
ఎగ్జిట్ పోల్స్ లైవ్: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల అంచనాలిలా!
కేరళ, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్..
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన భారీ ఎన్నికల ప్రక్రియకు ఈరోజుతో తెరపడింది. చివరి దశ పోలింగ్ పశ్చిమ బెంగాల్‌లో ముగియగా, దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు ఎగ్జిట్ పోల్స్‌పై నిలిచింది. ఈ ఎన్నికల సీజన్‌లో పలు దశల్లో పోలింగ్ జరిగింది. చివరి దశలో పశ్చిమ బెంగాల్‌లో రికార్డు స్థాయిలో 90 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది ప్రజల ఉత్సాహాన్ని స్పష్టంగా చూపించింది.
ఇప్పుడు సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటకు రావడం ప్రారంభమవుతుంది. ఈ అంచనాలు ప్రస్తుత ప్రభుత్వాల పరిస్థితిపై మొదటి సంకేతాలు ఇస్తాయి. కేరళ, అస్సాంలో అధికార పార్టీలు తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయా అనే విషయం తెలిసే అవకాశం ఉంది. అలాగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన గట్టిపోటీ ప్రచారం ఓటర్లపై ఎలా ప్రభావం చూపిందో కూడా అర్థమవుతుంది. పుదుచ్చేరి పోరులో ఎవరు ముందంజలో ఉన్నారో కూడా ఈ అంచనాలు సూచించవచ్చు. అయితే అసలు ఫలితాలు మే 4న ఓట్ల లెక్కింపు తర్వాత మాత్రమే స్పష్టమవుతాయి. అప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలు కొనసాగనున్నాయి.
Live Updates
- 29 April 2026 7:17 PM IST
బీజేపీ దుర్వినియోగం చేసింది: టీఎంసీ ఆ్
ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన వెంటనే, పశ్చిమ బెంగాల్‌లో ప్రజా మద్దతు కంటే బిజెపి కేంద్రం సంస్థలపైనే ఎక్కువగా ఆధారపడుతోందని తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.
సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో, ఆ పార్టీ ఇలా పేర్కొంది, “బెంగాల్‌లో బీజేపీకి ఓటర్లు లేరు. అందుకే ఎలాగోలా గట్టెక్కడానికి వారు ఎన్నికల సంఘం, కేంద్ర బలగాలు, కేంద్ర ఏజెన్సీల యంత్రాంగంపై ఆధారపడుతున్నారు.” ఎగ్జిట్ పోల్ అంచనాలు విడుదలైన కొద్ది నిమిషాలకే ఈ వ్యాఖ్యలు రావడం, రాబోయే కాలంలో మరింత తీవ్రమైన రాజకీయ వాదోపవాదాలకు నాంది పలికింది.
పోలింగ్ సమయంలో విస్తృతంగా బెదిరింపులు జరిగాయని కూడా ఆరోపించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి, "యూనిఫాంలో ఉన్న అమిత్ షా 'గూండా బాహినీ' విచ్చలవిడి హింస, ఆసన్నమైన ఓటమిని ఎదుర్కొంటున్న పార్టీకి ప్రతిబింబిస్తుంది" అని ఆ పార్టీ పేర్కొంది. అన్ని వర్గాల ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నారని కూడా టిఎంసి ఆరోపించింది. "బెంగాల్ గొంతును అణచివేసే ప్రయత్నంలో వారు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు, మహిళలు, వృద్ధులు, రోగులు మరియు పిల్లలపై కూడా వేధింపులకు, దాడులకు పాల్పడ్డారు," అని పేర్కొంది.
ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ, ఫలితంపై పార్టీ నిశ్చయతను వ్యక్తం చేసింది. "కానీ ఎంత బెదిరింపులు, హింస, లేదా భయం కూడా ప్రజల తీర్పు నుండి బీజేపీని కాపాడలేవు," అని పేర్కొంది.
- 29 April 2026 7:11 PM IST
తమిళనాడులో...
ఇక్కడ డిఎంకె, ఎఐడిఎంకె మధ్య హోరా హోరు పోరు సాగింది. కొత్త పార్టీ టివికె ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఈ పార్టీకి 15 శాతం ఓట్లు వచ్చాయి. డిఎంకె కు 39 శాతం ఓట్లు పోలయ్యాయి, ఎఐడిఎంకెకి 40 శాతం పోలయ్యాయి
- 29 April 2026 7:09 PM IST
పశ్చిమబెంగాల్ లో బిజెపి ఆధిక్యత
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మొదటి విడత పోలింగ్ లో టిఎంసి, బిజెపి మధ్య హోరోహోరు సాగింది. రెండో విడత పోలింగ్ ఇంకా నడుస్తున్నందున, ఎగ్జిట్ పోల్ ఫలితాలు మొదటి దశ వరకే అందుబాటులో ఉన్నాయి. ఇందులో పీపుల్స్ పల్స్ తప్ప మిగతా పోల్స్ మొత్తం బెంగాల్ లో బిజెపికే ఆధిక్యత ఇస్తున్నాయి. పీపుల్స్ పోల్స్ బిజెపికి 95 -110 సీట్లు ఇస్తే, తృణమూల్ కాంగ్రెస్ కు 117 నుంచి 187 దాకా ఇచ్చింది. మిగతా పోల్స్ జెవిసి, చాణక్య స్ట్రాటజీస్,పోల్ డెయిరీ మాత్రిజ్ బజెపికి ఆధిక్యత ఇచ్చాయి.
- 29 April 2026 7:06 PM IST
కేరళలో అన్ని సంస్థల అంచనాలు ఒకే వైపు..
