నోబెల్ ప్రైజ్ కు నాకంటే అర్హులెవరున్నారు: ట్రంప్
x

నోబెల్ ప్రైజ్ కు నాకంటే అర్హులెవరున్నారు: ట్రంప్

మరోసారి మనసులో మాట బయట పెట్టిన అమెరికా అధ్యక్షుడు


Click the Play button to hear this message in audio format

నోబెల్ శాంతి పురస్కారం ట్రంప్ మరోసారి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాను రెండోసారి అధ్యక్షుడు అయ్యాక చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఎనిమిది యుద్ధాలు పరిష్కారించానని, తాను శాంతి బహుమతికి అర్హుడిని అంటూ పేర్కొన్నారు. నార్వేజియన్ శాంతి కమిటీ శుక్రవారం ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించనున్న నేపథ్యంలో ట్రంప్ బుధవారం మధ్యాహ్నం వైట్ హౌజ్ లోని ఓవల్ ఆఫీస్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘నేనేమీ గొప్పలు చెప్పుకోవడం లేదు. ఇంకెవరూ చేయని పనులు చేశాను. నేను కేవలం వాస్తవాలు మాత్రమే చెబుతున్నాను. బహుశా ఏ అధ్యక్షుడు ఇన్ని యుద్ధాలు పరిష్కరించి ఉండరు. నేను ఇప్పటి వరకూ ఎనిమిది యుద్ధాలు పరిష్కరించాను’’ అని ట్రంప్ విలేకరులతో అన్నారు.
తనను పట్టించుకోకపోవడం నోబెల్ కమిటీకే అవమానం అని వ్యాఖ్యానించారు. ‘‘నాలాంటి శాంతి ప్రయత్నాలు చేసే వారికి అది ఇవ్వరనే అపఖ్యాతి వాళ్లకు ఉంది. కానీ నాకు అది దక్కినా, దక్కకపోయినా, నేను అంతకంటే ఎక్కువ చేశాను.
అది వాళ్లకు గొప్ప అవమానం అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఈ మాటను ఏవగింపుతో అనడం లేదు. మీరు ఎనిమిది యుద్దాలు పరిష్కరించన నన్నే పట్టించుకోకపోతే ఎలా అని అంటున్నాను’’ అని ట్రంప్ అన్నారు.
శాంతి స్థాపన కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, మరో యుద్ధాన్ని పరిష్కరించే దిశగా తాను ప్రయత్నాలు చేస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ప్రకటించుకున్నారు. 2009 లో తనకు నోబెల్ బహుమతి ఎందుకు ఇచ్చారో కూడా తెలియదని, బరాక్ ఒబామా ప్రకటించారని, కానీ నిజంగా తాను అందుకు అర్హుడినే అని తనకు తానుగా ప్రకటించుకున్నారు.
‘‘ఒబామాకు వచ్చింది.. కానీ తాను ఏం చేశాడో తనకే తెలియదు. ఆయన ఎన్నికైన వెంటనే దాన్ని పొందారు.’’ అని ట్రంప్ అన్నారు. గత ఏడాది ఈ శాంతి పురస్కారం వెనెజువెలాకు చెందిన విపక్ష నేత మరియా కొరినా మచాడో అందుకున్నారు. కానీ తాను మాత్రం దాన్ని నాకు ఓవల్ ఆఫీస్ అందజేశారని ట్రంప్ గుర్తు చేశారు.
‘‘గతసారి వారు దాన్ని ఒక అద్భుతమైన యువతికి ఇచ్చారు. అయితే అది అందుకునే అర్హత తనకు లేదని, నాకే ఆ అర్హత ఉందని చెప్పి, నాకే అందజేశారు’’ అని ఆయన అన్నారు. నోబెల్ శాంతి అవార్డును పరోక్షంగా అందుకోవడం కూడా నాకు గౌరవంగా ఉందని పేర్కొన్నారు.
Read More
Next Story