CM Revanth Reddy at Amazon Data centre ceremony
x

తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు (వీడియో)

డేటా సెంటర్ ఏర్పాటుకు అమెజాన్ రు. 60 వేల కోట్లు పెట్టుబడులు పెట్టబోతోంది.


అమెరికాకు చెందిన అంతర్జాతీయ దిగ్గజ సంస్ధ అమెజాన్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టబోతోంది. దేశంలో రెండో డేటాసెంటర్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయబోతోంది. బుధవారం మధ్యాహ్నం డేటా సెంటర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. డేటా సెంటర్ ఏర్పాటుకు అమెజాన్ రు. 60 వేల కోట్లు పెట్టుబడులు పెట్టబోతోంది.

2025, జనవరిలో రేవంత్ బృందం దావోస్ పర్యటన సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అమెజాన్ ఆసక్తిచూసింది. అప్పట్లోనే డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది. 2025, డిసెంబర్లో హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ సందర్భంగా డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నది. దాదాపు 8 నెలల తర్వాత అప్పటి ఎంవోయూ ఈ రోజు కార్యరూపం దాల్చబోతోంది.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్ ఖాన్ పేట రెవిన్యు గ్రామం సర్వే నెంబర్ 120లో 48 ఎకరాల్లో డేటా సెంటర్ కార్యాలయ భవనాన్ని అమెజాన్ నిర్మించబోతోంది. ఈ భవన నిర్మాణానికే రేవంత్ శంకుస్ధాపన చేశారు. డేటా సెంటర్ భవన నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తి చేయాలని యాజమాన్యం టార్గెట్ గా పెట్టుకున్నది. 60 వేల కోట్ల రూపాయలను పదేళ్ళ వ్యవధిలో అమెజాన్ పెట్టుబడులుగా పెట్టబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భారత్ ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాలతో పాటు చందన్ వెల్లిలో మరో 98 ఎకరాలను కూడా డేటా సెంటర్ కార్యకలాపాల కోసం అమెజాన్‌కు ప్రభుత్వం కేటాయించింది.

అమెజాన్ ఏర్పాటుచేయబోతున్న డేటాసెంటర్ దేశంలోని అతిపెద్ద హైపర్ స్కేల్ డేటాసెంటర్లలో ఒకటిగా ప్రభుత్వం చెప్పింది. రు. 60 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టబోతున్న అమెజాన్‌కు ప్రభుత్వం వివిధ రూపాల్లో రు. 125 కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తోంది.

Read More
Next Story