
బహ్రెయిన్ బేస్‌పై ఇరాన్ దాడి, హోర్ముజ్ మూసివేత
రియాద్ ఎంబసీపై డ్రోన్ దాడి తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి. పౌరులు మధ్యప్రాచ్యం విడిచిపోవాలని అమెరికా సూచించింది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. బహ్రెయిన్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌పై భారీ డ్రోన్, క్షిపణి దాడి జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది. ఇదే సమయంలో ఇరాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మంగళవారం ఉదయం 20 డ్రోన్లు, మూడు క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించింది. బహ్రెయిన్‌లోని షేక్ ఈసా ప్రాంతంలోని అమెరికా ఎయిర్‌బేస్ ప్రధాన కమాండ్ కేంద్రం, ఇంధన ట్యాంకులు ధ్వంసమయ్యాయని తెలిపింది. దీనిపై అమెరికా, బహ్రెయిన్ అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
అమెరికా ప్రతిస్పందన
అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్‌కు చెందిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి మరియు డ్రోన్ ప్రయోగ కేంద్రాలు, సైనిక ఎయిర్‌ఫీల్డ్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్లు నిర్వహించినట్లు వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే ప్రతీకార చర్యలు స్పష్టమవుతాయని చెప్పారు. ఆపరేషన్లు నాలుగు నుంచి ఐదు వారాలు కొనసాగే అవకాశం ఉందని, అవసరమైతే ఇంకా ఎక్కువకాలం కొనసాగుతాయని సూచించారు.
రియాద్ ఎంబసీపై డ్రోన్ దాడి
సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలోని అమెరికా రాయబార కార్యాలయ సముదాయంపై రెండు డ్రోన్లు దాడి చేసినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అగ్ని ప్రమాదం సంభవించి స్వల్ప భౌతిక నష్టం జరిగినట్లు తెలిపింది. ఘటన సమయంలో భవనం ఖాళీగా ఉండటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. కొన్ని డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు సమాచారం.
ఇరాన్ సుప్రీం లీడర్ అలి ఖమేనీ మరణం తర్వాత ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ ప్రాంతంలోని చమురు, సహజవాయు ఉత్పత్తి కేంద్రాలు ప్రభావితమయ్యాయి. చమురు ధరలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు అంతరాయానికి గురయ్యాయి.
హోర్ముజ్ జలసంధి మూసివేత
హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది. దానిని దాటే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఈ ప్రకటనను బ్రిగేడియర్ జనరల్ సర్దార్ ఇబ్రహీం జబారి వెల్లడించారు. ఈ చర్యను భౌగోళిక రాజకీయ పరిణామాల్లో కీలక మలుపుగా విశ్లేషిస్తున్నారు.
అమెరికా పౌరులకు హెచ్చరిక
పరిస్థితులు విషమిస్తున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ మధ్యప్రాచ్యంలోని పలు దేశాలను విడిచిపోవాలని పౌరులకు సూచించింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఇరాక్‌లలో అత్యవసరం కాని సిబ్బందిని వెనక్కు పిలిపించింది. కువైట్‌లోని అమెరికా ఎంబసీని తాత్కాలికంగా మూసివేసింది. రియాద్, జెడ్డా, ధహ్రాన్ నగరాల్లోని అమెరికా పౌరులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని రాయబార కార్యాలయం సూచించింది. సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది.
Live Updates
- 3 March 2026 6:59 PM IST
బ్రిటిష్ నాయకత్వంపై ట్రంప్ ఆగ్రహం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు మద్దతు ఇవ్వకపోవడంతో బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌పై ఆయన విమర్శలు చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఉన్నట్లుగా లేవని వ్యాఖ్యానించారు.
బ్రిటిష్ పత్రిక ది సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ స్టార్మర్ సహాయకరంగా వ్యవహరించలేదని అన్నారు. యూకే నుంచి ఇలాంటి వైఖరి ఉంటుందని తాను ఊహించలేదని చెప్పారు. తమకు యూకేపై ప్రేమ ఉందని కూడా పేర్కొన్నారు.
