తెలంగాణ హై కోర్టుని ఆశ్రయించిన అషు రెడ్డి
x

తెలంగాణ హై కోర్టుని ఆశ్రయించిన అషు రెడ్డి

సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కేసు కొట్టివేయాలని కోరుతూ పిటిషన్


తన పై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ నటి అషు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

ఎలాంటి ఆధారాలు లేకుండా సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదు చేయడం పట్ల ఆమె పిటిషన్ లో అభ్యంతరం తెలిపారు. పోలీసులు తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.తన ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని నటి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది.

నటి ఫిర్యాదు మేరకు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగానే ఈ వివాదం మరో మారు సంచలనమైంది.ఆమె పై ప్రవాస భారతీయ కుటుంబం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అషు రెడ్డి వార్తలలో నిలిచారు. ధర్మేంద్ర వద్ద 9 కోట్ల 35 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఆమెపై ఫిర్యాదు ఉంది. పెళ్లి పేరిట తన కుమారుడు ధర్మేంద్ర ని మోసం చేసినట్టు తండ్రి సత్య నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.2018నుంచి లండన్లో ఉంటున్న ధర్మేంద్రను మోసం చెసినట్టు తండ్రి సత్యనారాయణ చెప్పారు.

ధర్మేందర్ కి ఇది వరకే పెళ్లయి , విడాకుల కోసం అప్లై చేసినట్టు ఆశు రెడ్డి తండ్రి కొయ్య వెంకట కృష్ణా రెడ్డి మరో వైపు చెబుతున్నారు. .ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తన కుమారుడిని మోసం చేసినట్టు ధర్మేంద్ర తండ్రి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తల్లి ప్రోత్సాహంతో

తల్లి ప్రోత్సాహంతోనే అషు రెడ్డి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి నట్టు సమాచారం. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అషురెడ్డి వీడియోల వల్ల సోషల్ మీడియాలో వైరల్ అయ్యి తర్వాత పాపులర్ అయ్యారు.

బిగ్ బాస్ 3 తో ఆమె ఒక్కసారిగా అందరినీ ఆకర్షించారు. అషు రెడ్డి అసలు పేరు అశ్విని రెడ్డి. సెప్టెంబర్ 15 1995 అమెరికాలోని డల్లాస్ లో పుట్టింది తర్వాత ఇండియాకి మారారు. 2018లో చల్ మోహన్ రంగా, 2022లో ఫోకస్ చిత్రాల్లో నటించారు. ఇంస్టాగ్రామ్ వీడియోల ద్వారా ప్రసిద్ధి చెందారు. బిగ్ బాస్ 3 లో కనబడిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఆమెను గుర్తించింది. తండ్రి వెంకట కృష్ణారెడ్డికి చిత్ర పరిశ్రమలో వెళ్లడం ఇష్టం లేకపోయినప్పటికీ ఆషు రెడ్డి తల్లి ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు.

అషు రెడ్డి సోదరి కూడా

ఆషు రెడ్డి సోదరి దివ్యారెడ్డి కూడా ధర్మేంద్ర నుంచి 50 లక్షలు వసూలు చేసినట్టు సత్యనారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు.ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి వద్ద పెళ్లి కోసం ప్రత్యేక పూజలు చేయడానికి ధర్మేంద్ర వద్ద నటి ఆశు రెడ్డి కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసిన ఆరోపణలు ఉన్నాయి. వివాహం చేసుకోవాలని ధర్మేంద్ర పదే పదే కోరినప్పటికీ అతని తో పెళ్లి ని అషు రెడ్డి వాయిదావేస్తూ వచ్చారు.

నటి ఆషు రెడ్డి వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది.

Read More
Next Story