరినొకరు లక్ష్యంగా చేసుకున్నాయి. అమెరికా ఇరాన్‌పై దాడి చేయగా, ఇరాన్ గల్ఫ్ దేశాలపై ఎదురుదాడి చేసింది. ఇరాన్‌లో సూర్యోదయానికి కొద్దిసేపటి ముందు తమ తాజా వైమానిక దాడులను "పూర్తి చేసినట్లు" యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.
"ఇరాన్ అన్యాయమైన, నిరంతర దురాక్రమణకు ప్రతిస్పందనగా" ఈ దాడులు జరిగాయని, "ఇరాన్ సైనిక నిఘా సామర్థ్యాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు వైమానిక రక్షణ స్థావరాలను" లక్ష్యంగా చేసుకున్నాయని ఆ సైనిక కమాండ్ పేర్కొంది. అమెరికా వైమానిక దళం, మెరైన్స్, నావికా దళం ఈ దాడులను నిర్వహించాయని పేర్కొన్నప్పటికీ, వాటి వల్ల జరిగిన నష్టం గురించి అది వివరంగా చెప్పలేదు.
ఈ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లపై దాడులు చేసింది. కువైట్ తన వాయు రక్షణ వ్యవస్థలు ఈ దాడిని తిప్పికొట్టడంతో, తన గగనతలాన్ని మూసివేసింది. విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లిస్తున్నట్లు కువైట్ పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ తెలిపింది.యుద్ధం ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ ఒప్పందం కుదురుతుందని ఇరుపక్షాలు ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం.
Read More
Next Story