
యాలాల్ పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్ (ఫొటో సోర్స్ : ఎఎన్ఐ సౌజన్యంతో)
వికారాబాద్‌లో మరో పోక్సో కేసు :బండి కేసులో ఆలస్యంపై నెటిజన్ల ప్రశ్నలు
చట్టం అందరికీ సమానమేనా?.. యాలాల్ నిందితుడి అరెస్ట్‌తో బండి భగీరథ్ కేసుపై కొత్త చర్చ
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకోగా, ఎనిమిది రోజుల క్రితం నమోదైన బండి భగీరథ్‌పై పోక్సో కేసులో ఇప్పటికీ అరెస్ట్ జరగకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
యాలాల్ మండలంలో మైనర్ బాలికపై...
బండి భగీరథ్ పై పోక్సో కేసు ఘటన మరవక ముందే వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం పరిధిలోని ఓ గ్రామంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది.యాలాల్ మండలంలో మైనర్ బాలికపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.ఓ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల వయస్సు గల హిందూ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన షేక్ ఫరన్ (19) అనే యువకుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో “చార్జర్ కావాలి, నీళ్లు కావాలి” అనే సాకుతో ఇంట్లోకి నిందితుడు వెళ్లి అమాయక బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు యాలాల పోలీస్ స్టేషనులో ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు చెప్పారు.మైనర్ బాలికలపై జరిగే నేరాల పట్ల కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
కేసుపెట్టి 8 రోజులైనా...
వేరే నిందితులపై పోక్సో కేసు అయితే వెంటనే అరెస్ట్ చేస్తున్నారు... బండి కొడుకుపై కేసు అయ్యి 8 రోజుల అయినా ఇప్పటి వరకు అరెస్ట్ లేదని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఆరోపించారు.చట్టం ఇక్కడ సామాన్యుడికి ఒక లాగా, బండి కొడుకుకి ఒక లాగా వర్తిస్తుందని నెటిజన్లు పేర్కొన్నారు.
బాధితురాలి తల్లి లేఖ
బండి బగీరథ్ పోక్సో కేసులో బాలిక తల్లి తాజాగా లేఖ విడుదల చేశారు. 2025 సంవత్సరంలో తన కూతురికి బండి భగీరథ్ పరిచయం అయ్యాడని, మొదట స్నేహితుడులాగా ఉన్నా, మా కూతురిని మానసికంగా లోబర్చుకుని, చదువు కోకుండా డిస్టర్బ్ చేశాడని గుర్తించామని బాధిత బాలిక తల్లి రాసిన లేఖలో పేర్కొన్నారు. గతంలో భగీరథ్ తనపై పలు మార్లు లైంగిక దాడి చేశాడని, డిసెంబర్ 31వ తేదీన బలవంతంగా మద్యం తాగించి ఒకసారి, మరోసారి ఓ అపార్టుమెంటులో అఘాయిత్యానికి పాల్పడ్డాడని తన కూతురు చెప్పిందని తల్లి పేర్కొన్నారు. రాజకీయ శక్తులతో పోరాడటానికి చట్ట పరంగా, మానసికంగా సిద్ధమవుతున్న రోజుల్లో ఏప్రిల్ 21వ తేదీ 2026లో తమ కూతురిపై బ్లాక్ మెయిల్ కేసు పెట్టారని చెప్పారు.
పోలీసులకు ఫిర్యాదు చేశాం...
‘‘ఏప్రిల్ 22వ తేదీన సంగప్ప అనే వ్యక్తి మా ఇంటికి వచ్చి ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించాడు. ఏప్రిల్ 23వ తేదీన సంగప్ప ద్వారా బండి సంజయ్‌ని కలిసాము, న్యాయం చేస్తారు అనుకుంటే మా గురించి దారుణంగా మాట్లాడి, బెదిరించి పంపించేశారు.నా కూతురి కోసం కొట్లాడాలని నిర్ణయించుకుని మే 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు నా కూతురిని తీసుకుని వెళ్ళాను కానీ అక్కడి పోలీసులు ఎంత వేడుకున్నా ఫిర్యాదు తీసుకోకుండా గంటల తరబడి మమ్మల్ని వెయిట్ చేయించారు...ఎన్నో సార్లు బతిమాలిన తరువాత ఎట్టకేలకు బండి భగీరథ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు’’ అని బాధిత బాలిక తల్లి చెప్పారు.
నా కూతురి ఐడెంటిటీ రివీల్ చేయకండి
‘‘మీడియా వారిని, సోషల్ మీడియా యూజర్లను చేతులు జోడించి వేడుకుంటున్నాను, దయచేసి మా కూతురి ఫొటోలు, ఆమె ఐడెంటిటీ రివీల్ చేయకండి.మరో వైపు ఆమె డేట్ ఆఫ్ బర్త్ గురించి అనేక వాదనలు వినిపిస్తున్నాయి, డాక్యుమెంట్లలో ఉండే డేటా నా కూతురు అనుభవించిన క్షోభను చెరిపి వేయలేదు...పోక్సో కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ పట్ల వేగంగా, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నా కూతురికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను’’అంటూ బాధిత బాలిక తల్లి లేఖలో పేర్కొన్నారు.
Next Story

