
పెద్ద ఘర్షణగా మారిన చిన్న ఆక్సిడెంట్, తండ్రీ కొడుకుల హత్య
ఎదురుగా మోటార్ సైకిళ్ల ఢీ, వాగ్వాదం అనంతరం కత్తులతో దాడులు
ఉత్తరప్రదేశ్ లోని కాన్పుర్ లో రెండు మోటార్ సైకిళ్లు మధ్య జరిగిన చిన్న రోడ్డు ప్రమాదం ఘర్షణగా మారి తండ్రీ కొడుకులు మృతి చెందగా, మరో కుమారుడు తీవ్రంగా గాయపడి అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం రాత్రి యశోద నగర్ లోని బృందావన్ బైపాస్ రోడ్డులో ఈ సంఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. చకేరీలోని సజరి ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల శివ్ నారాయన్ త్రివేదీ తన ఇద్దరు కుమారులు శివం, సత్యం మార్బుల్ షాప్ లో పని ముగించికుని ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో వారి బైక్ మరో బైక్ ను స్పల్ఫంగా ఢీ కొట్టింది. దీనితో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది.
కత్తులతో దాడి..
వాగ్వాదం తరువాత ఘర్షణగా మారింది. దీనితో వీరి ముగ్గురుపై అవతలి వ్యక్తులు హెల్మెట్లతో దాడికి దిగారు. అంతే కాకుండా కత్తులతో విచక్షణరహితంగా పొడవడంతో తండ్రి, పెద్ద కొడుకు అక్కడికక్కేడే మరణించారు. సత్యం పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స అందిస్తున్నారు. మృతుల ఛాతీ, పొట్ట, మొఖంపై కత్తి పోట్ల ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.
అక్కడ ఉన్న కొంతమంది దాడి చేసిన వ్యక్తులలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇతను స్థానికంగా డెలీవరీ బాయ్ అని తేలింది. అతడి శివ్ వర్మ అని పోలీసులు తెలిపారు. మిగిలిన ఇద్దరు కరణ్ వర్మ, ఉత్సవ్ అవస్థి అని, వారు సంఘటన స్థలం నుంచి పారిపోయారని, వారి కోసం ప్రత్యేక బృందాలు వెతుకుతున్నట్లు పోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ తెలిపారు. ఘటనకు కారణమైన మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.
Next Story

