
యూఎస్ అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్
నేటీ గందరగోళ ప్రపంచాన్ని భారత్ ఏ వ్యూహంతోనే ఎదుర్కోవాలి?
ఒకేసారి అనేక క్లిష్ట పరిస్థితులు న్యూఢిల్లీని చుట్టుముట్టిన నేపథ్యంలో నిశ్శబ్ధంగా చేయాల్సిన పని ఏంటంటే..
నజీబ్ జంగ్
కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టిపెట్టగానే ప్రపంచంలో పాత అల్లకల్లోలం కొత్తగా ప్రారంభం అయింది. ఒకప్పుడు ఊహలకు అందే ప్రపంచ గతి, ఇప్పుడు అంచనాలకు అందకుండా ముందుకు సాగుతోంది.
అధికార రాజకీయాలు స్తబ్దుగా మారిపోయాయి. అంతర్జాతీయ నిబంధనలు బలహీనమైపోతున్నాయి. అంతర్గత తిరుగుబాట్లు ఒక దేశం నుంచి మరో దేశంలోకి వేగంగా పాకుతున్నాయి.
ఇరాన్ లో చెలరేగిన అశాంతి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాచాలత్వంతో పశ్చిమాసియా మరోసారి నిప్పుల కుంపటి కావడానికి సిద్ధంగా ఉంది. ఇదే సమయంలో భారత్ పై కూడా అమెరికా సుంకాల ఒత్తిడి, ఇంధన అవసరాలపై వాషింగ్టన్ వైఖరితో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ మధ్య రెండు దేశాల భాగస్వామ్యం ఒత్తిడుల మధ్య ఊగిసలాడుతోంది.
భారత్ ప్రస్తుతం చాలా విరుద్దమైన పరిస్థితుల్లో చిక్కుకుంది. కొన్నిసార్లు వ్యూహాత్మక కారణాలు ఇందుకు కారణం అయ్యాయి. అయితే దీనివల్ల ఆర్థికంగా, నైతికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. కొన్ని నిర్ణయాలు అసమాన పరిస్థితులకు కారణం అవుతోంది. ఇటువంటి తరుణంలో దేశీయ విదేశాంగ విధానం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
పున: పరీశీలన సమయం కోసం..
స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారత్ నేడు ప్రపంచ వ్యవహరాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో కొన్నిసార్లు ప్రపంచ దక్షిణాది స్వరంగా, కొన్నిసార్లు బహుళ ధ్రువ ప్రపంచంలో ఓ శక్తిగా కొనియాడబడుతూ ఉంది. అయితే ఈ విశ్వాస శక్తి వెనక ఒక నిశ్శబ్ధ అశాంతి తొంగిచూస్తోంది. ఇది ఎక్కువగా దౌత్య వర్గాల్లో వినిపిస్తోంది.
ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న ఏంటంటే.. భారత్ ఇప్పుడు అనుసరిస్తున్న విదేశాంగ విధానం అనుసరించాలా లేదా.. స్వాతంత్య్రం తరువాత అనుసరించిన ఆలోచనాత్మకత వైఖరిని తిరిగి తీసుకోవాలా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది.
దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య, స్వాతంత్య్రం పొందిన తరువాత దేశం ఎదుర్కొన్న పరిస్థితి కంటే కఠినమైనది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తరువాత చేస్తున్న పనులు, బెదిరింపులు ప్రపంచ గతిని క్లిష్టపరిస్థితిలోకి నెట్టేశాయి.
పనామాను బెదిరించడం, క్యూబాకు హెచ్చరికలు, వెనెజువెలా అధ్యక్షుడిని ఎతుకెళ్లడం , నచ్చినట్లు మాట్లాడటం అనేవి ప్రపంచంలోని బేరసారాల శక్తిని తగ్గించినట్లు స్పష్టంగా తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా తిరిగి అధికార శక్తి కేంద్రీకృతంగా మారినట్లు తెలియజేస్తున్న పరిణామాలు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తన వారసత్వాన్ని, సహజత్వాన్ని తిరిగి అంచనా వేసుకుని ఆత్మపరీశీలన చేసుకోవడం ఉత్తమం.
నెహ్రూ చేసిన తప్పులు.. ఆయన పై..
