
ప్రపంచ హాటెస్ట్ లొకేషన్స్‌లో ఆదిలాబాద్‌కు స్థానం..
ఆదిలాబాద్ వేడి రికార్డులు దాటింది. దేశవ్యాప్తంగా హీట్‌వేవ్ విస్తరణ. ఇక వానలు, గాలివానల మలుపు ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రపంచంలోనే హాటెస్ట్ ప్లేస్‌ల జాబితాలలో ఆదిలాబాద్ నిలిచింది. జిల్లాలో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలే ఇందుకు కారణం. తరుచుగా ప్రపంచంలో అత్యధిక వేడి ఉన్న ప్రాంతాల జాబితాలో ఆదిలాబాద్ టాప్ 100లో ఉంటుందని, అందుకే ఆదిలాబాద్‌ను వరల్డ్స్ హాటెస్ట్ లొకేషన్‌గా పేర్కొన్నాట్లు అధ్యయనం చేసిన అమెరికాకు చెందిన వాతావరణ ట్రాకింగ్ ప్లాట్‌ఫార్మ్ ఎల్‌డొరాడో వెదర్ తెలిపింది. సోమవారం ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రతలు 43.3 సెంటిగ్రేట్‌గా నమోదయింది. దీంతో ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల జాబితాలో ఆదిలాబాద్ 14వ స్థానంలో నిలిచింది. 13వ స్థానంలో మహారాష్ట్రలోని అకోల ప్రాంతం ఉంది.
అదే జాబితాలో వర్ధా, సోనేగావ్, ప్రయాగ్‌రాజ్, రాజ్‌నంద్‌గావ్ ప్రాంతాలు కూడా చోటు దక్కించుకున్నాయి. ఇది మధ్య భారతదేశంలో వేడి తీవ్రత విస్తరించిందని సూచిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆదిలాబాద్ భౌగోళిక పరిస్థితులు దీనికి కారణంగా కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో ఉండటం, విదర్భ ప్రాంతానికి సమీపంగా ఉండటం వల్ల పొడి ఉత్తర గాలులు ప్రభావం చూపుతున్నాయి. ఇంకా చల్లగా ఉండే ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదయ్యాయి. హైదరాబాద్ యూనివర్సిటీలో 39.7 డిగ్రీలు, రామచంద్రాపురంలోని బీహెచ్‌ఈఎల్ వద్ద 39.8 డిగ్రీలు నమోదయ్యాయి. ఎక్కువ ప్రాంతాలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉండి అలర్ట్ స్థాయిలో కొనసాగుతున్నాయి.
వాతావరణ శాఖ ప్రకారం, వచ్చే 24 గంటల్లో పరిస్థితులు మారే సూచనలు ఉన్నాయి. కొంతమంది జిల్లాల్లో మెరుపులు, గాలివానలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

