ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకున్న యూఎస్ నేవీ
x

ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకున్న యూఎస్ నేవీ

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు


Click the Play button to hear this message in audio format

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. అమెరికా- ఇరాన్ మధ్య జరగనున్న రెండో విడత శాంతి చర్చలకు ఆటంకాలు ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిందని ఆరోపిస్తూ ఇరాన్ జెండా కలిగిన నౌకను యూఎస్ నేవీ స్వాధీనం చేసుకోడమే ఇందుకు కారణం. ఈ ఘటనపై ఇరాన్ కూడా ఘాటుగా స్పందించింది. ప్రతీకారం తప్పదని హెచ్చరికలు పంపింది. దీనితో శాంతి చర్చలు ప్రశ్నార్థకంగా మారాయి.

గతవారంలో అమెరికా, ఇరాన్ ఓడరేవుల దిగ్భంధనం చేస్తామని ప్రకటించింది. తరువాత మొదటిసారిగా ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకుంది. దీనిని దొంగదాడిగా ఇరాన్ అభివర్ణించిందది.
ఒమన్ తీరానికి సమీపంలో గల ఒక యూఎస్ నేవీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్, ఇరాన్ జెండాతో ఉన్న టౌస్కా అనే పేరు గల నౌకను అడ్డగించింది. తరువాత దాని ఇంజన్ రూమ్ లో పెద్ద రంధ్రం చేసి దానిని స్వాధీనం చేసుకుంది.
ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియాలో స్వయంగా వెల్లడించారు. యూఎస్ మెరైన్స్ అమెరికా ఆంక్షలను నౌకను తమ అదుపులోకి తీసుకుని నౌకలో ఏముందో చూస్తున్నారని తెలిసింది. ఈ దాడిలో ఎవరైన గాయపడ్డారా లేదా అనేది స్పష్టంగా తెలియదు.
ఈ సంఘటన జరిగిన తరువాత ఇరాన్ చర్చల ప్రక్రియను అనుకున్నంత సులువుగా సాగదని హెచ్చరించింది. అమెరికా బెదిరింపులు, నిజాయితీ, చిత్తశుద్దీలేని మాటలను తాము నమ్మడంలేదని పేర్కొంది. ఈ విషయాలను పాక్ మంత్రి ఇషాక్ దార్ కు కూడా ఇరాన్ తెలియజేసినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది.
ఓడను స్వాధీనం చేసుకున్న ఆదేశ విదేశాంగ మంత్రి అరాగ్చి వెంటనే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో దీని గురించి మాట్లాడినట్లు కూడా తెలిసింది. రెండు వారాల క్రితం అమెరికా- ఇరాన్ మధ్య ప్రత్యక్షంగా ఇస్లామాబాద్ వేదికగా దాదాపు 21 గంటల పాటు చర్చలు జరిగాయి. అయితే వీటిలో ఇరుపక్షాలు తమ పట్టువీడకపోవడంతో అవి విఫలం అయ్యాయి.
Read More
Next Story