కేరళ అసెంబ్లీ ఎన్నికలపై పలు సంస్థలు తమ అంచనా ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాయి. అన్ని చెప్తున్నది ఒకే మాట.. ఈసారి పినరయి విజయన్ ఓటమి తథ్యమని. ఈసారి కేరళంలో కాంగ్రెస్ సమ్యుక్త యూడీఎఫ్ జెండా రెపరెపలాడటం ఖాయమని.
ఆక్సిస్ మై ఇండియా
యూడీఎఫ్ - 78-90 సీట్లు
ఎల్‌డీఎఫ్ - 49-62 సీట్లు
ఇతరులు - 0-3 సీట్లు
పీ-మార్క్
యూడీఎఫ్ - 72-79 సీట్లు
ఎల్‌డీఎఫ్ - 62-69 సీట్లు
ఇతరులు - 0-3 సీట్లు
- 29 April 2026 7:01 PM IST
డీఎంకేదే తమిళనాడు
తమిళనాడు కు సంబంధించి మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ డీఎంకేకు అధికారం దక్కుతుందని అంచనా వేసింది. 234 స్థానాలున్న అసెంబ్లీలో డీఎంకే కూటమి 122 నుంచి 132 స్థానాలు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. పీపుల్స్ పల్స్ సంస్థ 125 స్థానాలు, విపక్ష అన్నాడీఎంకే కు 65 నుంచి 80 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. మ్యాట్రిజ్ సంస్థ ప్రకారం అన్నాడీఎంకే 87 నుంచి 110 స్థానాలు దక్కించుకుంటుంది. అలాగే హీరో విజయ్ స్థాపించిన టీవీకే 10 నుంచి 12 స్థానాలు దక్కుతుందని అంచనా వేసింది. కానీ విజయ్ భారీ స్థాయిలో ఓట్లు చీల్చినట్లు తెలియజేశాయి.చాణక్య స్ట్రాటజీస్
డీఎంకే: 145- 160
అన్నాడీఎంకే: 50- 65
టీవీకే: 13- 18
ఇతరులు: 5 -8
పీపుల్స్ పల్స్
డీఎంకే: 125- 145
అన్నాడీఎంకే: 65-80
టీవీకే: 10-24
మ్యాట్రిజ్
డీఎంకే: 122-132
అన్నాడీఎంకే: 87-110
టీవీకే: 10-25
- 29 April 2026 7:00 PM IST
#WATCH | Hooghly, West Bengal | All India Trinamool Congress (TMC) candidate contesting from Sreerampur (General) Assembly constituency, Tanmoy Ghosh says, "...So far the polling is peaceful… But in a few places, specifically booth no 225, 19,21, 22, where Bengal police have… pic.twitter.com/38n5VOrN3a
— ANI (@ANI) April 29, 2026 - 29 April 2026 6:55 PM IST
కేరళ ఎగ్జిట్ పోల్స్: యూడీఎఫ్‌దే విజయం?
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మారే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఎన్నికల పోలింగ్ అనంతరం విడుదలైన పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్.. కేరళంలో అధికారం మారే అవకాశం గట్టిగా కనిపిస్తోందని చెప్తోంది. పినరయి విజయ్.. గెలుపు కష్టమేనని, ఈసారి కాంగ్రెస్ అధ్యక్షతన ఉన్న యూడీఎఫ్‌కు అత్యధిక సీట్లు వచ్చే అవకాశం ఉందని పలు సంస్థలు చెప్తున్నాయి.
మాట్రిజ్ అనే సంస్థ అంచనాల ప్రకారం..
యూడీఎఫ్: 70-75 సీట్లు
ఎల్‌డీఎఫ్: 60-65 సీట్లు
ఎన్‌డీఏ లేదా అదర్స్: 2-4 సీట్లు
- 29 April 2026 6:55 PM IST
అస్సాం లో బీజేపీ హ్యట్రిక్..
దాదాపు నెల రోజుల నుంచి కొనసాగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంకు సంబంధించి వివిధ సర్వే సంస్థలు తమ అంచనాలను విడుదల చేశాయి.అస్సాం లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ఆక్సిస్ మై ఇండియా- ఎన్డీటీవీ సర్వే అంచనా వేసింది. ఈ సంస్థ ప్రకారం ఎన్డీఏ ఏకంగా 88 నుంచి 100 వరకు సీట్లు సాధించే అవకాశం ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కు మరోసారి నిరాశే ఎదురవుతుందని పేర్కొంది. కాంగ్రెస్ కూటమికి ఈ సర్వే సంస్థ ప్రకారం 24 నుంచి 36 వరకూ మాత్రమే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అస్సాం అసెంబ్లీలో 126 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 65 సీట్లు గెలుచుకున్న పార్టీలు అధికారం దక్కించుకునే అవకాశం ఉంది.బీజేపీ గత రెండు పర్యాయాలుగా ఇక్కడ అధికారంలో ఉంది. ఇప్పుడు కూడా గెలిస్తే హ్యాట్రిక్ సాధించినట్లు అవుతుంది. అస్సాం ఎన్నికలన్నీ కూడా బంగ్లాదేశ్ చొరబాట్లు, తేయాకు తోటల కార్మికులు, మిగిలిన ఈశాన్య రాష్ట్రాల సమస్యల చుట్టూ తిరిగాయి. పీపుల్ పల్స్ ప్రకారం కూడా అస్సాంలో మరోసారి బీజేపీదే అధికారమని అంచనా వేసింది. ఇక్కడ బీజేపీ 68 నుంచి 72 స్థానాలు సాధించే అవకాశం ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కు మరోసారి 22 నుంచి 26 స్థానాలు వచ్చే అవకాశం ఉంది

