
తమిళ తీరాన్ని తాకిన ‘దళపతి’ సునామీ
జననాయకుడిగా మారిన విజయ్
దేశంలో నెలరోజుల పాటు సాగిన ఎన్నికల సమరం ముగిసింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం నాలుగు రాష్ట్రాలతో పాటు, పుదుచ్చేరీ కేంద్రపాలిత ప్రాంతం ఓట్ల లెక్కింపు మొదలయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే సాయంత్రం వరకూ తుది ఫలితాలు వెలువడి ఎవరూ గద్దెనెక్కుతారో తేలుతుంది.
విజయ్ కింగ్ మేకర్ అవుతాడా..
పుదుచ్చేరిలో..
కేరళ..
పశ్చిమ బెంగాల్ లో..
అస్సాం..
Live Updates
- 4 May 2026 9:09 AM ISTపోస్టల్ ఓట్లు :కేరళలో పోరు హోరాహోరీఎల్డీఎఫ్- 65:యూడీఎఫ్ - 65 ;ఎన్డీఏ - 4బెంగాల్ ఢీ అంటే ఢీ అంటున్న టీఎంసీ, బీజేపీటీఎంసీ -58బీజేపీ- 67కాంగ్రెస్ 2అస్సాంలో..బీజేపీ-40కాంగ్రెస్- 14ఏఐయూడీఎఫ్- 1తమిళనాడుడీఎంకే-41అన్నాడీఎంకే- 22టీవీకే- 10పుదుచ్చేరిఎన్డీఏ -6టీవీకే -4
- 4 May 2026 8:09 AM IST
మహబలిపురంలో రిసార్ట్ లు బుక్ చేసిన టీవీకే
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో నేడు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తరువాత ఈవీఎం లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో కొత్తగా పోటీకి దిగిన టీవీకే పార్టీ రిసార్ట్ లు బుక్ చేసింది. పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులను వెంటనే మహాబలిపురం రిసార్ట్ కు తరలించేలా ఏర్పాట్లు చేసింది.
- 4 May 2026 7:49 AM IST
ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్న కేరళలో ఎన్నికల అధికారులు ఉదయం స్ట్రాంగ్ రూమ్ లను తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేస్తామని అధికారులు వెల్లడించారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్ లో స్ట్రాంగ్ రూముల వద్ద బీజేపీ, టీఎంసీ ఏజెంట్లు గొడవకు దిగారు. దీనితో భద్రతా దళాలు అప్రమత్తమై ప్రశాంతమైన వాతావరణం ఏర్పరిచాయి.
#WATCH | Kolkata, West Bengal: A verbal argument broke out between the counting agents of TMC and BJP outside the counter centre at Sakhawat Memorial School in Bhabanipur assembly constituency.
— ANI (@ANI) May 4, 2026
Counting of votes for 293 Assembly constituencies of the state will begin at 8 AM… pic.twitter.com/cvJOrqHC6i

