
సంచలనంగా మారిన అక్షితరాణి కేసు! వ్యవస్థ ఎక్కడ విఫలమైంది?
అక్షిత కేసు లేవనెత్తిన ప్రశ్న
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) సంచలనంగా మారిన అక్షితరాణి కేసు! వ్యవస్థ ఎక్కడ విఫలమైంది?
2) హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల వెనుక ₹10 వేల కోట్ల బిజినెస్!
3) హైదరాబాద్ హోటళ్లలో కల్తీ కలకలం.. 8 హోటళ్ల లైసెన్సులు రద్దు
1) సంచలనంగా మారిన అక్షితరాణి కేసు! వ్యవస్థ ఎక్కడ విఫలమైంది?
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీటెక్ విద్యార్థిని తాండ్ర అక్షితరాణి (20) మృతి సంచలనం సృష్టించింది. ఉస్మానియా యూనివర్సిటీలో రెండో సంవత్సరం చదువుతున్న ఆమె, సింగరేణి రెండో గనిలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఈ క్రమంలో గడ్డిమందు కారణంగా మృతి చెందింది. మొదట్లో ఆత్మహత్యగా భావించారు. కానీ పోలీసు దర్యాప్తు ముందుకు వెళ్లడంతో ఇది హత్యగా తేల్చారు. లెక్చరర్ జెట్టి నవీన్‌కుమార్‌ను ప్రధాన నిందితుడిగా, అక్షితపై లైంగిక దాడి ఆరోపణలతో బొమ్మకంటి రవికుమార్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు” పెద్దపల్లి డిసిపి బి.రాంరెడ్డి చెప్పారు.
పాలిటెక్నిక్ చదువుతున్న సమయంలో కాంట్రాక్ట్ లెక్చరర్ జెట్టి నవీన్‌కుమార్ (38) పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ, ప్రేమ పేరుతో అక్షితరాణి (20)ని లోబరుచుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో బీటెక్‌లో చేరిన అక్షిత.. శిక్షణ కోసం గోదావరిఖని సింగరేణి మైన్స్‌కు వచ్చిన సమయంలో ఫోర్‌మెన్ బొమ్మకంటి రవికుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని రవికుమార్ తనతో అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక దాడికి పాల్పడ్డాడని, గతంలో అక్షిత సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఫిర్యాదుపై సింగరేణి అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అక్షితపై లైంగిక దాడికి సంబంధించిన కేసులోనే బొమ్మకంటి రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు.
అక్షిత ఫోన్‌లో 'స్పై యాప్' ఇన్‌స్టాల్ చేసి నిఘా పెట్టిన లెక్చరర్ జెట్టి నవీన్‌కుమార్, ఆమె రవికుమార్‌కు ఎక్కడ దగ్గరవుతోందనే ఈర్ష్య, కక్ష ను పెంచుకున్నాడు. అంతే కాదు, ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. సెప్టెంబర్ 12న అక్షితను తన కారులో ఎక్కించుకుని, రవికుమార్‌ను ఇరికించడానికి నాటకం ఆడాలని నమ్మించి ఆమెతో బలవంతంగా పురుగుల మందు తాగించాడు. "నా చావుకు రవికుమారే కారణం" అని అక్షితతో సూసైడ్ లేటర్ రాయించి, దాన్ని ఫోటో తీసుకుని, ఆమె స్పృహ కోల్పోయాక ఇంటి వద్ద వదిలి వెళ్లాడు.సెప్టెంబర్ 13న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్షిత మరణించింది. ప్రాథమికంగా లభించిన ఆత్మహత్య లేఖ ఆధారంగా పోలీసులు దీనిని ఆత్మహత్యగా భావించారు.
బొమ్మకంటి రవికుమార్ వేధింపుల నుంచి బయట పడడానికి గతంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేక పోవడంతో ఇలా సూసైడ్ లెటర్‌తో బుద్ది చెప్పాలనుకుంది. కానీ కుట్రపూరితంగా నవీన్ విషం డోస్ ఎక్కువగా ఇవ్వడంతో ఆమె చనిపోయింది. అటు నవీన్, ఇటు రవి కుమార్ వేధింపులకు అక్షిత బలి అయిందని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ఆ దిశగా కేసు దర్యాఫ్తు జరుగుతోంది.
