రేవంత్ కు ట్రంప్ అభినందనలు (వీడియో)
x
Trump Avenue

రేవంత్ కు ట్రంప్ అభినందనలు (వీడియో)

నిజానికి తన పేరు పెట్టినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ట్రంప్ ధన్యవాదాలు చెప్పాలి.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ ఏమిటి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని అభినందించటం ఏమిటి ? అనే కన్య్ఫూజన్లో ఉన్నారు. అంత అవసరం లేదు. ఎందుకంటే హైదరాబాద్ లోని ఒక వీధికి రేవంత్ ప్రభుత్వం తన పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రిని ట్రంప్ అభినందించారు. నిజానికి తన పేరు పెట్టినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ట్రంప్ ధన్యవాదాలు చెప్పాలి. కాని ఇక్కడ ఉన్నది ట్రంప్ కదా అందుకనే ధన్యవాదాలకు బదులు అభినందనలు తెలిపారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే హైదరాబాద్ లోని ఫూనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అమెరికా కాన్సులేట్ ఆఫీసు ఉన్న రోడ్డుకు రేవంత్ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ ఎవిన్యు అని పేరు పెట్టింది. ఈనెల 23వ తేదీన ట్రంప్ పేరుతో ఉన్న శిలాఫలకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో అమెరికా రాయబారి సెర్గియో, కాన్సులేట్ అధికారి లారా విలియమ్స్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిపి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.

భారతదేశం మొత్తంమీద అమెరికా అధ్యక్షుడి పేరును ఒక రోడ్డుకు పెట్టడం ఇదే మొదటిసారి అని ట్రంప్ గొప్పగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ట్రంప్ అవెన్యు అని ఉన్న శిలా ఫలకం ఆవిష్కరణ ఫొటోను కూడా ట్రంప్ ట్విట్టర్లో జతచేసి సంబరపడిపోయారు.

Read More
Next Story