
మహిళా సంఘాల సభ్యురాళ్లతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
మహిళా సంఘాలకు 553 టీజీఎస్ఆర్టీసీ బస్సులు
మహిళలను కోటీశ్వరులను చేస్తాం : షీఎం
మహిళలు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా ఆస్తులకు యజమానులుగా సంపద సృష్టికర్తలు ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మండల మహిళా సమాఖ్యలు కొనుగోలు చేసిన 553 టీజీఎస్ఆర్టీసీ బస్సులను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో హాజరైన మహిళా సంఘాల సభ్యులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మట్లాడారు. మహిళలు సమాజంలో సగం, ఆకాశంలో సగం అని పేర్కొంటూ అభివృద్ధి ఫలితాలలో కూడా వారికి సమాన భాగస్వామ్యం ఉండాలన్నారు.
మహిళలను రుణగ్రహీతల స్థాయి నుంచి ఆస్తుల యజమానుల స్థాయికి తీసుకువెళ్లే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 553 మండల మహిళా సమాఖ్యలు రూ.199.08 కోట్ల పెట్టుబడితో 553 బస్సులను కొనుగోలు చేసి టీజీఎస్ఆర్టీసీకి లీజుకు ఇచ్చాయని సీఎం వెల్లడించారు.ప్రతి బస్సుకు నెలకు రూ.69,468 అద్దె లభిస్తుండగా, మొత్తం 553 బస్సుల ద్వారా మహిళా సమాఖ్యలకు నెలకు రూ.3.84 కోట్ల ఆదాయం సమకూరుతోందని సీఎం తెలిపారు. ఇప్పటివరకు రూ.20.34 కోట్లకు పైగా అద్దె ఆదాయం మహిళా సమాఖ్యలకు అందినట్లు చెప్పారు.మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Next Story