జవహర్ లాల్ నెహ్రూ విదేశాంగ విధానాలపై ఎగతాళిగా చూసేవారు. అలీన విధానం అనేది నైతికత లేనిది కాదు. అది దుర్భలత్వం నుంచి పుట్టిన వ్యూహం. కొత్తగా స్వాతంత్య్రం పొంది, ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశం అగ్రరాజ్యాల అధికార కూటముల్లో చిక్కుకోవద్దని అనుకుంది. ఆయన ఇలా అలీన విదేశాంగ విధానం తీసుకువచ్చి తమకంటూ ఓ వేదికను ఏర్పాటు చేసుకోవడానికి వ్యూహం పన్నారు. ఇది అనుకున్నట్లుగానే కొంతకాలం పనిచేసింది.
ఇదే సమయంలో నెహ్రూ కొన్ని తప్పులు చేశారు. ఆయన చైనా బుద్దిని పసిగట్టలేకపోయారు. అసియా సంఘీభావాన్ని ఎక్కువగా ఊహించుకున్నారు. కఠిన వాస్తవాలకు సిద్ధం కాకపోవడంతో భారత్ ఈ లోపాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
భారత ప్రారంభ దౌత్యం సంయమనంతో దృఢత్వాన్ని మిళితం చేసింది. పక్షపాతంగా చూడటానికి ఆస్కారం కల్పించకుండా విభజనలు దాటి మాట్లాడానికి వీలు కల్పించింది. ఇది ఆయనకు ఖ్యాతి తీసుకొచ్చింది. దేశానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో దోహదపడింది. నేడు అది క్షీణతకు గురవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
చైనా కారకం..
చైనా అనేది భారత్ ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యగా ఉంది. దశాబ్దాలుగా పరిష్కారం కానీ సరిహద్దు, 2020 లో ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణ, హిందూ మహాసముద్రంలో విస్తరిస్తున్న దాని శక్తి భారత్ కు చిరాకు తెప్పిస్తున్నాయి.
దీనికోసం భారత్ కు సైనిక శక్తి పెంపొందించుకోవడం, కొత్త భాగస్వాముల అవసరం ఏర్పడింది. అయితే ప్రతిదానికి దౌత్య పరిష్కారం కోసం చూస్తున్నప్పుడూ వ్యూహం, పతిచర్యాత్మకంగా మారే ప్రమాదం ఉంది.
భౌగోళికంగా భారత్, చైనాను వేరుచేయడం సాధ్యం కాదు. ఈ శత్రుత్వాన్ని ఎదుర్కోవాలంటే సహనం, దౌత్యంతో పాటు ప్రాంతీయ భరోసా అవసరం. చైనా ప్రభావం బలం ద్వారానే కాకుండా పట్టుదల ఆధారంగా కూడా పెరిగింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ బలమైన ఆర్థిక, సైనిక శక్తిని భారత్ సైతం గుర్తించాలి.
అస్థిర దేశాలు..
భారత్ కు మరో వైపున ఉన్న ప్రాంతాలు తీవ్ర అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. పాకిస్తాన్ సైనిక ఆధిపత్యంలో ఉంది. ఆర్థికంగా దుర్భరపరిస్థితికి జారుకుంది. దాని అంతర్గత పరిస్థితులపై భారత్ కు పరిమితమైన నియంత్రణ ఉంది.
ప్రధానిగా మన్మోహన్ హయాంలో ఉన్న జరిగిన తెరవెనక దౌత్యాన్ని తిరిగి కొనసాగించాలి. నిజానికి 2014 లో ప్రధాని మోదీ తన పదవీ ప్రమాణ స్వీకారానికి నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించడం ద్వారా, మధ్యలో పాక్ ను హఠాత్తుగా సందర్శించడం ద్వారా తన ఉద్దేశ్యాన్ని ప్రదర్శించారు.
భారత్ చాలాకాలంగా దౌత్య విజయాలు సాధించిన బంగ్లాదేశ్, ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. అక్కడ పెరుగుతున్న మతతత్వం, మైనారిటీల హత్యలు పరిస్థితిని మరింత దిగజార్చాయి.
వీటిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తే చైనాతో సన్నిహిత సంబంధాలు బలపడే అవకాశం ఉంది. నేపాల్, శ్రీలంక, మాల్దీవులు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి.
పశ్చిమాసియా.. అల్లకల్లోలంగా ఉందా?
పశ్చిమాసియాలో పరిణామాలు భారత పరిస్థితిని మరింత సందిగ్థంలోకి నెట్టేశాయి. ఇరాన్ అంతర్గత అశాంతి, లోతైన ఆర్థిక సంక్షోభం, అమెరికా ఆంక్షలు, బలవంతపు చర్యలు పునరుద్దరించబడే అవకాశం ఉంది.