ప్రపంచ పరిస్థితులు మారిపోయాయని ప్రస్తుతం ఉన్న సంబంధాలు గతంతో పోలిస్తే భిన్నంగా మారాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య ఉన్న అనుబంధం మునుపటిలా లేదని చూడటం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
- 3 March 2026 6:58 PM IST
మార్చి 7 వరకు జమ్మూలో స్కూల్స్ బంద్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు నిరసనగా కాశ్మీర్‌లో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి విద్యాసంస్థలను మార్చి 7 వరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీ మరణించినట్లు వార్తలు వెలువడిన తర్వాత కాశ్మీర్‌లో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని పాఠశాలలు, కళాశాలలు మార్చి 7, 2026 వరకు మూసివేయాలని విద్యాశాఖ మంత్రి సకీనా ఇటూ మంగళవారం ప్రకటించారు.
మార్చి 1 నుంచే లోయలో రెండు రోజులపాటు విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ నిరసనలు తగ్గలేదు. మంగళవారం మూడో రోజు కూడా వేలాది మంది వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. శ్రీనగర్ సహా కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ప్రధానంగా షియా జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ నిరసనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
- 3 March 2026 6:09 PM IST
ఒమన్ సుల్తాన్, కువైట్ యువరాజ్‌తో మోదీ చర్చ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఒమాన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌తో, కువైట్ యువరాజు షేక్ సబాహ్ అల్-ఖాలెద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాహ్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో వారి దేశాలపై జరిగిన దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అని అధికారులు తెలిపారు. ఈ సంభాషణల్లో ఆ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రత అంశాలపై కూడా చర్చించారు. గల్ఫ్ ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు ముఖ్య నాయకులతో మోదీ ఫోన్‌లో మాట్లాడినట్లు అధికారులు పేర్కొన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన నేపథ్యంలో ఈ ఫోన్ కాల్స్ జరిగాయి. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్టు సమాచారం. దీనికి ప్రతిగా ఇరాన్, ఇజ్రాయెల్‌పై అలాగే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. దుబాయ్, దోహా వంటి అంతర్జాతీయ వ్యాపార, విమానయాన కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. గత రెండు రోజులుగా మోదీ బహ్రెయిన్ రాజుతో, సౌదీ అరేబియా యువరాజుతో కూడా మాట్లాడారు. ఆ దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతకు విరుద్ధంగా జరిగిన దాడులను ఖండించారు. ఈ క్లిష్ట సమయంలో వారి ప్రజలతో భారత్ ఐక్యతగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
- 3 March 2026 5:31 PM IST
ఇరాన్‌లో విపత్తులో చిక్కిన భారత విద్యార్థుల కోసం తల్లిదండ్రుల ఆందోళన
వెస్ట్ ఏషియా సంక్షోభం తీవ్రతరంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను వెంటనే రక్షించమని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. శ్రీనగర్‌లో నివాసమున్న 30 ఏళ్ల ఆల్తాఫ్ ఖాన్ తన తల్లి శోబియా, తెహ్రాన్‌లో మొదటి సంవత్సరం వైద్య విద్యార్థిని, సురక్షితంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఫోన్లను పరీక్షిస్తూ, వేళా వేళా అప్‌డేట్స్ కోసం ఎదురుచూశారు. శోబియా గత రోజున కొద్ది నిమిషాలు తన కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు భయం ఆమె స్వరంలో స్పష్టంగా తెలిసిందని ఆల్తాఫ్ చెప్పారు. ఆమె చెప్పారు, కాంపస్ వద్ద తరచూ సైరెన్లు వినిపిస్తున్నాయి, దగ్గర్లో భారీ పేలుళ్లు వినిపిస్తున్నాయి.
ఆల్తాఫ్ తెలిపారు, తల్లిదండ్రులు ఆహారం తినడంలో, నిద్రపోవడంలో విఫలమవుతున్నారని. నిరంతర ఆందోళన కుటుంబానికి భారంగా మారిందని చెప్పారు. 19 ఏళ్ల కేవలం తన తల్లి ఎలా భయపడుతుందో ఊహించలేనని, ఆందోళనలో ఆయన స్వరం ఊపిరి తీసుకోలేనంతగా మారిందని పేర్కొన్నారు. ఇక 44 ఏళ్ల ఆఫ్రోజా, శ్రీనగర్‌లో నివసిస్తూ, తన కుమార్తె, తెహ్రాన్‌లో 3వ సంవత్సరం వైద్య విద్యార్థి, సురక్షితంగా బయటకు తీసివేయాలని ప్రభుత్వానికి తక్షణమే విజ్ఞప్తి చేశారు. ఆమె చెప్పినట్టు, ఆహారం, ఇతర అవసరాలు తక్కువగా ఉన్నాయని, కాంపస్ బయట కదలిక ప్రమాదకరమైందని తెలిపారు. ఇతర దేశాలు ఇప్పటికే తమ విద్యార్థులను రక్షించుకున్నాయి. పరిస్థితులు తీవ్రమైనందున ప్రతి క్షణం చెడు వార్తలు వచ్చే భయంతో ఫోన్లను పట్టుకుని ఉంటామని ఆమె పేర్కొన్నారు.