పోలీసులు ఎఫ్‌సీఐ అడ్డ రోడ్డు వద్ద ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజీలు, అక్షిత ఫోన్ కాల్ డేటా, ల్యాప్‌టాప్‌ను లోతుగా పరిశీలించడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. అక్షిత కారు ఎక్కిన దృశ్యాల ఆధారంగా లెక్చరర్ జెట్టి నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, రవికుమార్‌పై పగతో తానే పక్కా ప్లాన్‌తో విషమిచ్చి చంపినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ఈ కేసును ఆత్మహత్య నుంచి సెక్షన్ 103 (హత్య), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుగా మార్చారు.
“ఇంటర్న్‌షిప్‌లో విద్యార్థులకు పని నేర్పడం మాత్రమే సంస్థ బాధ్యత కాదు. సేఫ్టీ, గౌరవం, ఫిర్యాదు చేసే అవకాశం, వేధింపుల నుంచి రక్షణ కల్పించాలి. ముఖ్యంగా మహిళా విద్యార్థులకు సమస్య వస్తే ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ ఫిర్యాదు చేయాలి, చర్యలు ఎలా ఉంటాయో స్పష్టంగా తెలియాలి. ‘సేఫ్టీ పాలసీ ఉంది’ అనడం కాదు.. అవసరమైనప్పుడు అది పనిచేస్తుందా అనేదే ముఖ్యం” అని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (PDSU) విద్యార్థి విభాగంలో కీలక నాయకురాలిగా పనిచేసిన బి.సత్యవతి అన్నారు.
"ఒక యువతి కాలేజీ నుంచి బయటకు వచ్చి ఇంటర్న్‌షిప్‌కి వెళ్లినప్పుడు, ఆమె కుటుంబం, కాలేజీ, కంపెనీ అందరికీ ఒకే బాధ్యత ఉంటుంది. ఆమె అక్కడ పని నేర్చుకుని తిరిగి ఇంటికి సురక్షితంగా రావాలి. అందుకే మహిళల భద్రతను కేవలం CCTVలు, సెక్యూరిటీ గార్డులు, ఎమర్జెన్సీ నంబర్లకే పరిమితం చేయకూడదు.ఫిర్యాదు చేయగల వాతావరణం. ఫిర్యాదు చేసినప్పుడు వెంటనే స్పందించే వ్యవస్థ. సమస్య వస్తే విద్యార్థి లేదా ఉద్యోగి ఒంటరిగా మిగలకుండా చూసే బాధ్యత కూడా ఉండాలి అని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు చెప్పారు.
''కుల సమాజం ఎస్సీ ఎస్టీ విద్యార్థుల పట్ల వల్నరేబుల్ గా, వీరిని ఏమన్నను ఏమి కాదు అనే సామాజిక దృష్టి కోణం ఉంటుంది. ఉన్నత విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు, అకాడమిక్ కన్సల్టెంట్ ఉపాధ్యాయులు ఎస్సీ అమ్మాయిల్ని నేను చెప్పినట్టు వినకుంటే ఫెయిల్ చేస్తా' అనే బెదిరింపులతో లొంగదీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి అసహయ పరిస్థితిలో జరిగిన సంఘటన అక్షిత రాణి హత్యోదంతం. మహిళా కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మానవ హక్కుల కమిషన్లు ముఖ్యమంత్రి సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి నివారణా చర్యలు తీసుకోవాలి జరిగిన సంఘటన మీద సత్వర న్యాయం జరిగేలా, ఇలాంటి ఘటనలు దళిత అమ్మాయిల మీద ఇక మీదట జరగకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి" అని ప్రముఖ కవయిత్రి, పూర్వ అదనపు కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పనిచేసిన జూపాక సుభద్ర ఫెడరల్ తెలంగాణాతో చెప్పారు.
“సంస్థల్లో Prevention of Sexual Harassment (POSH), Internal Committee వంటి ఫిర్యాదు వ్యవస్థలు ఉండటం మాత్రమే సరిపోదు. ఇంటర్న్‌గా వచ్చే విద్యార్థినికి వాటిపై అవగాహన, ఫిర్యాదు చేస్తే రక్షణ, స్వతంత్ర విచారణ ఉండాలి. కాలేజీ, ట్రైనింగ్ సంస్థ, కంపెనీ మధ్య బాధ్యతలు కూడా స్పష్టంగా ఉండాలి. అక్షితరాణి కేసులో ఏ సంస్థ బాధ్యత విస్మరించిందో నిర్ధారించేందుకు దర్యాప్తు, అధికారిక ఆధారాలు అవసరం. అయితే ఈ ఘటన యువతులకు సురక్షితమైన ట్రైనింగ్, వర్క్‌ప్లేస్‌పై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. ‘సేఫ్టీ పాలసీ ఉందా?’ కంటే.. ‘అవసరమైనప్పుడు అది పనిచేస్తుందా?’ అనేదే కీలకం.” అంటారు ప్రముఖ అడ్వకేట్ జయవింద్యాల.