ఇవి భారత ప్రయోజనాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. భారత్ ఇంధన భద్రత, ప్రాంతీయ సుస్థిరత్వం, మధ్య ఆసియా ఎంట్రీ కోసం న్యూఢిల్లీకి టెహ్రన్ చాలా ముఖ్యం. ఖతార్ నుంచి భారత్ కు సప్లై అయ్యే సహజ వాయువు ఇరాన్ జలసంధి నుంచే రావాలి. ఇక్కడ నిర్వహిస్తున్న చాబహార్ పోర్టు కూడా చాలా ముఖ్యమైనవి.
అమెరికా- ఇరాన్ ఘర్షణ కారణంగా భారత్ సంబంధం పరిమితంగా మారింది. ఇదే సమయంలో న్యూఢిల్లీ- వాషింగ్టన్ వైఖరి లావాదేవీలతో ఉంది. సుంకాల హుంకారాలు, రాయితీపై చమురు కొనుగోళ్లపై ఒత్తిడి, ఆంక్షలకు సంబంధించిన కత్తులు వేలాడుతున్నాయి.
భారత్ ఒకే సమయంలో అనేక అడ్డంకులు ఎదుర్కొంటోంది. ఇరాన్ లో అశాంతి, అమెరికన్ విధానంలో అస్థిరత, చైనాతో శత్రుత్వం, అస్థిరంగా ఉన్న పొరుగు ప్రాంతాలు భారత్ ను క్లిష్ట పరిస్థితిని ఏకకాలంలో ఎదుర్కొనేలా చేస్తున్నాయి.
భారత్ మార్గం ఏందీ?
వీటి నుంచి బయటపడాలంటే భారత్ సహనంగా ఉండాలి. బలం నిరంతరంగా పనికిరాదు. భారత్ తన పొరుగు ప్రాంతాలలో దృఢత్వాన్ని, భరోసాను తిరిగి పెంపొందించుకోవాలి. సైనిక సంసిద్దతను గురించి చర్చించకూడదు. కానీ అందులో కూడా వినయం కూడా అంతే అవసరం. బలమైన శక్తితో సంయమనం కూడా మిళితం చేయాలి.
మూడోది భారత్ ఒకే పోటీకి మించి తన ప్రపంచ శక్తిని అర్థం చేసుకోవాలి. చైనా ముఖ్యమైనదే కానీ అది ఏకైక దృష్టి కేంద్రంగా ఉండకూడదు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాతో అభివృద్ధి, వాతావరణం, ఆరోగ్యం, సాంకేతికతపై పట్టు బహుళ ధ్రువ ప్రపంచంలో దాని శక్తిని తిరిగి నెలకొల్పుతుంది.
నాల్గవది భారత్ నైతికతను వీడి, నైతిక సమతుల్యత పునరుద్దరించాలి. ఎక్కడైనా పౌర బాధలకు వ్యతిరేకంగా మాట్లాడటం జాతీయ ప్రయోజనాలను బలహీనపరచదు. ఇది విశ్వసనీయతను బలపరుస్తుంది. భారత బహుళత్వం చాలాకాలంగా విదేశాలలో తన స్వరాన్ని పెంచడానికి ఉపయోగపడింది.
చివరగా భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ఒక నినాదంగా కాకుండా, ఒక సజీవ ఆచరణగా కాపాడుకోవాలి. ఎంపికలు విస్తరించాలి. వాటిని తగ్గించకూడదు. అస్థిర ప్రపంచంలో స్వయంప్రతిపత్తి అంటే సంసిద్ధత.
భారత్ ఇకపై వలస రాజ్యాల పాలన తరువాత ఉన్న దేశం కాదు. అసహనంతో ఉన్న శక్తి కేంద్రం కాదు. విచ్చిన్నమైన ప్రపంచాన్ని నావిగేట్ చేస్తున్న నాగరికత కలిగిన దేశం. గట్టిగా అరవడం ద్వారా కాదు, సమతుల్యతతో వ్యవహరించడం ముఖ్యం. ఈ నిశ్శబ్దం రాబోయే అల్లకల్లోల సంవత్సరాల్లో దేశం స్థానాన్ని నిర్వచిస్తుంది.
(ది ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను ప్రచురిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. అవి తప్పనిసరిగా ది ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)
Next Story