అన్ని భారత వైద్య విద్యార్థుల సమాఖ్య ప్రతినిధి మోహమ్మద్ మోమిన్ ఖాన్ చెప్పారు, తెహ్రాన్ నుంచి ప్రికాషనరీ చర్యల కింద తరలింపుకు తీసుకెళ్లిన విద్యార్థులు సురక్షితంగా కొమ్ చేరారని. ఈ తరలింపు భారత దౌత్యశాఖతో సమన్వయంతో జరిగింది. ఈరోజు భారత్ తన పౌరులకు ఇరాన్‌లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే ఇంట్లోనే ఉండాలని సూచించింది. అమెరికా, ఇస్రాయేల్ నూతన సైనిక దాడులు నిర్వహించటంతో పరిస్థితులు మరింత ఘర్షణాత్మకంగా మారాయని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.
- 3 March 2026 3:54 PM IST
గల్ఫ్ దేశాల నుంచి ప్రారంభమైన విమాన రాకపోకలు
దుబాయ్,మస్కట్, అబుదాబి నుంచి భారత్‌కు విమానాలు.. ఢిల్లీకి చేరుకున్న 2 విమానాలు.
- 3 March 2026 3:25 PM IST
ఇరాన్ యుద్ధంలోకి చైనా ఎంట్రీ
యూఎస్, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. ఈ యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్‌కు మద్దతుగా గళం విప్పింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడుతామని, ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఆపాలని చైనా కోరింది.
- 3 March 2026 2:59 PM IST
787కి చేరిన ఇరాన్ మృతులు సంఖ్య
అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల కారణంగా ఇరాన్‌లో భారీ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 787కి చేరింది. ఈ విషయాన్ని ఇరానియన్ రెడ్ క్రాస్ సొసైటీ వెల్లడించింది.
- 3 March 2026 2:58 PM IST
పాకిస్థాన్ గగనతలం పాక్షిక మూసివేత
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ గగనతలాన్ని పాక్షికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మూసివేత మార్చి ఆఖరి వరకు కొనసాగనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.
- 3 March 2026 2:49 PM IST
యుద్ధం సమయాన.. ఇరాన్‌లో భూకంపం
మూలిగే నక్కపై తాటికాపడినట్లు అయింది ఇరాన్ పరిస్థితి. ఒకవైపు యుద్ధంతా అతలాకుతలం అవుతున్న సమయంలో ఇరాన్‌ను భూకంపం వణికిస్తోంది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో వచ్చింది. దక్షిణ ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. నష్ట తీవ్రతకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు నాలుగు రోజులుగా ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్‌లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.
- 3 March 2026 2:32 PM IST
ఇరాన్ హోర్ముజ్ జలసంధిలో నౌకాశ్రయాలపై హెచ్చరిక
ఇరాన్, పెర్సియన్ గల్ఫ్‌లోని హోర్ముజ్ జలసంధిలో నౌకల ప్రయాణంపై హెచ్చరికలు కొనసాగిస్తోంది. ఈ జలసంధి ద్వారా అంతర్జాతీయంగా వాణిజ్య కోసం ట్రేడింగ్ అయ్యే చమురు మొత్తం ఐదవ భాగం తరలించబడుతుంది. పరామిలటరీ రివల్యూషనరీ గార్డ్ సలహాదారు బ్రిగేడియర్ జనరల్ ఇబ్రహిం జబ్బారి ఈ హెచ్చరికను సోమవారం ఇరాన్ రాష్ట్ర టెలివిజన్‌లో ప్రకటించారు. జబారి తెలిపినట్టు, “హోర్ముజ్ జలసంధి మూసివేయబడింది. దాటాలనుకునేవారు ఐఆర్‌జీసీ నేవీ సైనికులు ఈ నౌకలను దహనమయ్యేలా చేస్తారు. ఈ ప్రాంతానికి రావద్దు.”