అక్షితరాణి మృతికి కారణమైన అనుమానితులపై ఫాస్ట్‌ట్రాక్ విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని MRPS వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగ డిమాండ్ చేశారు. కుటుంబానికి పరిహారం అందించాలని, SC/ST అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు విచారించాలని కోరారు. శిక్షణ, పరిశోధన కోసం వచ్చే విద్యార్థినుల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆత్మహత్యగా మొదలైన కేసు, పోలీసుల దర్యాప్తుతో హత్యగా మారింది. ఒక విద్యార్థిని ఇంటర్న్‌షిప్‌కు వెళ్లినప్పుడు ఆమె భద్రతను పర్యవేక్షించాల్సిన కాలేజీ, శిక్షణ సంస్థ, పని ప్రదేశం వ్యవస్థలు ఎంతవరకు పనిచేశాయన్న ప్రశ్నను ఈ ఘటన ముందుకు తెచ్చింది. సేఫ్టీ పాలసీలు, ఫిర్యాదు వ్యవస్థలు కాగితాలకే పరిమితమైతే, అక్షితల ప్రాణాలకు రక్షణ ఎక్కడ?
2) హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల వెనుక ₹10 వేల కోట్ల బిజినెస్!
హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు భక్తి వేడుకలతో పాటు భారీ ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నాయి. ఈ ఏడాది ఉత్సవాల సందర్భంగా తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో జరిగే మొత్తం వ్యాపారం రూ.10 వేల కోట్లు దాటే అవకాశం ఉందనే అంచనాలు చర్చకు వస్తున్నాయి. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అంచనా ప్రకారం హైదరాబాద్‌లోనే సుమారు రూ.10 వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. నగరంలో దాదాపు 1.5 లక్షల మండపాలు ఏర్పాటవుతున్నాయి. విగ్రహాలు, మండపాల అలంకరణలు, పూలు, పండ్లు, ప్రసాదాలు, టెంట్లు, బ్యాండ్ బృందాలు, డీజేలు, క్యాటరింగ్, రవాణా వంటి అనేక రంగాల్లో భారీగా లావాదేవీలు జరుగుతున్నాయి. అంచనాల ప్రకారం 2 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 4 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోంది.
చార్టర్డ్ అకౌంటెంట్ హరికృష్ణ పేర్కొన్నట్లు, “భక్తులు ఉత్సవాల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి నగర ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు చేరుతుంది. గణేశ్ ఉత్సవాలు మతపరమైన వేడుకతో పాటు పెద్ద వ్యాపార అవకాశంగా మారాయి.” అంటే గణేశ్ ఉత్సవాల వెనుక కనిపించని మరో కోణం హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం. మండపం నుంచి ప్రసాదం వరకు, పూల వ్యాపారం నుంచి రవాణా వరకు వేలాది వ్యాపారాలు, లక్షలాది మంది ఉపాధికి ఈ ఉత్సవాలు ఊతమిస్తున్నాయి.
తెలంగాణలో వినాయక చవితి ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకగా కాకుండా భారీ ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నాయని హరికృష్ణ కథనం చెబుతోంది.
నగరంలో సుమారు 1.5 లక్షల గణేష్ మండపాలు ఏర్పాటు అవుతున్నాయి. అలంకరణలకు దాదాపు రూ.150 కోట్లు, విగ్రహాలకు రూ.100 కోట్లు, ప్రసాదాల కోసం రూ.300 కోట్లు ఖర్చవుతున్నట్లు ఉత్సవ సమితి చెబుతోంది.
ఈ ఉత్సవాల వల్ల విగ్రహాల తయారీదారులు, పూలు–పండ్ల వ్యాపారులు, డీజేలు, బ్యాండ్ బృందాలు, టెంట్ నిర్వాహకులు, క్యాటరింగ్ సిబ్బంది, లారీ యజమానులు, అలంకరణ కార్మికులు ఇలా అనేక రంగాలకు ఆదాయం లభిస్తోంది.
ఈ ఉత్సవాల ద్వారా సుమారు 2 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 4 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. అంటే వినాయక చవితి హైదరాబాద్‌లో భక్తితో పాటు భారీ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలను కూడా నడిపిస్తున్న పండుగగా మారింది.
