
47 మంది మావోయిస్టుల లొంగుబాటు..
34 ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
తెలంగాణలో మరోసారి భారీగా మావోయిస్ట్‌లు లొంగిపోయారు. పోలీసులు ఎదుట శనివారం 47 మంది మావోయిస్ట్‌లు ఆయుధాలు వీడారు. వారి దగ్గర నుంచి 34 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 2026 మార్చి 31 నాటికి భారత్‌ను మావోయిస్ట్ రహిత దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆ దిశగా తీసుకున్న చర్యల్లో భారీ సంఖ్యలో మావోయిస్ట్‌లు లొంగిపోవడం, ఎన్‌కౌంటర్‌లో మరణించారు. కాగా ఇంకా కొందరు మావోయిస్ట్‌లుగానే ఉన్నారు. వారిని కూడా జనజీవన స్రవంతిలో కలపడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్ట్‌లకు భారీ ఎత్తున కాప్పులు జరిగాయి. వీటిలో సహదేవ్ మహతో అలియాజ్ అనుజ్, నతాషా, బుధర్ కర్మాలి, రంజిత్ గంజూఅనే మావోయిస్ట్‌లు హతమయ్యారు. శనివారం తాజాగా తెలంగాణ పోలీసుల ముందు 47 మంది లొంగిపోయారు.
శనివారం లొంగిపోయిన మావోయిస్ట్‌లు అందరూ కూడా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారేనని శివధర్ రెడ్డి తెలిపారు. ఆపరేషన్ కగార్‌కు విధించిన గడువు ముగిసినప్పటికీ మావోయిజంను అంతం చేయాలన్న కోణంలో కేంద్రం ఇంకా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాల చేత కూంబింగ్ చేయిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఇంకా మావోయిస్ట్‌లు లొంగిపోవడాలు, ఎన్‌కౌంటర్‌లో హతమవుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇంకా కొందరు కీలక నేతలకు సంబంధించి ఆచూకీ కూడా తెలియాల్సి ఉండటంతో భద్రతా బలగాలు తమ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.