3) హైదరాబాద్ హోటళ్లలో కల్తీ కలకలం.. 8 హోటళ్ల లైసెన్సులు రద్దు
హైదరాబాద్‌లో హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. నగరవ్యాప్తంగా 200కు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడటంతో.. 8 ఆహార విక్రయ కేంద్రాల FSSAI లైసెన్సులు రద్దు చేశారు.
ఇంతకీ తనిఖీల్లో ఏం బయటపడింది?కొన్ని చోట్ల కాలం చెల్లిన మసాలాలు, సాస్‌లు, పాడైపోయిన చికెన్, మటన్ వంటి పదార్థాలను వంటల్లో ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని వంటశాలల్లో ఈగలు, బొద్దింకలు, మురికి నీరు కనిపించాయి. ఆహార పదార్థాలను మూతలు లేకుండా నిల్వ చేయడం, వంటశాలల్లో పరిశుభ్రత పాటించకపోవడం వంటి ఉల్లంఘనలూ బయటపడ్డాయి.
అంతేకాదు.. కొన్ని ఆహార కేంద్రాలు FSSAI లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ లేకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.దీంతో నిబంధనలు ఉల్లంఘించిన 8 సంస్థల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు.. మరికొన్ని రెహైదరాబాద్‌లో హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. నగరవ్యాప్తంగా 200కు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడటంతో.. 8 ఆహార విక్రయ కేంద్రాల FSSAI లైసెన్సులు రద్దు చేశారు.
ఇంతకీ తనిఖీల్లో ఏం బయటపడింది?
కొన్ని చోట్ల కాలం చెల్లిన మసాలాలు, సాస్‌లు, పాడైపోయిన చికెన్, మటన్ వంటి పదార్థాలను వంటల్లో ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని వంటశాలల్లో ఈగలు, బొద్దింకలు, మురికి నీరు కనిపించాయి. ఆహార పదార్థాలను మూతలు లేకుండా నిల్వ చేయడం, వంటశాలల్లో పరిశుభ్రత పాటించకపోవడం వంటి ఉల్లంఘనలూ బయటపడ్డాయి.
అంతేకాదు.. కొన్ని ఆహార కేంద్రాలు FSSAI లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ లేకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.దీంతో నిబంధనలు ఉల్లంఘించిన 8 సంస్థల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు.. మరికొన్ని రెస్టారెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉల్లంఘనల తీవ్రతను బట్టి జరిమానాలు కూడా విధించారు.
అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడితో ఆగడం లేదు. హైదరాబాద్‌లో ఇకపై కూడా ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు, సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.హోటళ్లు, రెస్టారెంట్లు కూడా వంటశాలల పరిశుభ్రత, నాణ్యమైన ముడి పదార్థాల వినియోగం, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులు సూచించారు.
మరి బయట తినే వినియోగదారులు ఏం చేయాలి? రెస్టారెంట్‌లో పరిశుభ్రత ఎలా ఉంది? ఆహారం తాజాగా ఉందా? వంటశాల, సిబ్బంది శుభ్రత పాటిస్తున్నారా? అనే విషయాలను గమనించాలి. ఆహారం నాణ్యతపై అనుమానం ఉంటే సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే.. రుచి కోసం బయట తినే ఆహారం.. ఆరోగ్యానికి ముప్పుగా మారకుండా చూడాల్సిన బాధ్యత హోటల్ నిర్వాహకులతో పాటు ఫుడ్ సేఫ్టీ వ్యవస్థపై కూడా ఉంది.స్టారెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉల్లంఘనల తీవ్రతను బట్టి జరిమానాలు కూడా విధించారు.
అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడితో ఆగడం లేదు. హైదరాబాద్‌లో ఇకపై కూడా ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు, సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.హోటళ్లు, రెస్టారెంట్లు కూడా వంటశాలల పరిశుభ్రత, నాణ్యమైన ముడి పదార్థాల వినియోగం, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులు సూచించారు.మరి బయట తినే వినియోగదారులు ఏం చేయాలి?రెస్టారెంట్‌లో పరిశుభ్రత ఎలా ఉంది? ఆహారం తాజాగా ఉందా? వంటశాల, సిబ్బంది శుభ్రత పాటిస్తున్నారా? అనే విషయాలను గమనించాలి. ఆహారం నాణ్యతపై అనుమానం ఉంటే సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలి.ఎందుకంటే.. రుచి కోసం బయట తినే ఆహారం.. ఆరోగ్యానికి ముప్పుగా మారకుండా చూడాల్సిన బాధ్యత హోటల్ నిర్వాహకులతో పాటు ఫుడ్ సేఫ్టీ వ్యవస్థపై కూడా ఉంది.

